Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
ప్రసవం తర్వాత మహిళలో మార్పులు ఎలా?

ప్రెగ్నెన్సీగా వున్నపుడు ఆమె గర్భాశయంలో ఏర్పడిన లైనింగ్ తిరిగి యధాస్ధాయికి అతి నెమ్మదిగా రూపొందుతుంది. ఈ సమయంలో ఆమెకు అయ్యే రక్తస్రావం పూర్తి ఎరుపుగా వుంటుంది. పోను పోను అది లేత గులాబిరంగు, ఆపై తెలుపుకు వస్తుంది. ఒక వేళ అవి రంగు మారకుండా ఎరుపుగానే వస్తుంటే. ఆమె వెంటనే పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. షుమారుగా ప్రసవం తర్వాత అయిదు లేదా ఆరు వారాలకు గర్భ సంచి రనతన పూర్వపు రూపు సంతరించుకొని ఆమెలో అప్పటివరకు అవుతున్న డిశ్చార్జి కూడా ఆగిపోతుంది. యోనిద్వారా బిడ్డ జననం జరిగితే దానికి చిన్న కోత కూడా పెడతారు. కనుక నొప్పిగా వుంటుంది. దీనికి వేడినీటి కాపడం లేదా నొప్పి తగ్గే మందులు వాడి ఉపశమనం కలిగించాలి.
ప్రసవ సమయంలో పుట్టిన బిడ్డ యొక్క బరువు, మాయ, ఉమ్మనీరు అన్నీ కలిపి షుమారుగా అయిదు కేజీల బరువు వరకు కోల్పోతారు. అయితే, గర్భం ధరించినప్పటి గుర్తులు అంటే స్ట్రెనచ్ మార్కులు అలాగే వుండిపోతాయి. ఈ మచ్చలు పోవటానికి తాజాగా వస్తున్న కొన్ని క్రీములతో మసాజ్ చేసి తగ్గించవచ్చు.
మహిళ గర్భం ధరించిన తర్వాత ఆమెలో ఈస్ట్రోజన్ స్ధాయి అధికంగా వుంటుంది. కనుక జుట్టు రాలటం జరుగుతుంది. షుమారు బిడ్డకు మూడు నెలలు వచ్చే సరికి ఆమెలోని హార్మోన్లు స్ధిరపడి తిరిగి జుట్టు కుదుళ్లు గట్టి పడతాయి. ప్రసవం జరిగిన మహిళకు విశ్రాంతి చాలా అవసరం. తగిన ఆహారం, అవసరం మేరకు వైద్య చికిత్సలు, వ్యాయామం వంటివి కూడా ఆమెను త్వరగా కోలుకొనేలా చేస్తాయి. శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఆమె కొన్ని మార్పులకు గురవుతుంది. ప్రసవం తర్వాత ఒక తల్లిగా ఆమె బిడ్డ భాధ్యతలను నిర్వహించాల్సివుంటుంది. అందుకుగాను ఆమెకు ఆ సమయంలో కుటుంబ సభ్యుల సహకారం బాగా అవసరపడుతుంది.



Click it and Unblock the Notifications
