Latest Updates
-
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై
చిన్న పిల్లల్లో కోపాన్ని ఎలా తగ్గించాలి?
సాధారణంగా పిల్లలందరి ప్రవర్థనా ఒకేలా ఉండకపోవచ్చు. కొంతమంది సున్నితంగా ఉంటే...మరికొందరు అమాయకంగా ఉంటారు. ఇంకొదరైతే ఇల్లు పీకి పందిరి వేసేంత అల్లరి చేసేస్తుంటారు. అయితే కోపంతో ఊగిపోయే పిల్లల్ని మీరెప్పుడైనా చూశారా? అవునండీ...పిల్లల్లో అలాంటి స్వభావులు కూడా ఉంటారు. వారికి నచ్చిన బొమ్మ కొనివ్వకపోయినా కోపమే. ఇలాంటి వారితో చాలా కష్టం.
మరికొందరైతే హోంమ్ వర్క్ చేయలేదని స్కూల్లో టీచర్ మందలించినా కోపమే...ఇలాంటి ప్రవర్తన గల పిల్లలతో ఏం మాట్లాడాలో కూడా ఒక్కోసారి వారి తల్లిదండ్రులకు అర్ధం కాదు. మరి పిల్లలకు మంచి బుద్దులు నేర్పి మంచి మార్గంలో పెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. కాబట్టి ఓపికతో వారి కోపాన్ని క్రమంగా తగ్గించే ప్రయత్నం చేయాలి. దీనికి కొన్ని మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం...

అసలెందుకలా?
పిల్లలు అప్పుడప్పుడు కోపంగా ప్రవర్తించడం సహజం. అలాకాకుండా తరచూ ప్రతి విషయంలోనూ కోపంతో ప్రవర్తిస్తుంటే ఎవరికైనా విసుగ్గానే ఉంటుంది. అలా అని వాళ్లను అలాగే వదిలేయలేం కదా. కాబట్టి కొంచెం చొరవ తీసుకుని అసలు వాళ్ల కోపానికి కారణాలేంటో ఒపిగ్గా అడిగి తెలుసుకోవల్సి బాధ్యత తల్లిదండ్రులదే. స్కూల్లో తోటి పిల్లలేమైనా అంటున్నారా? లేదంటే ఉపాధ్యాయులేమైనా అంటున్నారా? ఆ చిరాకును కోపం రూపంలో ఇంటి వద్ద చూపిస్తున్నారా? లేదంటే స్కూల్లో కూడా ఇదే ప్రవర్తన కొనసాగిస్తున్నారా?వంటి విషయాలు పిల్లల్ని అడిగి క్షుణ్ణంగా తెలుసుకోవడం, స్కూల్లో టీచర్ల ద్వారా కనుక్కోవడం వంటి పనులు చేస్తూ సమస్యను అన్ని కోణాల నుంచి విచారించాలి. అప్పుడే అసలు విషయం బయటపడుతుంది.

నచ్చజెప్పండి: పిల్లల్ని భయపెట్టి చెబితే ఎలాంటి విషయమైనా వారు సానుకూలంగా ఆలోచించరు. కాబట్టి వారి నచ్చజెప్పడమే సరైన పద్దతి. అందుకే వారి కోపం గురించి తెలుసుకొని..అలా ప్రవర్తించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో వారికి తెలియజేయండి. ఉదాహరణకు..‘ఇలాంటి ప్రవర్తన వల్ల నీతో మాట్లాడడానికి, ఆడుకోవడానికి ఎవరూ ఇష్టపడరని, నిన్ను అందరూ బ్యాడ్ బాయ్/గర్ల్ అని అనుకుంటారని, ఇది భవిష్యత్తులో నీకు ఎంతో చేటు చేస్తుందంటూ ...‘వారిని కూర్చోబెట్టుకుని నెమ్మదిగా బుజ్జగిస్తూ చెప్పాలి. తద్వారా వారిలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రేమతోనే: పిల్లలు కోపంగా సమాధానమిచ్చారని తల్లిదండ్రులు కూడా వారడిగిన దానికి కోపంగానే జవాబు చెప్పడం సరికాదు. కాబట్టి వాళ్లు ఎన్ని సార్లు కోపంగా మాట్లాడినా మీరు మాత్రం వారితో నెమ్మదిగా, ప్రేమగా, ముద్దుగానే మాట్లాడడం, సందర్భానుసారం వారిని పొగడడం...వంటివి చేయాలి. అలాగే వారితో అన్ని విషయాలు పంచుకోవాలి. స్కూల్లో జరిగిన విషయాలు కూడా రోజూ వారిని అడిగి తెలుసుకోవాలి. అదేవిధంగా ఇలాంటి కోపం పిల్లల చదువు, కెరీర్ పై ఏమైనా ప్రతికూల ప్రభావం చూపుతుందా? అన్నది కూడా ఎప్పటికప్పుడు వాళ్ల టీచర్ ని అడిగి తెలుసుకుంటూ, వాళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ పరిశీలిస్తూ ఉండాలి.

పిల్లల్ని ఏదో ఒక పనిలో నిమగ్నుల్ని చేయాలి: పిల్లల్ని ఖాళీగా కూర్చోవడం వల్ల కూడా వారిలో కోపానికి సంబంధించిన ఆలోచనలు వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి వాళ్లను ఖాళీగా ఉంచకుండా ...ఎప్పుడూ ఏదో ఒక పని చెబుతూ ఉండాలి. ఇందులో భాగంగా బొమ్మలు గీయడం, క్విజ్, పజిల్స్ పూర్తి చేయడం..వంటివి మెదడుకు పదును పెట్టే పనులలో నిమగ్నం చేయాలి. దీంతో ఒక సమస్య ఇస్తే వారు దాన్ని ఎలా పరిష్కరిస్తున్నారో మనకు అర్ధమవుతుంది. అలాగే వారు ఎంత మేర ఆలోచించగలుగుతున్నారు. వారి నైపుణ్యాలు...వంటి వాటి గురించి తెలిసిపోతుంది.

ఎప్పుడూ నవ్వెలా...
చాలా మంది కోపం వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి లాఫింగ్ థెరఫీ, వెనక నుండి పది అంకెలు లెక్కపెట్టడం...వంటి ప్రక్రియల్ని అనుసరిస్తుంటారు. అయితే పిల్లల్లో కోపాన్ని తగ్గించడానికి కూడా లాఫింగ్ థెరఫీని వాడవచ్చు. ఎలాగంటే, సాధారణంగా కోపంతో ఉన్న పిల్లలకు ముఖంలో ఎలాంటి నవ్వు ఉండదు. ఎప్పుడు చూసినా సీరియస్ గానే ఉంటారు. కాబట్టి వారిని నవ్వించడానికి జోక్స్ వేయడం, మంచి హాస్యాస్పద సినిమాలు, మిస్టర్ బీన్...మొదలైన నవ్వించే ప్రోగ్రామ్స్...వంటివి చూపించాలి. ఇలా రోజూ కాసేపు నవ్వించడం వల్ల వారి ప్రవర్తనలో నెమ్మదిగా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కోపాన్ని తగ్గించుకోవడానికి లాఫింగ్ థెరపీని ఓ ఔషధంగా ఉపయోగిస్తుంటారు.



Click it and Unblock the Notifications