బిడ్డ పుడితే, హాస్పిటల్ డిశ్చార్జి ఎలా?

By B N Sharma

Baby
గర్భిణీ మహిళ నెలలు నిండి నొప్పులు రాగానే ఆస్పత్రిలో చేరుతుంది. అయితే ఆ నొప్పులు కొన్ని గంటల వరకు కొనసాగుతాయి. లేదా కొన్ని పరిస్ధితులలో ఒకటి లేదా రెండు రోజులు కూడా కొనసాగే అవకాశం వుంది. డెలివరీ అయిన తర్వాత తల్లి తన బిడ్డతో 48 గంటల లోపుగానే ఆస్పత్రి నుండి విడుదల కావచ్చు.

అమెరికాలాంటి అభివృధ్ధి చెందిన దేశాలలో డెలివరీ తర్వాత ఆస్పత్రిలో వుండే సమయం గత కొన్ని దశాబ్దాలుగా తగ్గిపోతూ వస్తోంది. దీనికి కారణం బిడ్డ పుట్టిన తర్వాత వైద్యపర జోక్యం తక్కువగా వుండాలని, డెలివరీ సమయంలో వ్యయం తక్కువగా వుండాలని తల్లితండ్రులు కొరుకోవడంగా చెపుతున్నారు. కెనడా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో కూడా డెలివరీ తర్వాత తల్లి బిడ్డలను సుమారు 48 గంటలలోనే డిశ్చార్జ్ చేయటం జరుగుతోంది.

అయితే, డెలివరీ తర్వాత తల్లి బిడ్డలకు లభించే వైద్య జాగ్రత్తల పరంగా, వ్యయం పరంగా ఈ అంశం ఇతర దేశాలలో వివాదాస్పదంగానే వుంది. ఈ అంశంలో చేసిన స్టడీ మేరకు బయటి సదుపాయాలు సవ్యంగా వుంటే ఆస్పత్రి నుండి త్వరగా డిశ్చార్జి చేయటమే సురక్షితంగా కూడా భావిస్తున్నారు.

Story first published: Thursday, February 2, 2012, 17:44 [IST]
Desktop Bottom Promotion