Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
పిల్లల సంబంధాలను అంతం చేస్తున్న టెలివిజన్!

ఒక తాజా స్టడీలో రీసెర్చర్లు, వెల్లడించిన ఈ అంశాలను ఆర్చివ్స్ ఆఫ్ పేడియాట్రిక్స్ అండ్ ఎడోలసెంట్ మెడిసిన్ అనే పత్రిక ప్రకటించింది. నేటి రోజులలో టి.వి.లు ప్రతి ఇంటిలోను తేలికగా లభ్యమవుతున్నాయి. పిల్లలకు కూడా స్కూలునుండి ఇంటికి రాగానే మిగిలిన సమయమంతా టి.వి.లు కంప్యూటర్లముందే గడిపేస్తున్నారు. అయితే వీరు ఇంత అధిక సమయాన్ని ఈ ఆధునిక పరికరాలపై గడపటం వారిలో ప్రవర్తనా సమస్యలు తెస్తోంది. కుటుంబ సభ్యులతో లేదా తమ స్నేహితులతో సైతం వారు సన్నిహిత్వాన్ని కోల్పోతున్నారు. కొంతమంది పిల్లలు, ఇతరులు తెలిపే అంశాలకు త్వరగా స్పందించలేకపోతున్నట్లుకూడా రీసెర్చి వెల్లడిస్తోంది.
వారి ఆటల సమయం కూడా బాగా తగ్గిపోవటంతో శారీరక సమస్యలు, అనారోగ్యాలు కలుగుతున్నాయి. సరైన వ్యాయామాలు లేకపోవడంతో వీరిలో వ్యాధినిరోధక బలం కూడా తగ్గిపోతోంది. 2004 లో చేసిన ఈ రీసెర్చిలో సుమారు యుక్తవయసు వచ్చిన 14 నుండి 15 సంవత్సరాల పిల్లలను స్టడీ చేశారు. పిల్లలు, తమ స్వేచ్ఛా సమయాన్ని తమ తల్లితండ్రులు, స్నేహితులతో గడిపే సమయం కంటే కూడా టి.వి.లు కంప్యూటర్లపై గడిపే సమయం అధికంగా వున్నట్లు తెలిపారు.
మొత్తంగా పరిశీలిస్తే, అధిక సమయం టి.వి.లపైనా, కంప్యూటర్లపైనా గడిపే పిల్లలకు తమ తల్లితండ్రులతో అనుబంధం తక్కువగా వుందని మానసిక బంధం సరిగా లేదని తెలిపారు. టెలివిజన్ కారణంగా వీరి మధ్య అనుబంధం 4 శాతం తగ్గగా, కంప్యూటర్ గేముల కారణంగా అనుబంధం 5 శాతం వరకు తగ్గినట్లు రీసెర్చిలో వెల్లడైంది. అయితే, కంప్యూటర్లు, టి.వి.ల ముందు కూర్చోకుండా తమ హోంవర్కు చేసుకోవడం, లేదా పుస్తకాలు చదువుకోవడం వంటి పనులు చేసిన పిల్లలలో తమ తల్లితండ్రులన్నా, స్నేహితులన్నా అనుబంధం అధికమైనట్లు వెల్లడైంది.



Click it and Unblock the Notifications
