Latest Updates
-
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
అనారోగ్యంతో ఉన్నపిల్లలకు అందివ్వాల్సిన హెల్తీ ఫుడ్స్
సరైన పోషకాహారం లభ్యం కాకపొతే పసిపిల్లలు సరిగా పెరగరు. పిల్లలకు ఆరోగ్యంగా పెరగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ఆరోగ్యకరమైన ఆహారంను అంధివ్వాల్సి ఉంటుంది. ఎప్పడైతే వారు ఆహారపు అలవాట్లును మార్చుతారో అప్పుడు వారు బజ్బు పడటానికి కారణం అవుతుంది. కాబట్టి పిల్లలకు ఎల్లప్పుడూ మంచి పోషకారంను అంధించాల్సి ఉంటుంది. మీ పిల్లలు చురుకుగా, స్మార్ట్, క్రమంగా పెరుగుదల మరియు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లైతే మీరు ఆరోగ్యకరమైన ఆహారాలను ఫీడ్ చేయాల్సి ఉంటుంది. పసిపిల్లల్లో పొట్ట చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి వారి చాలా తక్కువ మోతాదులు ఫీడ్ చేయాల్సి ఉంటుంది మరియు వారికిచ్చే ఆహారం రోజులో 5 నుండి ఆరుసార్లు అందివ్వ వచ్చు . వారు చురుకుగా ఉండటానికి ఒక శక్తివంతమైన, మృదువైన ఆహారాన్ని తరుచూ ఇస్తుండాలి.
అల్పాహారంతో మొదలు పెట్టాలి, ఎందుకంటే పిల్లలకైనా, పెద్దలకైనా అల్పాహారం ఆరోజుకి చాలా ముఖ్యమైనది, అవసరమైనది. ఉదయం అల్పాహారంలో మంచి పోషకాహారం అంధించడం వల్ల వారు బలంగా మరియు ఆరోగ్యంగా పెరడగానికి సహాయపడుతుంది. అందువల్లనే పసిపిల్లలకు ఒక్క రోజులో ఆరు సార్లు ఆహారాన్ని అంధించాల్సి ఉంటుంది మరియు మద్యలో స్నాక్స్ కూడా ఇవ్వొచ్చు. కానీ మీరు మీ పిల్లలకు అంధించే పోషకాహారంలో ఖచ్చితంగా ప్రోటీనుల, విటమిన్లు, మరియు కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉండాలే జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలకు ఇష్టమైన ఆహారాలుగా తయారుచేయాలి. అప్పుడే వారు వాటిని తినడానికి ఇష్టపడుతారు. వారికి ఇష్టమైనవి పెట్టడం వల్ల వాటిన అడ్డుకోవటానికి మరియు తిరుగుబాటుకు అవకాశం ఉండదు. ఇది సాధించాలంటే మీ పిల్లలకు ఒక రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వాటిని అంధించాలి.

జబ్బుపడిన పసిపిల్లలకు అందివ్వాల్సిన కొన్ని ఉత్తమ ఆహారాల యొక్క జాబితా ఈ క్రింద స్లైడ్ లో ఇవ్వబడింది...
1. సెరియల్స్ లేదా బిస్కెట్స్: జబ్బు పడిన పసిపిల్లలకు సెరియల్స్ మరియు బిస్కెట్స్ ఒక మంచి బ్రేక్ ఫాస్ట్ ఫుడ్స్ . ఇవి మనకు బాగా తెలిసిన బ్రేక్ ఫాస్ట్ డైట్ ఫుడ్. ఇవి చాలా సులభంగా జీర్ణం అవుతాయి మరియు ఆరోగ్యకరం కూడా..
