Latest Updates
-
Strongest Currency: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏదో తెలుసా? -
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది..
పిల్లలను దండించడంలోనూ ప్రేమ కలిగి ఉండాలి...
పిల్లలు ఏ వయసువారయినా, తల్లిదండ్రులు వారిని కొట్టకూడదు. అని చైల్డ్ సైకాలజిస్టులు చెబుతుంటారు. ఎందుకు కొట్టకూడదు? అనే ప్రశ్న చాలా మందిలో ఉన్నది. పిల్లల క్రమశిక్షణ లో భాగంగా పిల్లలను దండించడం మన దేశంలో సాధారణ మయినది. పిల్లలు నేరస్తులు కాదు. మొక్కై వంగనిది మ్రానై వంగునా అన్న దానిని గ్రుడ్డిగా అనుసరిస్తూ పిల్లలను పేరెంట్స్ దండిస్తూ ఉంటారు.
కాని ఇది ఏ మాత్రం సరైన ఫలితాలను ఇవ్వక పోగ వారి మానసిక స్థితి పైన వ్యతిరేకంగా పని చేస్తుంది. పేరెంట్స్ సరైనా అవగాహన లేకుండా పిల్లలను వారికి కోపం వచ్చినప్పుడు దండిస్తూ ఉంటారు. కొన్ని సార్లు ఇతరుల పై కోపంతో, లేదా విపరీత మయిన ఒతిడి తో, పిల్లలను దండిస్తారు. తలిదండ్రులు తమ బిడ్డలను కొట్టడం ద్వారా, తమ పిల్లలు ఇతరులను కొట్టేవారుగా తయారవడానికి దోహదపడతారు. అలాకాకుండా ఉండాలంటే మొదట దండించే తలదండ్రుల్లో మార్పు రావాలి. పిల్లల్ని దండించే విధానంలో మార్పు రావాలి. దండన కూడా ప్రేమ పూర్వకంగా ఉండాలి. మరి అదేలాగో చూద్దాం....

1. తలిదండ్రులు కోపంతోనే బిడ్డను కొడతారు. బిడ్డకు కూడా బాధ వల్ల కోపం వస్తుంది. కోపం పెద్ద వాళ్లకు గానీ, పిల్లలకు గానీ మంచిది కాదు. అన్ని గుణాల కంటే కోపం ప్రమాదకరమైనది.
2. కొందరు తలిదండ్రులు పిల్లలను చేతితో కాక కర్రతో కొడతారు. అలా కొట్టినట్లయితే పొరబాటున తగలకూడని చోట తగిలితే, లేనిపోని సమస్యల్ని ఎదుర్కొనవలసి వస్తుంది.

3. అస్తమానం కొడుతున్న తల్లిదండ్రుల పట్ల పిల్లలకు గౌరవం పోతుంది. విలువ తగ్గిపోతుంది. తలిదండ్రులకు, పిల్లలకు మధ్య ఉండే బంధం కాస్తా పలచబడి పోతుంది. కొట్టిన చేతుల్ని చాపితే, బిడ్డలు మనస్ఫూర్తిగా ఆ కౌగిట్లోకి వెళ్లలేరు. తమకు పడిన దెబ్బలే వారికి గుర్తువస్తాయి.
4. కొట్టడం వల్ల సమస్య పరిష్కారం కాదు. అప్పటికప్పుడు భయం చేత, ఆ అల్లరిని తాత్కాలికంగా పిల్లలు ఆపేస్తారు. తర్వాత మళ్లీ అదే పని చేస్తారు. తిరగబడడానికి ప్రయత్నిస్తారు. చేతకాకపోతే తనకు తాను హింసించుకుంటారు.

5. అన్నింటికంటే ముఖ్యం... పిల్లల్ని కొట్టడం మొదలుపెట్టిన తరువాత, పిల్లల ముఖంలో అప్పటివరకూ ఉన్న కళ పోతుంది. వారికి తలిదండ్రుల ముఖంలో క్రూరత్వమే కనబడుతుంది. దాంతో వారి కళ్లల్లోకి సూటిగా చూడ బుద్ధికాదు.

6. అందుకే పిల్లలను కొట్టకుండానే వారిలో పరివర్తన తీసుకు వచ్చేందుకు కోపంతో కాకుండా, ప్రేమతో చెప్పడం మంచిదని లేదంటే సున్నితంగా మందలించడం సురక్షితమని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications
