Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మీ పిల్లలకు సరైన పోషకాహారం ఇవ్వడానికి ఈజీ ట్రిక్స్
పిల్లలకు రకారకాల పౌష్టికాహారం ఇవ్వాలని ప్రతి తల్లీ ఆరాటపడుతుంటుంది. పోషకాలు అందించడం కోసం రోజుకో వెరైటీ చేసి పెడుతుంది. కానీ.. పిల్లలు మాత్రం టేస్టీగా లేవని మారాం చేస్తుంటారు. హెల్తీ ఫుడ్ నే పిల్లలు టేస్టీగా లేదు అంటారని తాజా అధ్యయనాలు తేల్చాయి. అలాగే అలాంటి ఫుడ్ ని చాలా తక్కువ తింటారని స్టడీస్ చెబుతున్నాయి.
పోషకాహారం తినిపించడానికి తల్లిదండ్రులు చాలా కష్టపడతారు. అలా తినిపిండం పెద్ద ఛాలెంజ్ గా మారింది. కాబట్టి పిల్లల సైకాలజీని అర్థం చేసుకోవడం చాలా అవసరం. అప్పుడే వాళ్లు మీరు పెట్టే పౌష్టికాహారం తీసుకోగలుగుతారు. హెల్తీ ఫుడ్ ని వాళ్లకు పెట్టే విధానంలో మార్పు తీసుకొస్తే ఖచ్చితంగా తింటారు. కాబట్టి న్యూట్రీషియన్ ఫుడ్ కి పిల్లలను ఎలా ఎట్రాక్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం..

ముందుగా మీ పిల్లలకు ఎలాంటి పోషకాలు అవసరమో తెలుసుకోవాలి. మీ పిల్లలకు కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, విటమిన్స్, మినరల్స్ సరైన మోతాదులో అందేలా జాగ్రత్తపడాలి. అలాగే కొంతమంది పిల్లలకు ఎక్కువ న్యూట్రియంట్స్ అవసరమవుతాయి. ఇలాంటి విషయాలన్నీ జాగ్రత్తగా తెలుసుకోవాలి.
మరో విషయం ఏంటంటే.. మీ పిల్లలు తినే విధానాన్ని గుర్తించాలి. మోడ్రన్ కల్చర్ లో పిల్లలు చాలా స్మార్ట్ గా ఉన్నారు. వాళ్ల చేత పోషకాహారం తినిపించడానికి తల్లిదండ్రులు ప్లే చేసే ట్రిక్స్ కనిపెట్టేస్తున్నారు. కాబట్టి మీ పిల్లల కంటే మీరు ఇంకా స్మార్ట్ గా తయారవ్వాలి.
కాబట్టి మీరే మీ పిల్లల కంటే స్మార్ట్ గా మారడానికి, పోషకాహారం ఇవ్వడానికి ఎలాంటి ట్రిక్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాం. చాలా ముఖ్యం మీ కిడ్ మిమ్మల్ని నమ్మాలి. మీరు పెట్టే ఆహారాన్ని ఇష్టంగా తినాలి.
ట్రిక్ 1: ఫన్ షెడ్యూల్
న్యూట్రీషియన్ ప్లాన్ ని చాలా ఫన్ గా క్రియేట్ చేయాలి. విటమిన్స్, మినరల్స్, ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ ఎక్కువగా ఉండే రకరకాల ఆహారాలను ఎంచుకోవాలి. పాలను చేర్చడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే.. వీటిలో చాలా ముఖ్యమైన పోషకాలుంటాయి.
ట్రిక్ 2: ప్లాన్ లో మీ పిల్లలు
ఫుడ్ చార్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు మీ పిల్లలను ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయాలి. వాళ్లకు ఇష్టమైన అభిప్రాయాలు చెప్పే ఛాన్స్ ఇవ్వాలి. అలాగే మీరు ప్రిపేర్ చేసిన చార్ట్ చూసి మీ పిల్లలు చాలా హ్యాపీగా, ఇంట్రెస్ట్ చూపించాలి. ఎందుకంటే.. మీరు ఇచ్చే ఫుడ్ వాళ్లు ఎప్పుడూ నో చెప్పకూడదు కాబట్టి వాళ్ల ఇష్టాన్ని తెలుసుకోవాలి.

