Latest Updates
-
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్
తల్లి బిడ్డల సంక్షేమం ఒకరికొకరి సంరక్షణలోనే?

మహిళకు పైన తెలిపిన లక్షణాలులో కొన్ని లేదా అన్నీ ఒకే సారి కనపడితే, ఆమె తప్పక వైద్యలను సంప్రదించాలి. అవసరమైతే మానసిక నిపుణులను సైతం సంప్రదించాలి. డిప్రెషన్ తగ్గించాలంటే వివిధ రకాల వైద్యం చేయాల్సివుంటుంది మానసిక వైద్యుడితో సంభాషణలు, మందులు మొదలైనవి కొద్దిరోజులపాటు కొనసాగితే సర్దుబాటు అవుతుంది. డిప్రెషన్ తీవ్ర సమస్య మహిళ జీవితంలో దీనికి వైద్యం అత్యవసరం. పుట్టిన బిడ్డకుగల అవసరాలకొరకు కూడా మహిళ తన డిప్రెషన్ సమస్యకు పరిష్కారం వైద్యులు సూచించిన విధంగా ఆచరించాలి. జీవిత భాగస్వామి, కుటుంబ ఇతర సభ్యులు సైతం అందుకు సహకరించాలి. ప్రత్యేకించి మానసిక వైద్యం చేయించాలి. మనసుకు ఉల్లాసాన్నిచ్చే చర్యలు, ప్రసవానంతరం శారీరక నొప్పులనుండి దూరం చేసే సుగంధ పరిమళాల స్నానాలు, ఆహ్లాదకర సన్నివేశాలు, తగిన విశ్రాంతి కొరకు ఇతర ప్రదేశాలకు ప్రయాణించటం మొదలైనవి ఆమెను అతి త్వరగా కోలుకొనేలా చేస్తాయి. అంతేకాక, ఈ సమయంలో ఆమెకు బిడ్డపై ఆసక్తి అధికంగా పుట్టించాలి. తన శిశువుకు ఆమె ఆహారం అందించటం, శిశువు సంరక్షణ మొదలైనవి మరో మారు ఆమెను మనోవేదన నుండి బయటపడేస్తాయి.
శిశువుకు తల్లిపాల ప్రాధాన్యత -
శిశువులలో సరైన ఎదుగుదలకు, అభివృద్ధికి తగినంత పోషకాహారం ఇవ్వాలంటే తల్లిపాలే శ్రేష్టం. బిడ్డకు ఆరు నెలలు వచ్చేంతవరకు తల్లిపాలు ప్రధానంగా ఇవ్వాలి. ఆరు నెలల తర్వాత రెండేళ్ళు వచ్చేటంతవరకు ఒకవైపు తల్లిపాలు ఇస్తూనే మరోవైపు పోషక విలువలుకల మెత్తటి ఘన ఆహారాలు అందించాలి. తల్లిపాలకుగల పోషక విలువలు, వ్యాధి నిరోధక విలువల కారణంగా వాటిని బిడ్డకు ఉత్తమమైన ఆహారంగా నిర్ణయించారు. ఈ పాలు ఇతర పాలకంటే కూడా శ్రేష్టమైనవి, సురక్షితమైనవి. పోషక విలువల పరంగా ఇతర ఆహార పదార్ధాలకంటే కూడా తల్లిపాలే శ్రేష్టం. తల్లి సాధారణ ప్రసవం అయిన అరగంటనుండి సిజేరియన్ అయిన 4 గంటల నుండి బిడ్డకు తనపాలు అందించవచ్చు.
తల్లిపాలలో కొవ్వు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్, విటమిన్స్ వంటివి పుష్కలంగా బిడ్డకు లభిస్తాయి. 100 మి.లీ. తల్లిపాలలో కొవ్వు 3.8 గ్రా, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు 13 శాతం, ప్రొటీన్లు 0.3 గ్రా., లినోలీట్ 0.51 గ్రా, డిహెచ్ఎ 0.3 మి.గ్రా. ప్రధానంగా వుంటాయి.



Click it and Unblock the Notifications
