Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ప్రసవం తర్వాత డిప్రెషన్...?ఇలా దూరం చేసుకోండి
మహిళలల్లో ప్రసవం తర్వాత పోస్ట్ నేటల్ డిప్రెషన్ క్రోనిక్ కండిషన్ కు దారితీస్తుంది. ప్రసవం తర్వాత మహిళ శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. చాలా వీక్ గా మరియ శక్తిలేకుండా నీరసించబడి ఉంటారు. అంతే కాదు మెదడు మీద కూడా కొత్త ఒత్తిడికి దారితీస్తుంది. ప్రసవం తర్వాత బరువు కోల్పవడం మనస్సులో ఒక స్థిరమైన ఒత్తిడి కూడా ఉంటుంది. మీరు తిరిగి మీ ఒరిజినల్ షేప్ లోకి మారాలనుకుంటే అందుకు తగినంత శక్తి మరియు వ్యాయామం చాలా అవసరం.
మీరు ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చినట్లయితే, అంతులేని ఆనందం, భయం, ఆందోళన ఎన్నో వుంటాయి. కొంతమందికి అధికమైన ఈ భావాలు డిప్రెషన్ తెప్పిస్తాయి. సాధారణంగా దీనిని ప్రసవానంతర మనోవేదనగా గుర్తిస్తారు. ఈ డిప్రెషన్ కు కాణం మీకు కొత్తగా ఏర్పడే భాద్యతలు, నిద్ర లేకపోవడం లేదా మీ పైనా, మీ భాగస్వామిపైనా శ్రధ్ధ లేకపోవడంగా చెప్పాలి. అయితే, కుటుంబ సభ్యులు, స్నేహితులు సహకారంతో గతంలోని ఆనందాన్ని మీరు మరోమారు పొందవచ్చు. మాతృత్వాన్ని పూర్తిగా అనుభవించవచ్చు.
ఈ దశలో శారీరక, మానసిక మార్పులు మీలో ఎన్నో కలుగుతాయి. బిడ్డ పుట్టిన వెంటనే హార్మోన్లలో మార్పులు కలుగుతాయి. అవి మీ మూడ్ ను మార్చివేస్తూంటాయి. శారీరక రూపం లో సమస్యలేర్పడతాయి. బిడ్డ పుట్టిన తర్వాత కుటుంబ సభ్యులలో వచ్చే తీరు తెన్నులు కూడా కొంత ఒత్తిడి కలిగిస్తాయి. అయితే. మహిళలు, ప్రసవానంతరం కొంత మనోవేదన వుంటుందని గ్రహించాలి. ఈ డిప్రెషన్ మూడ్ స్ధాయిలలో వుంటుంది.
మొదటి స్దాయి డిప్రెషన్ లో మూడ్ లో తరచుగా మార్పులు వస్తూంటాయి. ఆనందం, విచారం, ఆందోళన, చికాకు వంటివి కలుగుతాయి. ఈ లక్షణాలు బిడ్డ పుట్టిన మూడో రోజునుండి అయిదవ రోజువరకు కొనసాగుతాయి. ఆమె తన శరీరాన్ని బేబీని కూడా సరిగా చూసుకోలేదు. శ్రధ్ధ పెట్టలేకపోతున్నానన్న భావన కూడా వుంటుంది. నిద్రాభంగం, ఆకలి, బిడ్డపై శ్రధ్ధ. కొంతమంది తాము ఏం చేయాలో తెలియక ఆత్మ హత్యకు కూడా పాల్పడేవారున్నారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు అన్ని రకాల సౌకర్యాలతో, మంచి మాటలతో ఆమెకు ఊరట కల్గించాలి. ఆమె ఎలా ప్రవర్తించాలో తెలుపుతూ వుండాలి. భాగస్వామి కూడా తగిన విధంగా ఆమె భాధ్యతలు పంచుకోవాలి. అన్నిరకాలుగా ఆమెకు అండగా వుంటే మహిళ త్వరలో కోలుకొనే అవకాశాలుంటాయి.
గర్భిణీగా ఉన్నప్పుడు కడుపులో ఉన్నబిడ్డ బరువు, ప్రసవం తర్వాత ఆ బరువు తగ్గడంతో పోస్ట్ నేటల్ డిప్రెషన్ కు దారితీస్తుంది. అంతే కాదు ప్రసవం తర్వాత మహిళలు చాలా వరకూ హెయిర్ ఫాల్ సమస్యలను ఎదుర్కొంటారు. మీ పాత దుస్తులు ధరించడానికి వీలుపడదు. మీరు చాలా బలహీనంగా, హెయిర్ ఫాల్ తో అందవిహీనంగా కనబడుతారు. ఆ ఎమోషన్స్ కూడా చాలా వరకూ పోస్ట్ నేటల్ డిప్రెషన్ కు కారణం కావచ్చు.
అందుకు మీరు కొంత శ్రద్ద తీసుకొన్నట్లైతే ఈ డిప్రెషన్ నుండి బయట పడవచ్చు. దాంతో మీ బేబిని మీరు శ్రద్దగా, జాగ్రత్తగా చూసుకోగలుగుతారు. కాబట్టి ప్రసవం తర్వాత డిప్రెషన్ నుండి బయటపడటానికి మీకు కొన్ని ఖచ్చితమైన కాట్రాసెప్టివ్ పద్దతులు చాలా అవసరం. పోస్ట్ నేటల్ డిప్రెషన్ పోగొట్టడానికి, మీరు బెటర్ గా ఫీల్ అవ్వడానికి ఈ పద్దతులను పాలో చేసి ముఖంలో మంచి ఫీల్ గుడ్ తో మదర్ మూడ్ లోకి మార్చే కొన్ని సులభమైన చిట్కాలు మీకోసం..

