Latest Updates
-
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి! -
ఈ టేస్ట్ నెవర్ బిఫోర్.. సండే స్పెషల్ పాలకూర చికెన్, చిక్కటి గ్రేవీకి మైమరిచిపోతారు.! -
సెప్టెంబర్ 17 న కన్యారాశిలోకి సూర్యుడు.. నెల రోజులపాటు మహర్జాతకులు అంటే వీరే.! -
పసిపిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎప్పటినుంచి ఇవ్వాలి? ఎలా పెడితే ఆరోగ్యానికి మంచిది?
ప్రసవం అయిన అరగంట నుండి....!

బిడ్డకు ఆరు నెలలు వచ్చేంతవరకు తల్లిపాలు ప్రధానంగా ఇవ్వాలి. ఆరు నెలల తర్వాత తల్లి ఆరోగ్యం బట్టి రెండేళ్ళు వచ్చేటంతవరకు ఒకవైపు తల్లిపాలు ఇస్తూనే మరోవైపు పోషక విలువలుకల మెత్తటి ఘన ఆహారాలు అందించాలి. తల్లిపాలకుగల పోషక విలువలు, వ్యాధి నిరోధక విలువల కారణంగా వాటిని బిడ్డకు ఉత్తమమైన ఆహారంగా నిర్ణయించారు. ఈ పాలు ఇతర పాలకంటే కూడా శ్రేష్టమైనవి, సురక్షితమైనవి. పోషక విలువల పరంగా ఇతర ఆహార పదార్ధాలకంటే కూడా తల్లిపాలే శ్రేష్టం. తల్లి సాధారణ ప్రసవం అయిన అరగంటనుండి సిజేరియన్ అయిన 4 గంటల నుండి బిడ్డకు తనపాలు అందించవచ్చు.
ప్రసవం అయిన తర్వాత షుమారుగా రెండు లేదా మూడు రోజుల వరకు తల్లి స్తనాలనుండి వచ్చే పాలు చిక్కని ద్రవంలా పసుపు రంగులో ఉంటాయి. చాలామంది ఈ పాలను బిడ్డకు అనుకూల ఆహారం కాదని భావిస్తారు. కాని ఈ చిక్కని పాలను ముర్రుపాలు అని అంటారు. బిడ్డలో వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే ప్రధానంగా ఈ పాలు పట్టాలి. తల్లిపాలలో కొవ్వు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్, విటమిన్స్ వంటివి పుష్కలంగా బిడ్డకు లభిస్తాయి. 100 మి.లీ. తల్లిపాలలో కొవ్వు 3.8 గ్రా, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు 13 శాతం, ప్రొటీన్లు 0.3 గ్రా., లినోలీట్ 0.51 గ్రా, డిహెచ్ఎ 0.3 మి.గ్రా. ప్రధానంగా వుంటాయి.
బిడ్డకు మొదటి సంవత్సరం అంతా తల్లిపాలు తప్పక పట్టాలి. బిడ్డలోని కొవ్వు కణాల సంఖ్య మొదటి సంవత్సరంలోనే నిర్ణయించబడుతుంది. తల్లిపాలు తాగిన బిడ్డలకు శరీరంలో సరైన సంఖ్యలో కొవ్వు కణాలు ఏర్పడతాయి. గేదె లేదా ఆవు పాల వంటివి బిడ్డకు ఈ వయసులో అధిక కొవ్వు కణాలను చేకూరుస్తాయి. ఫలితంగా మొదటి సంవత్సరంలోనే ఏర్పడిన అధిక కొవ్వు కణాలు బిడ్డకు జీవితాంతం శరీరంపై ప్రభావాన్ని చూపి పిల్లవాడు బొద్దుగా ఊబకాయంతో అధిక కొవ్వు కలిగి ఉండేలా చేస్తాయి. కనుక బిడ్డకు ఎట్టి పరిస్ధితిలోను ఒక సంవత్సరం వయసు వచ్చే వరకు అన్ని పోషకాలు సమపాళ్ళలో కల తల్లిపాలు పట్టటం మంచిది.



Click it and Unblock the Notifications
