Latest Updates
-
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి!
ఒత్తిడికి చిన్నా ...పెద్దా.. భేధం లేదా?

పిల్లలతో స్నేహంగా ఉండండి - మీ పిల్లల బాధలను పంచుకోండి. వారితో స్నేహం చేయండి. ఒక్కొక్కపుడు వారికి అనవసర భయాలుంటాయి. వాటిని మీరు తేలికగా పోగొట్టవచ్చు. మ్యూజిక్ పెట్టండి. పిల్లవాడితో కొంత సమయం ఆటలాడండి. ఇవి చిన్న చేష్టలైనా సరే పిల్లవాడిలో ఒత్తిడి తగ్గిస్తాయి.
నిద్ర - మీ పిల్లవాడు ప్రతిరోజూ తగినంత నిద్రపోయేలా చూడండి.ఒత్తిడి తగ్గేందుకు గాఢ నిద్ర మంచి మందు. పిల్లలకు కనీసం 9 నుండి 10 గంటల నిద్ర కావాలి. అతడికి చదువు, లేదా ఇతరంగా ఎంత ఒత్తిడి ఉన్నప్పటికి, ప్రధానంగా ఈ నిద్ర అతనికి పట్టేలా చేయండి. నిద్ర కొరవడితే, అతనికి మానసిక, శారీరక సమస్యలు వస్తాయి.
మీ పిల్లవాడితో ఆటపాటలు - మీ బిడ్డతో కలసి ఆడండి. పాడండి. అతనికి ఒత్తిడి తగ్గుతుంది. అయితే, పిల్లవాడి కారణంగా మీ భాధ్యతలు మరువకండి. అంతేకాదు, అతని కిష్టమైన పనిని చేయనీయండి. ఇది అతడిలోని ఒత్తిడి బాగా తగ్గేందుకు తోడ్పడుతుంది. అతని మైండ్ పూర్తిగా ఇష్టమైనదానిలో ఉంటే, ఒత్తిడి అధికంగా ఉండదు.
రొటీన్ కు భిన్నంగా - ప్రతిరోజూ చేసే పనులకు భిన్నంగా కొన్ని పనులు చేయనీయండి.అపుడపుడూ బయటకు తీసుకు వెళ్ళి ఆనందింపచేయండి. ఈ చర్య పిల్లల ఒత్తిడి బాగా తగ్గిస్తుంది.దిన పని భారం తగ్గినట్లు వారు భావిస్తారు. విందులు, విహార యాత్రలు అతనికి ఎంతో తేలికగా భావించేలా చేస్తాయి.
గాఢ శ్వాస - మీ పిల్లవాడికి గాఢ శ్వాస ఎలా తీయాలో నేర్పించండి. మీ బిడ్డ ఎపుడు కోపంగా వున్నా లేక, ఒత్తిడిగా వున్నా గాఢ శ్వాస తీస్తే ఊరట కలుగుతుంది. దీనివలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రధానంగా ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. ఒత్తిడి తగ్గించే అన్ని పద్ధతులకంటే కూడా ఇది మంచి పద్ధతి.
చాక్లెట్ లు మరియు బహుమతులు - మీ పిల్లవాడికి చాక్లెట్లు లేదా ఇతర బహుమతులు అతడు ఒత్తిడి భావిస్తున్నపుడు ఇవ్వండి. పిల్లలు వాటిని ఎంతో ఇష్టపడతారు. వారికి అంతకు మించిన ఆనందం ఉండదు. ఆ సమయంలో అన్నీ మరచి ఆ కొత్త బహుమానం తీసుకునే సంతోషంలో ఉండిపోతారు.
ఒత్తిడి తగ్గించే ఈ మార్గాలు పాటించి మీ పిల్లవాడు తన ఆందోళనలు, మానసిక వ్యధలనుండి దూరం అయ్యేలా చూడండి.



Click it and Unblock the Notifications
