Latest Updates
-
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం!
పెయిన్ కిల్లర్లు వాడితే బిడ్డకు లోపాలు వస్తాయా?

ఈ స్టడీని అమెరికన్ జర్నల్ ఆప్ ఆబ్ స్టెట్రిక్స్ మరియు గైనకాలజీలో ప్రచురించారు. సర్వే చేసిన తల్లులలో రెండు నుండి మూడు శాతం మంది తల్లులు మత్తుమందుల పెయిన్ కిల్లర్లు లేదా అనాల్జసిక్ మందులతో చికిత్స చేయబడ్డారు. అయితే స్టడీలో మందులను తల్లులు వారంతవారే వాడితే వచ్చే ప్రమాదాలను పరిశీలించలేదు. వైద్యుల పర్యవేక్షణలోనే ఈ మత్తుమందు పెయిన్ కిల్లర్లు వాడితే వచ్చే అనర్ధాలను పరిశీలించింది.
మహిళలు సాధారణంగా వాడిన మత్తుమందు పెయిన్ కిల్లర్లు కోడీన్ మరియు హైడ్రో కోడోన్ గా గుర్తించారు. ఈ మందుల చికిత్సలను బిడ్డలలో పుటుకతో వచ్చే గుండె లోపాలు, వెన్నెముక లోపాలు, కంటిలోపాలు, జీర్ణ వ్యవస్ధ లోపాలు మొదలైన వాటితో పోల్చారు. అయితే, ఈ పరిశోధనలో పిల్లలకు వచ్చే గుండె సంబంధిత లోపాలు ఈ మందుల కారణంగానే వస్తున్నాయని తేలింది. ఈ ఫలితాలు, గతంలోని పరిశోధనలతో సరిపోలాయి.
ఈ మందులు వాడని మహిళల పిల్లలతో పోలిస్తే వాడిన మహిళ ల పిల్లలలో గుండె సంబంధిత లోపాలు రెండు రెట్లుగా వున్నట్లు పరిశోధన తెలిపింది. ఈ రకమైన లోపాలు అమెరికాలో ప్రతి సంవత్సరం షుమారు 40 వేలమంది పిల్లలలో వారి మొదటి సంవత్సరం వయసులోనే కనుగొనబడ్డాయి. ఈ పిల్లలకు తరచుగా సర్జరీలు, అధిక సమయం ఆస్పత్రిలో గడపటం, ఈ రకమైన లోపాలకు జీవితకాల చికిత్స వంటివి ఎదురయ్యాయి.
కొన్ని మందులు ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవటం ఎంతో ప్రమాదకరమైందని, నిర్ధారించారు. గర్భిణీ స్త్రీలు తీసుకునే మందులు గర్భంలోని పిల్లలపుటుకకు హాని కలిగించరాదని తెలిపారు. మందుల ప్రభావం అనేక కారణాలుగా వుంటుందని, వారు తీసుకునే మందు డోసేజి మొత్తం, ప్రెగ్నెన్సీలో ఏ సమయంలో తీసుకున్నారు? మహిళ ఆరోగ్య పరిస్ధితి, మహిళ తీసుకునే ఇతర మందులు వంటి వాటిపై కూడా ఆధారపడి వుంటుందన్నారు. కనుక గర్భవతి మహిళలు, లేదా గర్భం ధరించాలనుకునేవారు. ఈ రిస్కులతో కూడిన పెయిన్ కిల్లర్లు వాడరాదని స్టడీ నిర్వహించిన డైరెక్టర్ ధామస్ తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో అవసరంమేరకు ప్రధాన మందులు వాడాలని తెలిపారు.
కనుక గర్భవతి మహిళలు, లేదా గర్భం ధరించాలనుకునే మహిళలు, తమకు ఏ వ్యాధి వచ్చినప్పటికి విచక్షణా రహితంగా పెయిన్ కిల్లర్లను వాడితే, తాత్కాలికంగా వారికి ఉపశమనం కలిగినప్పటికి, దీర్ఘకాలంలో ఆ మందుల ప్రభావం వారికి పుట్టబోయే బిడ్డల ఆరోగ్యంపై చూపుతుంది. గర్భవతి మహిళ ప్రధానంగా తన ఆహారాలపట్ల కూడా శ్రధ్ధ వహించాలి. సరైన ఆహారాలు తీసుకొనకపోవడం, సరైన జీవన విధానాలు పాటించకపోవడం వంటివి పెయిన్ కిల్లర్లు వాడేందుకు దోహదం చేస్తాయని గుర్తించాలి.



Click it and Unblock the Notifications
