Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
పిల్లలకు పాకెట్ మనీ అవసరమా...?

పాకెట్ మనీ ఎందుకు కావాలి?
పిల్లలలో పాకెట్ మని ఏర్పాటు డబ్బు విలువ వారికి నేర్పిస్తుంది. దానిని ఎలా ఉపయోగించాలో వారికి నేర్పించాలి. ప్రధాన అవసరాలు ముందు ఎలా తీర్చుకోవాలో తెలుపాలి. అపుడు వారు మీరిచ్చే ప్రతి పైసా విలువ బాగా తెలుసుకుంటారు. అతను కనుక దానికి ఒప్పుకొనకపోతే, మీరు వదిలేయండి. మరల ఇచ్చే తేదీ వచ్చే వరకు అంతకు మించి ఇచ్చేది లేదని ఖచ్చితంగా తెలుపండి.
మీరు ఇచ్చే పాకెట్ మనీ ఎదిగే పిల్లవాడిఅవసరాలు తీరుస్తుంది. స్నేహితులతో కలసి ఖర్చు చేస్తాడు. అలా ఖర్చు చేస్తూ తన స్నేహితులముందు ఆనందిస్తాడు. స్వతంత్రంగా భావిస్తాడు. తాను కోరే బర్గర్, సినిమా టికెట్ వంటివి కొనుగోలు చేస్తాడు. అయితే, ఎంత మొత్తం ఇవ్వాలనేది మీరు జాగ్రత్తగా నిర్ణయించాలి. అవసరానికి మించి ఇస్తే అది అతనికి హాని కలిగించవచ్చు.
అతని డిమాండ్లు మీరు నియంత్రించాలి. ఉదాహరణకు మీ బిడ్డ ఒక కొత్త ఫోన్ లేదా ఐ ప్యాడ్ వంటివి కొనాలంటే, వెళ్ళి కొనుక్కోమనండి. అదే విధంగా పుస్తకాలు, స్టేషనరీ వస్తువులు కూడా పాకెట్ మనీకే లింక్ చేయండి. ఈ చర్య అతను అధికంగా సొమ్ము అడగకుండేలా చేస్తుంది.
పిల్లవాడు తన బడ్జెట్ తాను నేర్చుకుంటాడు. ఈ కారణంగానైనా సరే మీరు అతనికి పాకెట్ మనీ ఇవ్వాలి. తన వద్ద వున్న డబ్బు ఎంత ఖర్చు చేయాలి, దేనిపై ఖర్చు చేయాలి? ఎంత పొదుపు చేయాలి అనేవి అతనికి తెలుస్తాయి. తాను కోరే వస్తువు ఖరీదైనదైతే, తన పాకెట్ మనీలో కొద్దిరోజులు పొదుపు చేసి కొనుగోలు చేయటం వంటివి అతడు నేర్చుకుంటాడు. అనవసరమైన వస్తువులు కొనకుండా వుంటాడు. అవసరాలను గ్రహిస్తాడు. బడ్జెట్, పొదుపు వంటివి తెలుస్తాయి.
పాకెట్ మనీ పిల్లలకు ప్రధానమే అని తెలిపేందుకు ఈ కారణాలు చాలు. అయితే, పాకెట్ మనీ మరీ తక్కువ వయసులో ఇవ్వకండి. అతనికి అవసరం అనుకున్నపుడు ఇవ్వాలి. అతని వయసు అతని ఖర్చులు పరిశీలించాలి. అపుడు ఎంతో కష్టంగా మీరు సంపాదించిన సొమ్మును అతను భాధ్యతాయుతంగా ఖర్చు చేస్తాడు. పాకెట్ మనీ పిల్లలను తప్పుదోవ కూడా పట్టిస్తుంది. కనుక ఖచ్చితంగా వుండండి. ప్రతిరోజూ అతను ఏం ఖర్చు చేస్తున్నాడనేది గమనించండి.



Click it and Unblock the Notifications
