Latest Updates
-
ఉదయాన్నే ఒక కప్పు చాలు.. ఒంటి నొప్పులను తగ్గించి, పుష్టిగా బలాన్ని ఇచ్చే హెల్తీ బ్రేక్ఫాస్ట్.! -
బెంగాలీ స్పెషల్ రాధాభల్లవి పూరీ..ప్లేట్ లోనే స్వర్గం కనిపించేస్తది! -
మరో పది రోజుల్లో మంగళ గోచారం.. వీరికి దీనికి మించిన మంచి సమయం ఉండదు.! -
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.!
తల్లి తండ్రుల జీవన శైలి పిల్లలను ఎలా ప్రభావిస్తుంది?

ఈ పరిశోధన యూనివర్శిటీ ఆఫ్ ఆల్ బెర్టా లో రీసెర్చర్ క్రిస్టినా రినాల్డి నిర్వహించారు.పిల్లలను పెంచటంలో అతి కఠినంగా వున్నా లేదా అతి తేలికగా పెంచినా అవి వారిలో వ్యతిరేక ప్రవర్తనలు చూపుతాయని, కనుక కఠినంగాను లేదా మరీ సరళంగాను కాకండా మధ్యస్ధ ప్రవర్తనలో పిల్లలను పెంచాలని రీసెర్చర్లు సూచించారు.
పిల్లలను పెంచటంలో తల్లి కనుక మరింత సరళంగా వుంటే లేదా తండ్రి మరింత కఠినంగా వుంటే, పిల్లలు తమ ప్రవర్తనలో వ్యతిరేక ప్రభావాన్ని చూపుతున్నారని, కోపం, వివాదించటం, వారి బొమ్మలవంటివి పంచుకొనటానికి ఇష్టపడకపోవటం లాంటి అలవాట్లు ఏర్పరుచుకుంటున్నారని రీసెర్చి తెలిపింది. తండ్రి కనుక ఖచ్చితంగాను, సరళంగాను లేదా స్నేహపూరిత ప్రవర్తన పిల్లల పట్ల ఆచరించినట్లయితే, పిల్లలు కూడా చాలావరకు పాజిటివ్ ప్రవర్తన చూపారని రీసెర్చి తెలిపింది.
అధికార పూరితంగా వుండటం మంచిదే అయితే, దీనికి పిల్లల విషయంలో కొన్ని సరిహద్దులు వుంటాయి. వారికి మీ నుండి ఏం ఆశించాలనేది బాగా తెలుసు. పిల్లలు వారి పర్యావరణాన్ని ఎప్పటికపుడు పరీక్షిస్తారు. వారికి ఏం కావాలనేది చెపటం వారికి కష్టమవుతుంది. కాని వారికి ఎన్నో ఆశలు వుంటాయి అంటారు రీసెర్చర్ రినాల్డి.
తల్లితండ్రుల ప్రవర్తనా విధానం ఎప్పటికపుడు వారిపట్ల మారుతూంటుంది. దీనికి కారణం వారిలోని మూడ్ మరియు అలసట వంటివి. దీనితో పిల్లల పట్ల వారి ప్రవర్తన సైతం మారుతుంది. దీనికి మార్గం తల్లి లేదా తండ్రి వారి పరిస్ధితులను బట్టి పిల్లల హద్దులను గుర్తించాలి. అదే రకంగా పిల్లవాడి తోడబుట్టిన వారితో కూడా కొన్ని హద్దులను ఏర్పరచాలి. ఎందుకంటే, పిల్లల కొపం ఎవరి స్ధాయిలో వారికుంటుంది.
తల్లి తండ్రులు కూడా ఒకప్పటి పిల్లలే, వారు వారి బాల్యదశను గుర్తుకు తెచ్చుకొని తమ తల్లితండ్రులు సైతం తమనను సరిగా పెంచలేదనే భావిస్తూంటారు. మరి మీరు మీ పిల్లలను ఎందుకు అదే విధంగా పెంచుతారు. మీరు కూడా మానవులే కాదా? మీకు జరిగిన లోపాలను గుర్తించి వాటిని మీరు మీ పిల్లలలో సరిదిద్దాలి. కొంతమంది పిల్లలకు అధిక శ్రధ్ధ, జాగ్రత్త తీసుకోవలసి వస్తుంది. కాని తల్లితండ్రులు పిల్లల కందరకు ఒకే రకమైన నియమాలు ఆచరిస్తూంటారు. అది సరికాదు.
సమర్ధవంతమైన తల్లి తండ్రులు అవ్వాలంటే చాలా మార్గాలుంటాయి. కాని అవి పిల్లల తీరునుబట్టి వారి గుణగణాలనుబట్టి ఎప్పటికపుడు మారుతూండాలి. ఒకే రకమైన మూస విధానాలు పాటించి పిల్లలకు ప్రవర్తనా సమస్యలు తేరాదు అంటారు రీసెర్చర్లు.కనుక పిల్లలపట్ల, తల్లితండ్రులుగా ఆచరణీయ విధానాలలో ఒకటిగా ముందు తల్లితండ్రులు తమ ప్రవర్తన మార్చుకొని వాటి ప్రభావం పిల్లలపై పడేలా చూడాలి.



Click it and Unblock the Notifications
