Latest Updates
-
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.!
జీవం లేని బాల్యం...ఆశలు తీరని పెద్దలు!

మరి తల్లితండ్రులు ఈ విధంగా పిల్లలపై ఒత్తిడి ఎందుకు తెస్తున్నారు?
ప్రస్తుత స్కూలు వాతావరణం తల్లి తండ్రులను పిల్లలపై ఒత్తిడి తెచ్చేలా చేస్తోంది. స్కూలు, ట్యూషన్, టన్నుల కొద్ది హోం వర్క్, మొదలైనవాటితో పిల్లలకు తమ సమయం అంటూ వుండటం లేదు. ఆటపాటలు తగ్గిపోతున్నాయి. ట్యూషన్ సమయం అధికంగా వుంటే పిల్లలకు ఏకాగ్రత పెరుగుతుందని తల్లితండ్రులు భావిస్తారు. తల్లితండ్రులు ఉద్యోగులైతే, పిల్లలను ట్యూషన్లకు పంపి,స్కూలుకు పంపి ఎంతో హాయి భావిస్తారు.
పేరెంట్స్ కూడా ఇతర పిల్లల పేరెంట్స్ తో పోటీ పడతారు. తమ పిల్లవాడికి ఇతర పిల్లలకంటేకూడా విద్యలో అధికంగా మార్కులు రావాలని కోరతారు. తల్లితండ్రులకుండే అత్యాశలు కూడా పిల్లల భవిష్యత్తులను పాడు చేస్తున్నాయి. ఏవో కొన్ని సార్లు మాత్రం పిల్లలు తమంత తాము కెరీర్ ఎంపిక చేసుకునే అవకాశం వారికి దొరుకుతోంది. చాలా సార్లు పిల్లలు తల్లితండ్రుల ఎంపికలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి తల్లి, తండ్రి వారి బిడ్డ ఇంజనీర్ లేదా డాక్టర్ కావాలని భావిస్తారు. కనీసం బిడ్డ ఎంపిక దేనిపైన వుందనేది కూడా తెలుసుకోరు. పెరిగిపోతున్న పోటీ తత్వం పిల్లలకు ఒత్తిడి కలిగిస్తోంది. తల్లితండ్రులు తమ పిల్లలు అన్ని రంగాలలో వికసించాలని కోరుకుంటున్నారు. దానితో వారిలో ఆందోళన ఒత్తిడి పెరిగిపోతున్నాయి.
పిల్లలపై వున్న ఒత్తిడి ప్రభావం ఎలా వుంది?
వారికి అనారోగ్యాలు కలుగుతున్నాయి. రక్తపోటు, భవిష్యత్తును గురించిన ఆలోచనలు మానసిక అశాంతిని కలిగిస్తున్నాయి. వారిని స్వార్ధపరులుగా తయారు చేస్తున్నాయి. వారికి కలిగే వత్తిడికి వారు ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారు. చాలామంది విద్యార్ధులు వారు ఆశించిన స్ధాయికి లేదా తల్లితండ్రులు ఆశించిన స్ధాయిలకు ఎదగలేక ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. నేటి పిల్లలకు గతంలోని పురాణ గాధలపై ఆసక్తిలేదు. వారు ఇపుడు వయసుకి మించిన పరిపక్వత కలిగి వున్నారు.
పిల్లలలో ఒత్తిడి ఎలా తగ్గించాలి?
పిల్లలతో వారి అంశాలు, సమస్యలకు సంబంధించి మాట్లాడండి. వారితో స్నేహంగా వ్యవహరించండి.
వారి రోజువారీ చర్యలు, వారికి ఆడుకునే సమయం దొరికేలా ప్రణాళిక చేయండి. ఆటలు, లేదా ఇతర క్రీడలలో వారికి అవకాశం కల్పించి వారి మైండ్ వ్యతిరేక దిశగా పోకుండా చూడండి.
వారిని ఇతరులతోపోల్చకండి. అధిక స్రమాణాలు లేదా ఆవలు వారికి పెట్టకండి. అవి వారు సాధించేందుకు కష్టమవుతుంది. వారి మైండ్ అసలు ఏ రంగంపై వుందో తెలుసుకోండి. అవసరమనుకుంటే కౌన్సెలింగ్ నిర్వహించండి.
పిల్లలలో పెరిగే ఒత్తిడి తల్లితండ్రులపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. కనుక పిల్లల ఒత్తిడి విషయంలో ప్రశాంతంగా, సమగ్రంగా వ్యవహరించండి. మీకు పిల్లల ఒత్తిడి ఎలా తగ్గించాలి అనే అంశంలో కనుక వేరే ఏవైనా మార్గాలు తెలిస్తే వాటిని మాతో తప్పక పంచుకోండి.



Click it and Unblock the Notifications