2. గుడ్లు: గుడ్లు చాలా మంచి పోషకాహారం మరియు ఆరోగ్యకరమైనవి కూడా. కాబట్టి, మీ పసిపిల్లలకు అందించే డైట్ లిస్ట్ లో వీటిని తప్పనిసరిగా చేర్చండి . గుడ్లతో వివిధ రకాల వైటీ డిష్ లను తయారుచేసి పిల్లలకు అంధించవచ్చు . ఎందుకంటే పసిపిల్లలకు ప్రతి రోజూ ఉడికించిన గుడ్లను పెట్టడం వల్ల వారు బోరుగా ఫీలయ్యి చివరకు వాటిని తినకుండా మానేస్తారు కాబట్టి, డిఫెరెంట్ గా తయారుచేసి ఇవ్వండి.
3.స్నాక్స్: తాజాగా మరియు ఇంట్లో తయారుచేసిన స్నాక్స్ పసిపిల్లలకు చాలా ఆరోగ్యకరం. ప్యాక్డ్ స్నాక్స్ ను ఎప్పటికీ ఇవ్వకూడదు. అవి అనారోగ్యకరం మరియు అజీర్ణం కలిగిస్తాయి. కాబట్టి ఎల్లప్పుడు మీరు హెల్తీ స్నాక్స్ తయారుచేయడానికి ప్రయత్నించండి .
4.ఫ్రూట్ సలాడ్స్: పసిపిల్లకు అందివ్వాల్సిన మరో హెల్తీ టూడ్లర్ ఫుడ్ ఫ్రూట్ సలాడ్స్. తాజా పండ్లలో విటమినులు, మినిరల్స్ మరియు ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది పిల్లల యొక్క పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది . మరియు వారి బలంగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. జబ్బు పడిన పసిపిల్లలకు అంధివ్వాల్సిన ఆహారాల్లో ఇది ఒక బెస్ట్ ఫుడ్.
5. పాలు: పసిపిల్లలకు ముఖ్యంగా జబ్బు పడిన పిల్లలకు పాలను తప్పనిసరిగా ఇవ్వాల్సిందిగా సూచిస్తుంటారు. కాబట్టి, పాలతో తయారు చేసిన డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ను అనారోగ్యంతో ఉన్న పసిపిల్లకలు అంధించండి.
6. కారంగా ఉన్న ఆహారం: పసిపిల్లలో చాలా ఆత్రుత మరియు కోరిక ఏదైన కొత్తగా రుచిచూడాలనే కోరిక ఉన్నప్పుడు వారి ఆహారంలో కొంచెం వెరైటీ ఫుడ్ ను చేర్చండి. అటువంటి వంటలు తిరిగి బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్ లో చేర్చకండి. భోజనాన్ని కొంచెం డిఫరెంట్ గా, టేస్టీగా తయారుచేసి ఇవ్వండి.
7. ఉడికించిన ఆహారం: ఉడికించిన కూరగాయలు, చిరుధాన్యాలు తప్పనిసరిగా అంధివ్వాలి. బాగా ఉడికించిన కూరగాయలను అన్నంలో బాగా మెత్తగా కలిపి వారికి తినిపించాలి.
8. కుక్కీస్ మరియు పాలు: డిన్నర్ ఖచ్చితంగా లైట్ గా ఉండాలి. వారు నిద్రపోవడానికి లైట్ ఫుడ్స్ అంధివ్వాల్సి ఉంటుంది. కాబట్టి కుక్కీస్ మరియు పాలతో సరిపెట్టండి.
9. ప్రోటీన్ రిచ్ ఫుడ్: ప్రోటీనులు అధికంగా ఉండే ఆహారం పెరిగే పిల్లలకు చాలా అవసరం. కాబట్టి చీజ్ మరియు పెరుగు వంటి రిచ్ ప్రోటీన్ పుడ్స్ ను అంధివ్వాల్సి ఉంటుంది .
10. మాంసాహారం: మీరు మాంసాహారులైతే మీ పిల్లలకు చేపలు, బీఫ్ మరియు చికెన్ వంటివాటిని తినిపించండి . ఎప్పుడూ ఉడికించిన లేదా బేక్ చేసిన వాటిని అంధించాలి. ఫ్రై చేసినవి తినిపించకూడదు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తినిపించడం ద్వారా వారి చాలా తేలికగా జీర్ణం అవుతుంది.



Click it and Unblock the Notifications
