Latest Updates
-
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.!
శిశువు పుట్టిన వెంటనే శారీరక మార్పులు?

కొత్తగా పుట్టిన శిశువుకు రక్తపోటు పరిశీలిస్తే సిస్టాలిక్ 75 - 100, డయస్టాలిక్ 50 - 70 గా వుంటుంది. గుండె కొట్టుకోవడం 120 6 160 గాను శ్వాస రేటు 30 - 60 గాను వుంటుంది. కొత్తగా పుట్టిన శిశువులకు చూపు ఎంతో బాగుంటుంది. 18 అంగుళాలు లేదా 45 సెం.మీ. దూరంలో నేరుగా వున్న వాటిని చూస్తారు. ఈ చూపు శిశువు పాలు తాగేటపుడు తన తల్లి కళ్ళలోకి లేదా ఆమె చనుమొనలు చూచేందుకు సరిపోతుంది.
శిశువు తిరగటం మొదలు పెడితేగాని దూరాలు చూడలేడు. ఆహారం కావాలంటే ఏడుస్తాడు. కొత్తగా పుట్టిన శిశువు నిద్రించకున్నా, లేక ఆహారం తీసుకోకపోయినా, లేదా ఏడ్వక పోయినా లేదా వివిధ వస్తువులు చూస్తూ చాలా సమయం గడుపుతూ వుంటారు. బాగా మెరిసేది, రంగులు కలవి లేదా వారి కళ్ళను ఆకర్షించే వస్తువులు చూస్తారు. అయితే, కొత్తగా పుట్టిన శిశువులు, వీటన్నిటికంటే కూడా కొత్త ముఖాలను చూచేందుకు ఇష్ట పడతారు.
చూపు సరే మరి బిడ్డకు వినికిడి ఎప్పటినుండి మొదలవుతుంది?
బిడ్డ తల్లి గర్భంలో వుండగానే శబ్దాలను వినటం మొదలుపెడుతుంది. ముందుగా తల్లి గుండె చప్పుడు, గర్భంలో వచ్చే చప్పుళ్ళు వింటుంది. మానవ స్వరధ్వని, సంగీతం, మరి కొన్ని సున్నితమైన శబ్దాలు వింటుంది. కనుక శిశువు భూమి మీదకు పడకముందే చెవులు ధ్వనులను వింటాయి.
కొత్తగాపుట్టిన శిశువులు, పురుషుల స్వరధ్వనికంటే కూడా మహిళల స్వరధ్వనికి బాగా స్పందిస్తారు. తల్లి స్వరధ్వని వారికి పరిచయంగా వుండి వినపడితే చాలు ఏకాగ్రత పెడతారు. అది వారికి ఎంతో సున్నితం అనిపిస్తుంది. పెద్ద పెద్ద ధ్వనులకు వారు భయపడతారు. వారు తల్లి గర్భంలో వుండగా విన్న శబ్దాలను వినాలనుకుంటారు. అంటే, తల్లి గర్భంతో వున్నపుడు చూసే టెలివిజన్ కార్యక్రమాలలోని శబ్దాలు వారికి పరిచయంగా వుంటాయి.
ఆమె గర్భవతిగా వున్నపుడు తిన్న ఆహారాల వాసనకు ఇష్టపడతారు. వీరి జీర్ణ వ్యవస్ధనుండి నల్లటి పదార్ధం మొదట కొద్ది రోజులు మలద్వారంనుండి బయటకు వచ్చేస్తుంది. శిశువులు సాధారణంగా తమ ఏడ్పుతో సహజంగా సంభాషిస్తారు. ఏడ్చే శిశువు తన ఆకలి, అసౌకర్యం, బోర్ భావించటం, ఒంటరితనం వంటివి తెలుపుతాడు. కొత్తగా పుట్టిన పిల్లలు, రుచులు కూడా గ్రహిస్తారు. తీపి, పులుపు, చేదు, ఉప్పు తేడా తెలుసుకోగలరు.



Click it and Unblock the Notifications
