Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తల్లికి కలిగే ఆరోగ్య సమస్యలు!

సాధారణంగా డెలివరీ అయిపోగానే ఆమె మెడికల్ గా ఫిట్ గా వుందని భావిస్తే, తన బిడ్డతో ఆమె ఇంటికి వెంటనే చేరిపోతుంది. యోని ద్వారా సహజ జననం అయితే 1 లేదా 2 రోజులు, సిజేరియన్ ఆపరేషన్ ద్వారా అయితే 3 నుండి 5 రోజులపాటు ఆస్పత్రిలో వుంచుతారు. ఈ సమయంలో మహిళ రక్తస్రావాన్ని, విసర్జన క్రియను, బ్లాడర్ నిర్వహణ, బిడ్డ జాగ్రత్త వంటివి నియంత్రిస్తారు. పసిబిడ్డ ఆరోగ్యం కూడా ఇదే సమయంలో నియంత్రిస్తారు.
తల్లికి యోని భాగం వద్ద ప్రసవసమయంలో ఏవైనా చిరుగులు పడ్డాయా అనేది పరిశీలించి అవసరమైతే కుట్లు వేస్తారు. మలబద్ధకం లేకుండా విరేచనం సాఫీగా జరిగేలా చూస్తారు. మూత్రపు సంచిని ఇన్ ఫెక్షన్ ల కొరకు పరిశీలిస్తారు. కండరాల పటుత్వం చెక్ చేస్తారు.
ఈ పరిక్షలన్నీ ప్రధానంగా తల్లి ఆరోగ్యంగా వుండి పుట్టిన బిడ్డను సంరక్షించుకోవటానికిగాను అవసరం. బిడ్డకు పాలు పట్టటం, తన జననాంగాల శుభ్రత, గర్భ నిరోధకతలు, మరల పూర్వము వలే ఆమె జీవితంలో సర్దుబాటు చేసుకోవటం వంటివి సూచిస్తారు. అయితే కొన్నిసార్లు మహిళ వెంటనే మరోమారు తన పూర్వపు స్ధితికి చేరుకోలేక డిప్రెషన్ కు గురవుతుంది. అటువంటపుడు ఈ మానసిక వేదనకు సైతం కొంత చికిత్స చేయవలసి వుంటుంది.



Click it and Unblock the Notifications