మీ బేబీతో ఆడుకోవాలి: మీ జీవితానికి మీ బేబి ఒక వరం. కాబట్టి కొత్తగా పుట్టిన బేబి కోసం కొంత సమయాన్ని వెంచి, ఆడుకోవడం వల్ల, మీ డిప్రెషన్ ను కొంత వరకూ తగ్గించుకోవచ్చు. మీ బేబితో ఆడుకునేటప్పుడు ఆటోమాటిక్ గా మీ మూడ్ చేంజ్ అవుతుంది. దాంతో డిప్రెషన్ కలగదు.

పోస్ట్ నేటల్ యోగా: ప్రసవం తర్వాత మీ బరువును తగ్గించుకోదలచుకొన్నప్పుడు. మీరు యోగా క్లాస్సుల్లో చేరడం బెటర్. ఇది మీరు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.

ప్లస్ సైజ్ దుస్తులు కొనండి: గర్భిణీగా ఉన్నప్పుడు మీరు బరువు పెరుగుతారు. ప్లస్ పొట్ట దగ్గర కొవ్వుకూడా చేరి పొట్ట ఉబ్బెత్తుగా ఉండి మునపటి దుస్తులు మీకు సరిపోకపోవచ్చు. అందువల్ల పోస్ట్ నేటల్ తర్వాత టైట్ గా వుండి దుస్తులు వేసుకోకుండా కొత్తవి ప్లస్ సైజ్ కొనుగోలు చేయండి.

సమతుల్యఆహారం: బిడ్డ పుట్టిన తర్వాత మహిళలలో పోషకాహార కొరత అధికంగా చూడబడుతోంది. దీనికి కారణం మహిళల అశ్రద్ధ. మహిళలు తమ శ్రధ్ధ అంతా పుట్టిన బిడ్డపైనే అధికంగా చూపుతూ తమ శరీర అవసరాలను కూడా వాయిదా వేస్తుంటారు. ఇది కూడా డిప్రెషన్ కు కారణం అవుతుంది. కాబట్టి ప్రసవం తర్వాత కూడా ఆరోగ్యకరమైన, బాగా ఉడికించిన వాటిని సిగ్గుపడకుండా తినాలి.

