Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
పిల్లలకొచ్చే వ్యాధులు ...వాటికి జాగ్రత్తలు!

ఆర్ ఎస్ వి క్రిమి చాలావరకు రెండు సంవత్సరాల లోపు పిల్లలకే సోకుతుంది. ముందుగా అది జలుబు వంటి లక్షణాలు కలిగిస్తుంది. ముందస్తుగా పుట్టిన పిల్లలకు లేదా గుండె వ్యాధులు కల పిల్లలకు అతి త్వరగా సోకుతుంది. పిల్లలలో వచ్చే ఊపిరితిత్తుల సమస్యలకు చాలావరకు ఈ క్రిమి కారణంగా వుంటుంది. ఒక సారి ఈ క్రిమి శరీరంలో చేరిందంటే, వ్యాధి నివారణ కొంచెం కష్టంగానే వుంటుంది.
రీసెర్చర్లు నిర్వహించిన సర్వేలో షుమారు 3.4 మిలియన్ మంది పిల్లలు ఈ వ్యాధికి గురై చికిత్స కొరకు ఆస్పత్రికి చేరటం జరుగుతోంది. ఒక మారు తగ్గినప్పటికి, పిల్లలలో ఈ వ్యాధి మరోమారు లేదా తరచుగా కూడా వచ్చే అవకాశాలుంటాయని రీసెర్చర్లు వెల్లడించారు. వ్యాధి నివారణకు గాను పిల్లలను వీలైనంతవరకు చలి వాతావరణానికి గురిచేయరాదు. సాధారణంగా ఈ వ్యాధి వర్షాకాలం లేదా చలికాలాలలో అధికంగా వస్తుంది. ఆ సమయంలో పిల్లలను వీలైనంతవరకు వెచ్చటి గుడ్డలలో వుంచటం, లేదా వెచ్చని దుస్తులు ధరింప చేయటం వంటివి చేయాలి. పాలు పట్టే తల్లులైతే వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా ఈ క్రి మి ఆహార పదార్ధాలద్వారా లేదా గాలి ద్వారా, నీటిద్వారా సోకే ప్రమాదం వుంది. అందుకని తల్లి తినే ఆహార పదార్ధాలు కూడా ఎప్పటికపుడు వేడిచేసినవై వుండాలి. తాగే నీరు సైతం గోరు వెచ్చగా వుండి హాని కలిగించనిదై వుండాలి. బిడ్డకు ఈ సమయంలో పట్టే బాటిల్ పాలు ఎప్పటికపుడు వేడిగా లేదా గోరు వెచ్చగా వుండేలా జాగ్రత్తతీసుకోవాలి. వ్యాధి ముదరకముందే, వైద్యులను సంప్రదించి మందులు వాడాలి.



Click it and Unblock the Notifications