ట్రిక్ 3: వీక్లీ ప్లాన్
ముందుగా మూడు రోజుల ప్లాన్ ప్రిపేర్ చేయాలి. అది సక్సెస్ అయిన తర్వాత వీక్లీ షెడ్యూల్ తయారు చేయాలి. అది సక్సెస్ అయ్యాక మంత్లీ ప్రణాళిక రూపొందించాలి. మీ టార్గెట్ మీ పిల్లలకు సరైన పౌష్టికాహారం అందించడం.
ట్రిక్ 4: ప్రోత్సాహం
మనుషులు రివార్డ్స్ కి ఎట్రాక్ట్ అవుతారు. కాబట్టి.. ఇది మీ పిల్లలపై ప్రయోగించండి. ఒక గ్లాసు హార్లిక్స్ పాలను 10 లెక్కపెట్టేలాగా తాగితే.. మరో గంట పాటు టీవీ చూడటానికి అనుమతి ఇస్తానని ఆఫర్ ఇవ్వండి. ఇది చాలా ఉత్సాహకరమైన ప్రోత్సాహం. అప్పుడు రోజూ ఈజీగా పాలు తాగేస్తారు.
ట్రిక్ 5: ప్రెజెంటేషన్
పాలు అంటే చాలా మంది పిల్లలు అసలు ఇష్టపడరు. రోజూ తాగాలంటే బోర్ గా ఫీలవుతారు. కానీ రోజూ పాలు తాగించడం తల్లిగా మీ బాధ్యత. కాబట్టి ఆహారం తయారు చేసేటప్పుడు ఎట్రాక్టివ్ గా ఉండేలా జాగ్రత్త పడాలి. అవి టేస్టీగానూ ఉండాలి, పోషకాలతోనూ ఉండాలి.
ట్రిక్ 6: ఎంకరేజ్ మెంట్
పాలలో హార్లిక్స్ కలపడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయని మీ పిల్లలను ఎంకరేజ్ చేయండి. వాళ్లే హార్లిక్స్ కలుపుకోవడానికి అవకాశం ఇవ్వండి. ఇలా చేయడం వల్ల ఈ హెల్తీ డ్రింక్ ని నో చెప్పకుండా ఉంటారు. హార్లిక్స్ కలపడం వల్ల మీ పిల్లల ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది.

ట్రిక్ 7: జంక్ ఫుడ్ మాదిరిగా కనిపించేలా
ఇదో మంచి ట్రిక్. మీ పిల్లలను మీరు చేసిన పోషకాహారంతో ఎట్రాక్ట్ చేయాలంటే.. ఇదో బెస్ట్ ఆప్షన్. జంక్ ఫుడ్ లా మీ తయారు చేసిన ఫుడ్ లుక్ తీసుకురావాలి. పిజ్జా, బర్గర్, పాస్తా, న్యూడిల్స్ అంటే పిల్లలు బాగా ఇష్టపడతారు. కాబట్టి.. ఈ విధమైన రూపంలో ఆహారం అందిస్తే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. వెజిటబుల్స్, ఆలివ్ ఆయిల్ తో ఆమ్లెట్ తో కలిపి ఇస్తే.. ఇష్టంగా తింటారు.

ట్రిక్ 8: ఫన్ థింగ్స్
పిల్లల బర్త్ డేకి తీసుకొచ్చే డాల్, టాయ్, టెడ్డీ కేక్స్ లాంటి ప్రయోగమో ఆహారంలో కూడా ప్రయత్నించండి. రెగ్యులర్ ఫుడ్ కే చాకొలెట్, హోంమేడ్ జెల్లీ, జామ్, కెచప్ వంటివి ఉపయోగించే ఎట్రాక్టివ్ గా మార్చండి. ఇలా చేయడం వల్ల పోషకాలు అందించడం ఈజీ.

ట్రిక్ 9: ఒత్తిడి చేయకండి
ఒకవేళ మీ పిల్లలు ఒకరకం కూరగాయలు, కోడిగుడ్లు, పాలు ఇష్టపడం లేదు అంటే.. ఎక్కువ ఇబ్బంది పెట్టకండి. కానీ.. వాటి నుంచి పోషకాలు మిస్ అవకుండా.. హార్లిక్స్ కలిపి పాలు ఇవ్వడం, పడ్డింగ్స్ ఉపయోగించి ఎగ్స్ తినేలా చేయడం వంటి ట్రిక్స్ ప్లే చేయండి.



Click it and Unblock the Notifications











