Latest Updates
-
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.!
పిల్లలకు సోకె అత్యంత భయంకరమైన వ్యాధి ఇదే.. సోకితే 2 నెలల్లో చనిపోతారు,ఎలా గుర్తించాలంటే?
ప్రపంచంలో కొన్ని వింత వింత వ్యాధులు ఉన్నాయి. ఇవి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఈ వ్యాధుల లక్షణాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ వ్యాధులు సోకితే మరణమే శరణం అని చెప్పుకోవాల్సిందే. తాజాగా అంతటి ప్రమాదకరమైన వ్యాధి ఒకటి బయటికి వచ్చింది. ఇది కేవలం పిల్లల్లో మాత్రమే కనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 23 మంది పిల్లలకు మాత్రమే ఈ వ్యాధి సోకింది. ఈ వ్యాధి సోకిన పిల్లలు కేవలం రెండు నెలలు మాత్రమే జీవించగలుగుతారు. ఇప్పటి వరకు ఈ వ్యాధి సోకిన వారెవరూ బతకలేదు. ఆ వ్యాధి ఏంటి? ఆ వ్యాధి లక్షణాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆ అరుదైన వ్యాధి ఏంటంటే?
ఇప్పటి వరకు చెప్పుకుంటున్న ఆ అరుదైన జన్యు వ్యాధి బ్రిటన్‌లో కనుగొనబడింది. దానికి ఇంకా పేరు కూడా పెట్టలేదు. 2023లో వాట్‌ఫోర్డ్ జనరల్ హాస్పిటల్‌లో ఒక బాబు జన్మించాడు. అతని పేరు టామీ ప్యారి. ఆ చిన్నారితో అరుదైన, అత్యంత ప్రమాదకరమైన మైట్రోక్యాండియల్ జన్యువు ఉంది. దీని వల్ల అతని గుండె రక్తాన్ని సరిగా పంప్ చేయలేకపోతోంది. రక్తం సరిగ్గా పంప్ కాకపోవడంతో అతని మెదడుకు కూడా రక్తం చేరడం లేదు. దీంతో మెదడు అభివృద్ధి కూడా నిలిచిపోతుంది.

దీంతో పాటు అతడు శ్వాసకు సంబంధించినసమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు ఆ చిన్నారికి తగిన శక్తి లభించడం లేదు. ప్రస్తుతం ఆ శిశువు 3 కిలోల బరువు ఉన్నాడు. కానీ అతనిలో శ్వాశకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. అలాగే అతని మెదడు కూడా సరిగ్గా పని చేయడం లేదని, శక్తి లేకపోవడంతో కాళ్ళు చేతులు కదలలేకపోతున్నాడని చెబుతున్నారు. దీంతో అతడిని ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
23 మందికి మాత్రమే..
అంతటి ప్రమాదకరమైన అరుదైన ఈ వ్యాధి.. ఇప్పటి వరకు కేవలం 23 మంది చిన్నారులకు మాత్రమే సోకింది. ఈ వ్యాధితో బాధపడిన చాలా మంది పిల్లలు, 2 నెలలు కూడా జీవించకుండా మృతి చెందారు. ప్రస్తుతం జీవిస్తున్న టామీ ప్యారి, 2 వారాల నుంచి వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్నాడు. వీరు సాధారణంగా జీవించలేరు. కచ్చితంగా వీరికి మరణమే శరణం.



Click it and Unblock the Notifications