Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
మనసెరిగిన పిల్లలు - పిల్లల కొరకు పెద్దలు!

మీ బిడ్డ మీ మాటలు వినకుండా చేయవద్దన్న పనులు ఎన్నో చేసేస్తాడు. మాట వినడు. ఇటువంటి పిల్లలు మీకు వయసైన తర్వాత మీ పట్ల శ్రద్ధ వహిస్తారా? మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారా? అని అనేక సందేహాలు వచ్చేస్తూంటాయి. మీరు అంత దూరం ఆలోచించవలసిన అవసరం లేదు. పిల్లలు పుట్టారు అనేది వారితో మీరు ఇబ్బందులు పడుతున్నారనేది మీ కళ్ళకింద వచ్చే నల్లని చారలు,తలపై వెంట్రుకలు ఊడిపోవటం వంటివే నిదర్శనం. మీరు ఆలోచించేదానికంటే కూడా అవి మీకు ప్రయోజనాన్నిస్తాయి. అది ఎలాగనేది పరిశీలించండి.
ఎంతో ఒత్తిడి. పిల్లలు వుండటమనేది మీకు ఎంతో ఒత్తిడి. కాని రీసెర్చి మేరకు ఆ ఒత్తిడి మీకు చాలా మంచిది. తల్లితండ్రులకు పిల్లల కారణంగా కలిగే ఒత్తిడి రక్తపోటును తగ్గిస్తుందని స్టడీ చెపుతోంది. ఈ స్టడీలో సుమారు 200 మంది జంటలను పరిశీలించారు. వీరిలో పిల్లలున్న తల్లితండ్రుల రక్తపోటు, లేని జంటలకంటే ఎంతో తక్కువగా వుందని తేలింది.
ఒక తండ్రి లేదా తల్లి అవటం అనేది జీవితానికి ఒక అర్ధం ఇస్తుందని, కనుక తల్లితండ్రుల కు కలిగే ఒత్తిడి ఇతర ఒత్తిడులకంటే కూడా ఎంతో మేలైనదని రీసెర్చర్లు చెపుతున్నారు. అంతేకాదు, పిల్లలు కలిగిన తర్వాత పెద్దలు మరింత భాధ్యతాయుతంగా కూడా ప్రవర్తిస్తారు. తల్లితండ్రులు శారీరకంగా వారి వద్దే వుంటూ తమ పిల్లలకు శ్రద్ధ పెడతారు.
పిల్లలు లేని వృధ్ధులు పిల్లలు వున్న వృధ్ధులకంటే కూడా మానసికంగా తక్కువ ఆరోగ్యంలో వుంటారట. వృధ్ధాప్యంలో పిల్లలు ఇచ్చేది ఆర్ధిక సహాయం ఒకటే కాదు మీ మానసిక సంక్షేమం కూడా వారు వహిస్తారు. పిల్లలకొరకైనా సరే పెద్దలు అనేక విషయాలు ఎప్పటికపుడు తెలుసుకుంటూ తమ నాలెడ్జిని పెంచుకొంటారు. పిల్లల వలన మరో ప్రయోజనంగా, జోకులేసుకుని నవ్వటమే కాదు. తల్లితండ్రులుగా వున్న ఆనందంలో నవ్వే నవ్వు వేరుగా వుంటుంది. పిల్లలు నవ్వు పుట్టించే పనులు ఎన్నో చేస్తారు. తల్లితండ్రులు వాటిని ఆనందిస్తారు. అదంతాజీవితంలో మీకు అదనపు సంతోషమే.
వారమంతా కష్టపడిపనిచేసి స్నేహితులతో డ్రింక్స్ ఆనందించాలనుకుంటారు. కాని పిల్లలుంటే అటువంటి ఆలోచనలు త్వరా రావు. మంచిగా ఇంటిలోని సోఫాలో కూర్చొని పిల్లలతో టీ.వీ. కార్యక్రమాలు ఆనందిస్తారు. ఎంతో కొంత సణిగినప్పటికి పిల్లలు కూడా ఇష్టపడతారు. పిల్లలు నిరంతరం తమ తల్లి తండ్రుల సమక్షాన్ని కోరుకుంటూ వారి ప్రవర్తనలో తమ బాగోగులు కోరుకుంటారు. వీరు ఈ రకంగా తల్లితండ్రులు తమ వద్ద వుండాలని కోరుకునే భావన మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. మీలో ఆత్మ విశ్వాసం అధికమవుతుంది.
పిల్లలతో కలిసి మీరు గడిపేటపుడు, మీరు గమనించలేని అంశాలను ఎన్నింటినో వారు గమనించి మిమ్మల్ని వాటికి ప్రోత్సహిస్తారు. మీరు మరో ప్రపంచాన్ని వారి కళ్ళ ద్వారా చూడగలుగుతారు. సంతోషం అనేది లోపలనుండి పుట్టుకు రావాలి. మీ బిడ్డ మీరు తిరస్కరించలేని ఆనందాన్ని మీకు లోపలినుండి అందిస్తాడు. మీ భావనలు బిడ్డ కారణంగా మారతాయనేదానికి శాస్త్రీయ రుజువులు వున్నాయి. షుమారు రెండు లక్షల జంటలతో చేసిన ఒక సర్వేలో , పిల్లలు లేనివారికంటే కూడా పిల్లలున్న జంటలు గణనీయ ఆనందం పొందారని తేలింది. అయితే, ఈ సర్వేలో 16 శాతం మంది మాత్రం కొత్తగా పిల్లలు పుట్టించుకోవడం అనేది తమ జీవితాలపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని తెలిపారట.



Click it and Unblock the Notifications
