Latest Updates
-
చూస్తుంటేనే నోరూరిపోయే డబుల్ లేయర్ చాక్లెట్ బర్ఫీ.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
నూనెలో డీప్ ఫ్రై లేకుండానే కరకరలాడే మసాలా పల్లీలు..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
మటన్ గిల్లీ బిర్యానీ..వాసనకి పక్కింటోళ్లు కూడా ప్లేట్ పట్టుకుని పరుగెట్టుకొస్తారు! -
ప్రతి రాత్రి సోంపు నీరు తాగుతున్నారా? నెల రోజుల్లో శరీరంలో జరిగే అద్భుత మార్పులివే! -
బియ్యం, మినప్పప్పు లేకుండానే అటుకులతో అప్పటికప్పుడు క్రిస్పీ మసాలా దోసె..అబ్బబ్బబ్బా అనాల్సిందే! -
చలికాలంలో రోజూ ఒక బెల్లం ముక్క తింటే ఏమవుతుంది? రోజుకు ఎంత, ఎలా తినాలో తెలుసా? -
బాలల దినోత్సవం స్పెషల్: ఓవెన్ లేకపోయినా పర్లేదు.. స్టవ్ మీదనే క్రిస్పీగా వేరుశెనగ బిస్కెట్లు చేసుకోండిలా! -
పాస్ వర్డ్ లో కామా పెడితే ఎవ్వరూ హ్యాక్ చేయలేరా? వైరల్ టెక్ ట్రిక్ వెనుక వాస్తవం ఇదే! -
కారంగా, కమ్మగా ఉండే కరివేపాకు చికెన్ రోస్ట్.. ఈ సీక్రెట్ మసాలాతో రుచి డబుల్! -
మన దేశం మధ్యలో ఉండి భారతీయులే వెళ్లలేని వింత గ్రామం..ఎక్కడుంది? ఆ కథేంటి?
మీ పిల్లలు అబద్ధాలు చెపుతుంటే ఏం చేయాలి?

అసలు పిల్లలు ఎందుకు అబద్ధాలు చెపుతారు?
మీ పిల్లాడు చిన్నవయసు వాడు కాబట్టి ఎంతో తేలికగా అబద్ధాలు ఆడేస్తున్నాడు అనుకుంటే అది సరికాదు. పిల్లలు మీకంటే తెలివైనవారు. వారు ఏం మాట్లాడుతునన్నారనేది వారికి ఖచ్చితంగా తెలుసు. అబద్ధాలు చెపటమనేది ఒక అలవాటు. దానికి వయసుతో సంబంధం లేదు. అది మీ పిల్లాడి స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని తెలుపుతూంటుంది. మీ విశ్లేషణ మీ పిల్లాడు ఏ రకమైన అబద్ధాలు చెపుతున్నాడనేదానిపై ఆధారపడి వుంటుంది.
ఒక్కొక్కపుడు పిల్లలు నిజం చెప్పటానికి భయపడతారు. వారు ఏదైనా తప్పు చేశామనుకుంటే, వారు దండించబడతారనుకుంటే, అందుకు భయపడి అబద్ధం చెప్పేస్తారు. ఉదాహరణగా...మీ కిష్టమైన నెయిల్ పాలిష్ బాటిల్ ఆటలో ఒలక పోశారు, లేదా ముఖ్యమైన పత్రాలు పాడుచేశారు ఇక వారికి దండన తప్పదని భావించి చేయలేదని అబద్ధం చెప్పేస్తారు. అయితే, తప్పు చేశామన్న భావన వారి ముఖాలలో మీరు తప్పక చూడవచ్చు.
సరే, ఇక కారణం తెలిసింది కనుక మీరు అంతటితో వదిలేయకండి. చిన్నపాటి శోధన చేయాలి. ఇది వారిపట్ల మీరు కఠినంగా వున్నారని శిక్షిస్తారని వారికి తెలుస్తుంది. సరైన కారణాలు లేకుండా మీ బిడ్డ అబధ్ధమాడేస్తూంటే, అతనికి అసలు భయం లేదన్నమాట. స్కూల్లో ఏం చేశావ్ అని మీరడిగితే, వేరే గ్రహం నుండి ఒక వ్యక్తి వచ్చాడని వాడు అక్కడ తిరుగుతుంటే చూశానని అతను చెపుతే, వాడి ఊహాగానాలు కధలుగా మీకు చెప్పేస్తున్నాడన్నమాట. అది పూర్తి అబద్ధమని మీకు కూడా తెలుసు.
మరి ఇక మీ పిల్లాడు ఇదే విధంగా పెద్దవాడైన తర్వాత కూడా కధలు చెపుతూంటే ఇక అబద్ధాలాడటానికి అలవాటు పడిపోయాడన్నమాటే. అనవసరమైన విషయాలకు కూడా అతడికి ఎల్లపుడూ నోటివెంట అబద్ధాలు తప్పనిసరిగా వచ్చేస్తూనే వుంటాయి. ఈ తప్పని సరి అబద్ధాలను లేదా అనవసర అబద్ధాలను మాన్పించటానికి మీ పిల్లాడికి....కధలు చెపటం మంచిదే కాని ప్రశ్న అడిగినపుడు సరి అయిన సమాధానం ఇవ్వటం చేయాలని వివరించాలి. ఊహలతో కధలు చెపటానికి వాస్తవానికి తేడా వుంటుందనేది వాడికి వివరించి చెప్పాలి. పిల్లలు ఎందుకు అబద్ధమాడతారనేది ఇక మీకు తెలుసుగనుక, వారిని సరిదిద్దటంలో తేలికగా వ్యవహరించండి.



Click it and Unblock the Notifications
