Latest Updates
-
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
బిడ్డలకు పాలుపట్టే తల్లులకు కొన్ని చిట్కాలు!

కోలోస్ట్రమ్: బిడ్డ పుట్టిన తర్వాత మొదటి రెండురోజులవరకు స్తనాలలో పసుపు పచ్చటి ద్రవం ఊరుతుంది. దీనిని కోలోస్ట్రమ్ అంటారు. బేబీకి ఇది చాలా మంచి చేస్తుంది. అదంతా చీము అని, అది తాగితే బేబీకి హాని కలుగుతుందని అనుకుంటారు కాని అది సరికాదు. బేబీకి హాని కలిగించేదేదీ శరీరం ఉత్పత్తి చేయదు.
బేబీ తాగేటందుకు నీరు అవసరమా? మీరు మీ పాలు పడుతున్నంత కాలం బేబీకి తాగటానికి నీరు అవసరం లేదు. తల్లిపాలలోనే కావలసినంత నీరు బేబీ అవసరాలకు అందుతుంది. అంతే కాక, మీ శరీరం నుండి కూడా బేబీ నీరు తీసుకుంటుంది. కనుక మీరు అధికంగా నీరు తాగటం మంచిది. ఈ సమయంలో మీరు ఎక్కువసార్లు మూత్రం చేయాల్సి వస్తుంది. అయినప్పటికి డెలివరీ తర్వాత మీరు నీరు అధికంగా తాగాలి.
తల్లిపాలను ఎంతకాలం పట్టాలి? బిడ్డకు తల్లిపాలు మినహా 6 నెలల వరకు మరేమీ అవసరం లేదు. ఆరు నెలల తర్వాత బిడ్డకు అదనపు పోషకాహారాన్ని ఘన లేదా ద్రవ ఆహారం రూపంలో ఇవ్వాలి. మీరు ఎంతకాలం కోరితే అంతకాలం బిడ్డకు పాలు ఇవ్వ వచ్చని నిపుణులు చెపుతారు. అంతే కాని ఇంతకాలం బిడ్డకు తల్లిపాలు పట్టాలని లేదు. తల్లి ఇవ్వగలననుకుంటే బేబీ కి రెండు సంవత్సరాలవరకు కూడాపాలు పట్టవచ్చు.
ఏ పొజిషన్ లో తల్లి బిడ్డకు పాలు ఇవ్వాలి? ఇది చాలా ప్రధానం. పొజిషన్ సరి లేకుంటే బిడ్డ అధికమైన గాలిని నోటితో తీసుకునే ప్రమాదముంది. దీనితో వారికి గ్యాస్ ఏర్పడుతుంది. లేదా పాలు సరిగా తాగకుంటే బేబీ ఆకలి భావించి జబ్బు పడుతుంది. తల్లికి కూడా బిడ్డ పాలు తాగకుంటే సమస్యలుంటాయి. తల్లిపాలు పట్టేందుకు సరి అయిన విధానం - తల్లి నాలుగు విధాలుగా బిడ్డకు పాలు పట్టవచ్చు.
1. క్రెడిల్ విధానం- బేబీని క్రెడిల్ చేసి పాలు పట్టడం.
2. క్రాస్ క్రెడిల్ పొజిషన్- బేబీని ఛాతీకి అడ్డంగా పట్టుకొని పాలు పట్టడం..
3. ఫుట్ బాల్ పొజిషన్ - ఈ పొజిషన్ లో బేబీని మీ చేతిలో ఒక బంతివలే పట్టుకొని పాలు పట్టడం.
4. స్లీపింగ్ పొజిషన్ - ఈ పొజిషన్ లో తల్లి బేబీతో కింద పడుకుంటుంది. రాత్రులందు ఈ పొజిషన్ పాలు పడుతూనే బేబీని నిద్రపుచ్చటానికి కూడా పనికి వస్తుంది.
తల్లి, బిడ్డ ఆరోగ్యంగా వుండాలంటే ఈ తల్లిపాలు పట్టే చిట్కాలు ఆచరించండి.



Click it and Unblock the Notifications