ఇంటి నుండి బయటకు రావాలి: చాలా మంది ప్రసవం తర్వాత రెండు మూడు నెలల వరకూ గడప దాటకుండా పత్యం, చన్నీళ్ళు తాకకూడదు, పనులు చేయకూడదు... వగైరా వగైరా అంటూ ఇంట్లోనే బందికాబడి ఉంటారు. అది కూడా ఒత్తిడికి కారణం అవుతుంది. కాబట్టి మీ బోర్ అనిపించినప్పుడు ఫ్రెండ్స్, బందువులను కలవండి. మీ బేబీని కూడా మీవెంట తీసుకెళ్ళడం వల్ల పూర్తిగా మీరు ఎంజాయ్ చేయవచ్చు.

ప్రేమగా ఉండండి: పోస్ట్ నేటల్ డిప్రెషన్ కు మానవ సంబంధం కూడా ఒక కారణమే. ప్రసవం తర్వాత చాలా మంది భర్తలు భార్యకు దూరంగా ఉంటారు. అలాకాకుండా ఆమెతో సాన్నిహిత్యంగా ఉండి, మీ స్పర్శతో ఆమెకు ప్రశాంతతను కలిగించి ఒత్తిడి నుండి బయటపడేలా చేయండి.

అలంకరణకు తిరిగి ప్రాధాన్యం ఇవ్వండి: గర్భిణీగా ఉన్నప్పుడు చర్మ సంరక్షణ, బేబి సంరక్షణ కోసమని కాస్మోటిక్స్ కు దూరంగా ఉంటారు. కాబట్టి ప్రసవం తర్వాత మంచి మోడల్ దుస్తులు, లేదా మీకు నచ్చిన దుస్తులు మరియు మేకప్ వంటి వాటికి తిరిగి ప్రాధాన్యత ఇవ్వండి. దాంతో మీరు ముందులాగా స్మార్ట్ గా కనబడూతు అందరి ప్రశంలు పొందుతూ..ఒత్తిడికి దూరం చేసుకుంటారు.

షాపింగ్: ఎటువంటి ఒత్తిడినైన దూరం చేసుకోడానికి షాపింగ్ ఓ మంచి చిట్కాల. పిల్లలు పుట్టిన తర్వాత కూడా షాపింగ్ చేయడం వల్ల ఒత్తిడి నుండి బయటపడవచ్చు.

పోస్ట్ నేటల్ కలర్స్ ను ఉపయోగించండి: ప్రసవం తర్వాత కొన్ని ప్రత్యేకమైన కలర్స్ మీ మనస్సును ప్రశాంత పరుస్తాయి. ఆనంద పరుస్తాయి. కాబట్టి కొద్దిగా రిలాక్స్ అవ్వొచ్చు. కాబట్టి పోస్ట్ నేటల్ కలర్స్, వైట్, గ్రీన్, బ్లూ వంటివి ఇంటి అలంకరణలో మరియు మీ దుస్తుల అలంకరణ ఉండేట్లు ఎంపిక చేసుకోండి.

ఒత్తిడి దూరం చేసుకోవడానికి స్పా మరియు సలోన్ కు వెళ్ళండి: ప్రసవం తర్వాత కనబడే హెయిర్స్ లాస్ సమస్యలు మరియు స్ట్రెచ్ మార్క్, తొలగించుకోవడానికి సలోని వెళ్ళి ఎక్స్ పర్ట్స్ కన్సల్ట్ అవ్వండి. అంతే కాదు ఇంట్లో చేసుకొనే పెడిక్యూర్, మానిక్యూర్ కూడా కొంత రిలాక్స్ కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications











