Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ పిల్లలకు ఎంచుకోవటం నేర్పించండి!

సాధారణంగా తల్లితండ్రులు తమ పిల్లవాడు చిన్నవాడని అతనికి ఏమీ తెలియదని, అతనికి ఛాయిస్ ఇవ్వరు.మీరు మీ బిడ్డకు సొమ్ము, విద్య, ఆహారం అన్నీ ఇస్తున్నారు. అయితే, అతనికి వాటిని ఎంచుకోవటంలో కూడా మీరు అతనిపై నమ్మకం పెట్టాలి. అది వారి జీవితం, నేడు కాకున్నా, రేపు వారు వారి జీవితంలో ఎంపికలు చేసుకోవాలి. కనుక తల్లితండ్రులు తమ పిల్లలకు ఎంపికలు ఎలా నేర్పాలి అనేదాని కొరకు కొన్ని సూచనలు చూడండి.
పిల్లలకు ఎంపికలు ఎలా నేర్పాలి?
బ్రేక్ ఫాస్ట్ కు ఏం కావాలి?
జీవితంలో మీ పిల్లలకు చిన్న అంశాలలో నేర్పించండి. ఉదయం ఆహారం అతనను ఎంచుకోవాలి. అయితే మీరు పోషకావసరాలను మైండ్ లో పెట్టుకొని పిల్లలకు ఒక మెను తయారు చేయండి.
ఆ మెనులో తయారు చేసిన ఆహారాల ఎంపికలో అతనికి అవకాశం ఇవ్వండి. ఉదాహరణకు గుడ్లు, కార్న్ ఫ్లేక్స్, పరోటా ఈ ఆహారాలలో నీకు ఈ రోజు ఏది కావాలి అని అతనిని ఎంపిక చేసుకోమనండి.
మీరు అతనికి సహకరించండి -
నీ ఇష్టం వచ్చింది ఎంచుకో అని చెప్పేయటంతో మీ పాత్ర ముగిసిపోదు. ఎంచుకున్న తర్వాత, దానికి తగిన భాధ్యత అతనిపై వుంటుందని కూడా తెలియచెప్పండి. ఉదాహరణకు గుడ్లు కావాలని అడిగారు. కాని తర్వాత వాటిని తినను అని అతను అనరాదు. తినేటందుకు అతను భాధ్యత వహించాలని తెలుపండి. ఎంపికలతోపాటు, భాధ్యతలు కూడా ఉంటాయని మీ పిల్లవాడికి తెలుపండి. తగిన శిక్షణనివ్వండి.
ఏం చదవాలని అనుకుంటున్నావు?
తరచుగా తల్లితండ్రులు తమ పిల్లల చదువులను, లేదా ఇతర అంశాలను బాగా నియంత్రిస్తూంటారు. వారిని తేలికగా వదలివేయరు. టివిలో ప్రొగ్రాములు, వారి చదువులు ఏదైనప్పటికి వీరే నిర్ణయిస్తారు. అలా కాకుండా, ఈ రోజు చదువులోని సబ్జక్టులు ఏం చదవాలనుకుంటున్నావు? లేక టివిలో ఏ కార్యక్రమం చూడాలనుకుంటున్నావు అనే వాటిపై కూడా పిల్లలకు ఛాయిస్ నేర్పించాలి.
పెద్ద అయిన తర్వాత నీవు ఏం కావాలనుకుంటున్నావు?
మీ పిల్లలకు తమ కెరీర్ ఎంచుకోవటం ఎంతో ప్రధానమైన విషయం. చాలామంది తల్లితండ్రులు ఈ విషయంలో తమ పిల్లలకు తమ ఆసక్తి ప్రదర్శిస్తారు.వారికి ఇష్టమైన చదువు లేదా ఉద్యోగం వంటివి ఎంచుకోనీయరు. పెద్దవాడయితే మా అబ్బాయి, ఇంజనీర్ కావాలని లేదా డాక్టర్ కావాలని వారు భావిస్తారు. కాని అతనికి యాక్టర్ అవ్వాలనే ఆసక్తి ఉన్నదని తెలుసుకోరు. కనుక, పిల్లలకు చిన్నతనం నుండి ఎంపికలు నేర్పిస్తూ, ఒక వయసు వచ్చిన తర్వాత వారి కెరీర్ కు తగిన అంశాన్ని వారు ఎంచుకునేలా చేయాలి. ఎంచుకున్న తర్వాత వారు దానికి భాధ్యత వహించేలాచూడాలి. వారు ఎంచుకున్న రంగం ఒకవేళ మీకు ఇష్టం లేనిదైనా, మీరు అతనికి సహకరించి అతను ఆ రంగంలో నైపుణ్యత పొందేలా చూడాలి.



Click it and Unblock the Notifications