Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
బిడ్డ పుట్టిన తర్వాత ఆరోగ్యంగా..ఫిట్ గా... స్లిమ్ గా ఉండటం ఎలా
పోస్ట్ నేటల్ : బిడ్డ పుట్టిన తర్వాత చాలా మందికి చాలా సందేహాలు వారి మెదడులో మెదులుతుంటాయి. వాటిలో ముఖ్యంగి బేబీ ఆరోగ్యం మరియు పెరుగుదల టాప్ లిస్ట్ లో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చూసుకోవాలంటే తల్లి కూడా ఆరోగ్యంగా... ఫిట్ గా ఉండాల్సిందే. గర్భినీగా ఉన్నప్పుడు శరీరంలో అనేక మార్పులు ఏర్పడుతాయి. అలాగే బరువును కూడా పెరుగుతారు. ఆ బరువు బిడ్డ పుట్టిన తర్వాత కూడా అలాగే ఉంటే .. బిడ్డ పుట్టిన తర్వాత స్లిమ్ గా, ఫిట్ గా తయారవ్వాలంటే అందుకు పోస్ట్ నేటల్ యోగా ఒక్కటే మార్గం. దాంతో పోస్ట్ నేటల్ బరువు సులభంగా తగ్గించుకోవచ్చు.
ఇంకా గర్భాధరణ సమయంలో కలిగిన అనేక మార్పుల వల్ల శరీరం అలసట చెంది ఉంటుంది. ఆ అలసటను పోగొట్టుటకు కొన్ని యోగా పద్దతులు బాగా సహాయపడుతాయి. అయితే యోగా విషయంలో మరో జాగ్రత్త ఏమిటంటే అన్ని పద్దతులు పోస్ట్ నేటల్ మహిళలు చేయడానికి ఉపయోగపడవు. పోస్ట్ నేటల్ యోగా మీకు డబుల్అవుతుంది. మీరు సిజేరియన్ కనుక చేయించుకొన్నట్లైతే మీ డాక్టర్ చెప్పేంత వరకూ ఇటువంటి వాటి జోలికి పోకుండుటయే మంచిది. అలా కాకుండా నార్మల్ డెలివెరీ అయిన వారికి ఈ యోగా పద్దతలు బరువు తగ్గడానికి బాగా సహాయపడుతాయి. ఈ యోగపద్దతులతో బరువు తగ్గడమే కాకుండా మీ కండరాలు తగిన శక్తిని అంధిస్తాయి.

టైగర్ పద్దతి: ఇది పోస్ట్ నేటల్ యోగాలో చాలా సాధారణమైన పద్దతి. పోస్ట్ పార్టమ్ నొప్పులు తొలగించుకోవడానికి చాలా సులభంగా పనిచేస్తుంది . ప్లోర్ మ్యాట్ మీద కూర్చొనొ మీ చేతులు, కాళ్ళు ప్లోర్ కు టచ్ చేయాలి. తర్వాత ఒక కాలును టైగర్ కూర్చొన్నట్లు ఒక కాలును మడవాలి. తర్వాత తిరిగి కాలును పొడవుగా చాపి మళ్ళీ తిరిగి అదే పద్దతిలో కాలును మడవాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో కాలును పది సార్లు ముందుకు వెనకకు, ముడుచుకొని కూర్చోవాలి. దీన్ని భుజంగాసనం అంటారు. ఈ పద్దతి వల్ల లోయర్ పొజిషన్ కు బాగా సహాయపడుతుంది.
కోబ్రా పద్దతి: ఈ యోగా పద్దతిని భుజంగాసనం అని కూడా అంటారు. దీని వల్ల లోయర్ బ్యాక్ పెయిన్ ను తొలగిస్తుంది. చాలా వరకూ మహిళలు డెలివరీ తర్వాత ఎక్కువ బ్యాక్ పెయిన్ తో ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఈ పద్దతిలో యోగా చేయడం వల్ల చాలా వరకూ ఉపశమనం పొందవచ్చు. నిటారుగా పడుకొని మీ పొట్టను ఫ్లోర్ మ్యాట్ మీదు గా ఉండేట్లు చూసుకోవాలి . పెల్విక్ ను ప్రెస్ చేసి గాలి పీల్చాలి. తర్వాత శరీరాన్ని కొద్దిగా పైకి లేపి గాలివదలాలి ఇలా చేయడం వల్ల వివిధ రకాల కారణాల వల్ల ఏర్పడే బ్యాక్ పెయిన్ ను పోగొట్టుకోవచ్చు.
ట్రాయాంగిల్ పద్దతి: ట్రైకోనాసన యోగా పద్దతుల్లో ఇదో ఆసనం. దీని వల్ల పొట్ట క్రింది భాగంలో, నడుము చుట్టూ ఉన్నబెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు. ఇంకా కొంత వరకూ పొట్ట మీద ఉన్న చారలు కూడా తొలగించడానికి సహాయపడుతుంది. కాళ్ళ మీద నిలబడి, ఎడమవైపుకు పూర్తిగా వంగి, ఎడమవైపున ప్లోర్ ను టచ్ చేయాలి. అలా టచ్ చేస్తూనే కుడి చేతిని పైకి లేపాలి. ఇదే పద్దతిలో కుడివైపున కూడా చేయాలి ఇలా రెగ్యులర్ గా 10సార్లు రెండు వైపులా చేస్తుండాలి.
సన్ ఆఫ్ బ్రహ్మా పద్దతి: ఆబ్డామినల్ కండరాల్లో నొప్పి ఉన్నప్పుడు మరిచయాసన చాలా బాగా సహయపడుతుంది. కాళ్ళ మీద కూర్చుని మీ ముందున్న ప్రదేశాన్ని స్ట్రెచ్ చేయలి. ఇప్పుడు ఒక కాలిని మడిచి చేతి భుజాలను పైకి లేపాలి. అలాగే చేతులను వెనుకకు మడిచి రెండు చేతి వేళ్ళను కలపాలి . ఇలా ఈ పద్దతిలో కనీసం 30 సెకడ్లు అలాగే ఉండాలి. ఇక రెండో కాలి మీద అదే విధంగా రిపీట్ చేయాలి. కాబట్టిబిడ్డ పుట్టిన తర్వాత బరువు తగ్గాలనుకొనే వారు ఇటువంటి చిన్న చిన్న యోగా పద్దతుల పాటించి శరీరాన్ని, ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచుకోండి.



Click it and Unblock the Notifications