Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
దీపావళి రోజు పిల్లలకు చేతులు కాలితే చేయండిలా...!
సాధారణంగా పిల్లలకు దీపావళి పండుగ క్రేకర్లు కాల్చటంలో అపుడపుడూ కొద్దిపాటిగా చేతులు కాల్చుకోవటం జరుగుతుంది. పండుగ రోజు అంతా సంతోషంగా వుండాలనే కోరుకుందాం. కాని యాక్సిడెంట్లు చెప్పి రావుకదా! అందుకని ఏదైనా కాల్పు చేతులకు జరిగేతే తక్షణమే ఏం చేయాలో చూద్దాంకాలిన గాయం చిన్నదిగా వుంటే భయం, ఆందోళనలు అవసరం లేదు. చేయికాల్చుకున్న పిల్లాడికి ముందుగా ప్రధమ చికిత్స చేయండి. మీరు ఖంగారు పడకుండా వుంటేనే ఈ పని చేయగలుగుతారు. కాలిన వెంటనే తక్షణం చేయాల్సిందేమంటే, కాలిన శరీర భాగంపై నీరు పోయండి. అయితే కాల్పు చాలా తక్కువగా వుంటేనే నీరు పోయటం మంచిది. లేదంటే...బాగా కాలిన గాయానికి నీరు చేరి ఉబ్బిపోతుంది. కనుక అధికంగా కాలితే నీరు పోయకండి.
కాలిన గాయాలకు పసుపు బాగా పనిచేస్తుంది. పండుగ వేడుకలనాడు పసుపు కనుక అందుబాటులో పెట్టుకుంటే కాలిన గాయాలకు తక్షణ ప్రధమ చికిత్స చేయవచ్చు. పసుపు యాంటీ సెప్టిక్ గా రాయటం వలన కాలిన గాయాలు ఇన్ఫెక్షన్ కు గురికాకుండా వుంటాయి. పసుపు లేదా ఇతర యాంటీ సెప్టిక్ క్రీము అందుబాటులో లేకుంటే, ఒక ఉల్లిపాయను సగానికి తరిగి కాలిన భాగంపై గట్టిగా రాయండి. డెట్టాల్ లేదా సావలోన్ వంటివి కూడా కాలిన భాగాలకు తక్షణమే రాయవచ్చు. స్పిరిట్ , ఆల్కహాల్ వంటివి కూడా కాలిన గాయాలకు పనిచేస్తాయి. కాని పిల్లలు బహుశ వీటి తీవ్రతకు తట్టుకోలేకపోవచ్చు.

పిల్లల గుడ్డలుకు నిప్పు అంటుకుంటే, వెంటనే వాటిపై నీరు పోయకండి. నీరు గుడ్డను వారి శరీర చర్మానికి అంటుకుపోయేలా చేస్తుంది. అది మరింత ప్రమాదకరం. తక్షణమే వారిని ఒక దుప్పటిలో చుట్టేయండి లేదా వీలైనంత మేరకు వారి శరీరం నుండి దుస్తులను లాగేయండి.
పిల్లల చేతి కాల్పులు కొద్దిపాటివైతే, చేసే ప్రధమ చికిత్స సరిపోతుంది. మీకు అది చాలదనిపిస్తే వెంటనే హాస్పిటల్ కు తీసుకు వెళ్ళండి. సురక్షితమైన దీపావళి జరుపుకోండి.
నిప్పురవ్వలు పడి చిన్నచిన్న గాయాలు ఏర్పడినా సెప్టిక్ కాకుండా నిరోధించేందుకు బర్నాల్, దూది, అయోడిన్, టించర్, డెట్టాల్ తదితరాలతో కూడిన ఫస్ట్ ఎయిడ్ కిట్ సిద్ధం చేసుకోండి. ప్రాధమిక వైద్యం చేసిన… తరువాత కొంత ఉపశమనం పొందినప్పటికీ తప్పక వైద్యుని వద్దకు వెళ్ళి పూర్తి చికిత్స చేయించుకోవడం ముఖ్యం.
మంట వచ్చిన వెంటనే ఆర్పేయడానికి రెండు మూడు బకెట్ల నీరు అందుబాటులో ఉంచుకోండి. ఎవరికైనా మంట అంటుకుంటే బట్టలు తీసి, శుభ్రమైన దుప్పట్లతో కప్పాలి. వెంటనే నిపుణుడి దగ్గరికి తీసుకెళ్లాలి.



Click it and Unblock the Notifications