Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
పాలు పట్టే మహిళ బ్రాసరీ ఎలా వుండాలి?

పాలుపట్టే బ్రాలు ఎలా వుండాలి? బ్రా బిగువు లేదా లూజుగా వుండరాదు. బ్రా బాగా బిగువుగా వుంటే పాల గ్రంధులు మూసుకుపోతాయి. బాగా వదులుగా వుంటే స్తనాల సైజు పెరిగి వేలాడుతూంటాయి. వాటి షేప్ పోతుంది. కనుక మీ స్తనాలకు ఖచ్చితంగా సరిపోయే బ్రాసరీని మాత్రమే వాడాలి.
సాధ్యమైనంత వరకు కాటన్ బ్రాసరీ మాత్రమే ధరించాలి. దీనివలన మీ చర్మంకు బాగా గాలి ఆడుతుంది. చెమటపట్టినా లేదా పాలు కారినా కాటన్ త్వరగా పీల్చేస్తుంది. బ్రా కప్ లో లైనింగ్ వేయబడినదైతే చర్మానికి మరింత రక్షణగా వుంటుంది. బ్రా లో పేడ్లు వుండే అమరిక వుంటే పాలు అధికంగా వచ్చినపుడు పీల్చేసే సౌకర్యం వుంటుంది. కొనేటటువంటి బ్రాలు స్తనాలు తేలికగా బయటకు వచ్చేదిగా హుక్ కలిగి వుండాలి
అండర్ వైర్ వున్న బ్రాలు స్తనాలను నిలబెట్టి వుంచుతాయి. అయితే అదే సమయంలో పాల గ్రంధులను మూసి వేసే ప్రమాదం కూడా వుంది. కనుక ఇవి ఎపుడైనా వేసుకోండి. వేసుకున్నపుడు స్తనాలు నొప్పి అనిపిస్తే, దానిని వాడకండి. రాత్రులందు అండర్ వైర్ కల బ్రాలు వాడవద్దు. మెత్తటి కప్పుల అమరిక వున్న బ్రాసరీస్ అయితే, స్తనాలు వాటిలో చక్కగా ఇమిడిపోతాయి.



Click it and Unblock the Notifications
