Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పిల్లలను మీజిల్స్, రుబెల్లా నుండి కాపాడుకోవడానికి ఎంఆర్ వ్యాక్సిన్ తీసుకోండి
ప్రాణాంతకమైన మీజిల్స్(తట్టు), రుబెల్లా వ్యాధులను ఒకే టీకాతో నిర్మూలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 9 నెలల నుండి 5 ఏళ్ల లోపు పిల్లలకు మీజిల్స్- రుబెల్లా(ఎంఆర్) వ్యాక్సిన్ ను అందించడం కోసం ఢిల్లీ ప్రభుత్వం సోమవారం నుండి తన
ప్రాణాంతకమైన మీజిల్స్(తట్టు), రుబెల్లా వ్యాధులను ఒకే టీకాతో నిర్మూలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 9 నెలల నుండి 5 ఏళ్ల లోపు పిల్లలకు మీజిల్స్- రుబెల్లా(ఎంఆర్) వ్యాక్సిన్ ను అందించడం కోసం ఢిల్లీ ప్రభుత్వం సోమవారం నుండి తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఢిల్లీ నుండి మీజిల్స్, రుబెల్లా వ్యాధిని తరిమికొట్టడమే లక్ష్యంగా సర్కారు పని చేయనుంది.

ఫిబ్రవరి 6వ తేదీ నుండి ఈ ప్రచారాన్ని ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 9 నెలల నుండి ఐదేళ్ల లోపు పిల్లలకు ఎంఆర్ వ్యాక్సిన్ డోస్ అందించనున్నారు. సంక్రమణ వ్యాప్తిని నియంత్రించడానికి బలనీహ ప్రాంతాల నుండి పిల్లలకు డిపార్ట్ మెంట్ ఇప్పటికే 12 వేల నుండి 15వేల డోసుల వరకు అందించినట్లు అధికారులు తెలిపారు. అన్ని ఢిల్లీ ప్రభుత్వ డిస్పెన్సరీలు, ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు అందించనున్నారు. రెండు డోసులు తీసుకున్న పిల్లలందరికీ బూస్టర్‌గా ఈ అదనపు డోసు ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు ఎంఆర్ టీకా తీసుకోని పిల్లలకు ఇప్పుడు తప్పనిసరిగా ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు.

మీజిల్స్ వ్యాధి గురించి:
మీజిల్స్ అనేది అత్యంత వేగంగా వ్యాపించే వైరల్ అంటువ్యాధి. ఇది సోకిన పిల్లల్లో జ్వరం వస్తుంది. శరీరంపై దద్దుర్లు వస్తాయి. చిన్న పిల్లల్లో అతిసారం, న్యూమోనియా రావొచ్చు. ఇది మరణానికి దారి తీస్తుంది. తుమ్ములు, దగ్గులు లేదా వారిని తాకినప్పుడు ఇతరులకు సోకుతుందా. ఇది సోకిన వెంటనే లక్షణాలు కనిపించవు. 10 నుండి 12 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. 4 నుండి 7 రోజుల వరకు తీవ్రంగా ఉంటాయి.

మీజిల్స్(తట్టు) లక్షణాలు:
* దద్దుర్లు
* హై ఫీవర్
* కళ్లు ఎర్రగా మారడం
* కళ్లల్లో నీరు
* ముక్కు కారడం
* దగ్గు
* నోటి లోపలి బుగ్గ భాగంలో ఎర్రటి మచ్చలు, తెలుపు మచ్చలు
* ముఖం, మెడ భాగంలో దద్దుర్లు
* చేతులు, పాదాలు, శరీరమంతటా దద్దుర్లు
మీజిల్స్(తట్టు) ఐదేళ్ల లోపు పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. అలాగే 30 ఏళ్లు పైబడిన వారిలోనూ ఇది కనిపిస్తుంది. వీరిలో దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
మీజిల్స్(తట్టు) వ్యాధి తీవ్రత కారణంగా శ్వాస కోశ వ్యాధులు కూడా రావొచ్చు. ముఖ్యంగా న్యూమోనియాకు గురవుతారు. అలాగే అంధత్వం రావడం, మెదడు వాపు వ్యాధి బారిన పడతారు. తీవ్రమైన విరేచనాలకు దారి తీస్తుంది. పౌష్టికాహార లోపం ఉన్నప్పుడు ముఖ్యంగా విటమినే ఏ లోపం ఉన్నప్పుడు తట్టు వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మీజిల్స్ వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు చిన్నారులు అంగవైకల్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువ. దీని వల్ల ప్రాణాలు కూడా కోల్పోవచ్చు.

రుబెల్లా వ్యాధి గురించి:
రుబెల్లా వ్యాధి రుబెల్లా వైరస్ వ్యాప్తి వల్ల సంక్రమిస్తుంది. ఇది సోకిన పిల్లల్లో జ్వరం, దద్దుర్లు కనిపిస్తయి. గర్భిణీ స్త్రీలు ఈ వైరస్ వల్ల ప్రభావితమైతే అది గర్భస్రావం, మృతపిండం జన్మించడం లేదా పుట్టుకతో బిడ్డకు రుబెల్లా సిండ్రోమ్ సంక్రమించడం వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది.

రుబెల్లా లక్షణాలు:
* ముఖం మీద దద్దుర్లు ఏర్పడి శరీరమంతా వ్యాప్తి చెందుతాయి.
* జ్వరం
* శోషరస కణుపుల వాపు
* యుక్త వయస్సు మహిళల్లో కీళ్ల నొప్పులు
* రుతుక్రమ సమస్యలు
* ఆర్థరైటిస్
* మెదడుకి ఇన్ఫెక్షన్ వ్యాపించడం
* కండ్లకలక
* వికారం
రుబెల్లా వ్యాధి గర్భిణీలకు చాలా ప్రమాదకరం. గర్భిణీలకు రుబెల్లా సోకితే అది పుట్టుకతో వచ్చే రుబెల్లా సిండ్రోమ్ కు దారి తీస్తుంది. గుండె అసాధారణతలు, దృష్టి లోపం, ప్లీహం, కాలేయానికి నష్టం, మేథోవైకల్యం వంటి సమస్యలు కలిగించవచ్చు.



Click it and Unblock the Notifications