Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
టీ.వి.లు, ఇంటర్నెట్ ల మత్తులో పిల్లలు!

ఇక పెద్దవారు, కంప్యూటర్లు, టి.వి.లముందు ప్రతిరోజు కనీసం అంటే 6. 1 గంటలు కూర్చుంటున్నారట. ఈ సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతోంది. నేడు పుట్టిన ఒక శిశువు ఏడు సంవత్సరాలు వచ్చేసరికి స్క్రీన్ ముందు కనీసం ఒక సంవత్సరం 24 గంటల రోజులు గడుపుతున్నాడట. నేడు ఆధునికంగా వస్తున్న పిల్లల తరం స్క్రీన్ కు బాగా అలవాటు పడి చెడిపోతున్నారని రీసెర్చర్ డా. అరిక్ సిగ్మన్ వెల్లడించారు. మన బ్రెయిన్ లోని రసాయనాలను ఈ టి.వి.లు, కంప్యూటర్లు చెడగొడుతున్నాయని రీసెర్చర్ తెలిపినట్లు స్కై న్యూస్ ఏజన్సీ పేర్కొంది.
కంప్యూటర్ ఆటలు, టి.వి.లు చూస్తూ కూర్చోవడం వంటివి ఇప్పటివరకు మనం చెడుగా భావిస్తున్న జూదం ఆటలకిందే వచ్చి పిల్లలు, పెద్దలు చెడిపోయేలా చేస్తున్నాయని, గతంలో జూదం బ్రెయిన్ లో రసాయనిక మార్పులు కలిగించినట్లు, నేడు ఇవి కూడా ప్రత్యేకించి డోపమైన్ అనే రసాయనం ఉత్పత్తి చేస్తున్నాయని, మీకిష్టమైన పని చేస్తుంటే మీరు దానిని మంచిగా భావించటం అనేది ఈ రసాయనం వలన కలుగుతుందని రీసెర్చర్లు తెలిపారు.
ఈ డోపమైన్ కనుక బ్రెయిన్ ఎదిగే దశలో పిల్లలలో ఇదే తీరులో వారానికి అనేక గంటలు చొప్పున ఉత్పత్తి అయితే, ఇక వీరు దినంలో చాలావరకు వారి భవిష్యత్తులో స్క్రీన్ ల వంక చూడలేని పరిస్ధితి వస్తుందని తెలిపారు. ఈసమస్యను అధిగమించటానికి గాను డా. సిగ్మన్ , కనీసం మూడు సంవత్సరాల వయసు వచ్చేంతవరకు పిల్లలకు స్క్రీన్ చూపవద్దని, ఇక యుక్తవయసు పిల్లలకు తక్కువ సమయం కంప్యూటర్లకు, టీవిలకు కేటాయించాలని తెలిపారు.
స్క్రీన్ ఎంతసేపు చూడాలనే అంశంపై బ్రిటన్ ప్రభుత్వం తల్లితండ్రులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. కొన్ని దేశాలలో ఏడు సంవత్సరాలవయసు దాటిన వారికి రోజుకు రెండు గంటలు, వినోదంగా మాత్రమే స్క్రీన్ సమయం కేటాయించినట్లు రీసెర్చి వెల్లడించింది.



Click it and Unblock the Notifications