Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ప్రసవం తర్వాత అయ్యే రక్తస్రావంకు మహిళ ఏం చేయాలి?

1. సగటున, ఒక మహిళ 225 మి.లీ. రక్తాన్ని కోల్పోతుంది. బేబీ పుట్టిన తర్వాత రుతుక్రమం లో కూడా ఆమెకు రక్తస్రావం అధికంగానే వుంటుంది. బేబీకి గర్భంలో వున్నపుడు లైనింగ్ గా వున్న గర్భాశయ గోడ కూడా రక్తంతో బయటకు వచ్చేస్తుంది. రక్తస్రావాన్ని తగ్గించటానికిగాను తల్లులు తమ బిడ్డలకు తప్పక పాలు పట్టాలి. తల్లిపాలు పట్టే చర్య గర్భం కుచించుకుపోవటానికి సహకరిస్తుంది. అది రక్తస్రావం తగ్గించి గర్భం కుచించుకుపోవటాన్ని వేగిరం చేస్తోంది.
2. తల్లులు ఆచరించాల్సిన మరో విషయం విశ్రాంతి తీసుకోవడం. పాలు పట్టటమే కాక తగిన విశ్రాంతి ఆమెకుగల నొప్పులను, రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. రక్తస్రావం జరిగేటపుడు మహిళ పడుకుని వుంటే స్రావం కొంత తగ్గే అవకాశం వుంది.
3. రక్తస్రావం అధికంగా వుంటే ప్యాడ్స్ తరచుగా ఎప్పటికపుడే మార్చవలసిన అవసరం వుంది. ఇలా చేస్తే, శరీరం వాసన కూడా రాకుండా వుంటుంది. మార్కెట్ లో దొరికే మంచి నాణ్యతగల శానిటరీ ప్యాడ్స్ వాడకం సూచించదగినది.
4. ప్రసవం తర్వాత పది రోజులకు రక్త స్రావం రంగుమారుతుంది. పింక్ లేదా బ్రౌన్ రంగుకు వస్తుంది. ఇది కనపడితే స్రావం తగ్గుతున్నట్లు చెప్పవచ్చు. అయితే, రంగుకనుక మారకుంటే, పొత్తికడుపు భాగంలో నొప్పి కొనసాగుతుంటే మహిళ సత్వరమే వైద్యుని సంప్రదించాల్సివుంటుంది.
5. తల్లులు కనుక ప్రసవం లేదా సిజేరియన్ తర్వాత రక్తస్రావం జరిగేటపుడు రక్తహీనత ఏర్పడితే వారికి ఐరన్ అధికంగా వున్న ఆహార పదార్ధాలు తగినంత ఎనర్జీని ఇచ్చి అలసటనుండి దూరం చేస్తాయి.
6. బిడ్డ పుట్టిన తర్వాత రక్తస్రావం అవుతున్న మహిళలు కనీసం 6 వారాల వరకు పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టరాదు. స్నానం కూడా, ప్రత్యేకించి సిజేరియన్ ఆపరేషన్ అయినట్లయితే వైద్యుని సంప్రదింపుమేరకు చేయవలసి వుంటుంది.



Click it and Unblock the Notifications