Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
టీనేజ్ ప్రేమలు - తల్లితండ్రుల పాట్లు!

టీనేజ్ భ్రమలు అనేకంగా వుంటాయి. అన్నీ ఎంతో సుందరంగా కనపడతాయి. మీ బిడ్డకు ప్రతివారు తనను నిజంగా ప్రేమించేవారుగా కనపడతారు. కాని ఈ భ్రమలు మోసపుచ్చుతాయి. కనుక తల్లితండ్రులు తప్పనిసరిగా ఈ వ్యవహారాలపట్ల జాగ్రత్త వహించాలి. మారుతున్న వయసు సహజం. తల్లితండ్రులు ఎదుగుతున్న బిడ్డకు స్నేహితుడుగా వ్యవహరించాలి. కోపం చేసి కేకలు పెట్టినందువలన ప్రయోజనం వుండదు. గట్టిగా వారికి చెపుతూ మీ టీనేజ్ అననుభవాలు వివరించండి. అవి పనిచేస్తాయి.
టీన్స్ తేలికగా ప్రేమలో పడిపోతారు. మొదట నవ్వుగా మొదలై ఆ స్నేహం జీవితాంతం వుండిపోతుందనుకుంటారు. ఈ రకమైన వారి నిర్ణయాలు ప్రమాదకరం. కొంతమంది పిల్లలు రెండో సారి కూడా ఆలోచించక, జీవితాన్ని పాడుచేసుకుంటారు. కనుక తల్లితండ్రులు ఆ ఎఫైర్ల తీవ్రత వారికి తప్పక చెప్పాలి. వయసు అలా చేస్తుందని వారికి తల్లితండ్రులు చెప్పాలి. అందుకుగాను పిల్లలతో వారు తమ అనుభవాలను తప్పిదాలను ఆ వయసులో జరిగినవాటిని వివరించాలి. అది టీనేజ్ పిల్లల కు ఒత్తిడి తగ్గిస్తుంది.
ప్రేమ ప్రభావాలు ఎలా వుంటాయనేది పిల్లలకు వివరించండి. ప్రతిస్నేహం జీవిత భాగస్వామ్యం వరకు రాదని వారికి చెప్పండి. ఎవరైనా నవ్వినా లేక స్నేహపూరితంగా వ్యవహరించినా అది భాగస్వామ్యం వరకు రాదని చెప్పండి. ప్రతిస్నేహానికి ఒక హద్దు వుంటుందని తెలుపండి. లేకుంటే చివరకు అది చిన్నతనంలోనే గర్భానికి లేదా ఆత్మహత్యకు దోవతీస్తుందని తెలుపండి.
తల్లితండ్రులు ఆధునికంగా కూడా వ్యవహరించాలి. వారు తమ టీనేజ్ పిల్లలను సురక్షితంగా వున్నంతవరకు అనుమతించాలి. డేటింగ్, వంటివి సహజమై తల్లితండ్రులు ఏం చెప్పినా పిల్లలు వినటానికి ఇష్టపడటంలేదు. కనుక సురక్షితంగా వారిని కొన్ని తప్పులు చేయనిచ్చి అనుభవాలను ఏర్పరచండి. ఎక్కువసార్లు అడ్డు చెప్పినా పిల్లలు చెడిపోతారు. కనుక వారి తప్పులనుండి వారిని నేర్చుకోనివ్వండి.
ఈ చిట్కాలు మీ టీనేజర్ల ప్రేమవ్యవహారాలను నియంత్రించి మీ విద్యా బుద్ధులతో వారు మంచి అలవాట్లు చేసుకుంటాయని భావిస్తాం.



Click it and Unblock the Notifications