Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ప్రసవం తర్వాత ఏర్పడే ఎమోషనల్ ప్రాబ్లెమ్స్
ప్రసవం తరువాత చాలామ౦ది మహిళలకు భావోద్వేగాలు చాలా మారుతాయి. అయితే ఒత్తిడిని తగ్గించుకునేందుకు మీరు కొన్ని పనులు చేయవచ్చు. ప్రసవం తరువాత వచ్చే నిర్వేదం చాలా తీవ్రమైన సమస్య గనుక సహాయం అడగడానికి వెనుకాడకండి.
పిల్లను ప్రసవించిన తరువాత చాలా విషయాలు జరుగుతాయి. మీ సంతానం భూమి మీదకు వచ్చింది కనుక, మీ భావోద్వేగాలలో కొన్ని మార్పులు వచ్చి ఉండవచ్చు. ఇలాంటి మార్పులు ఊహించండి.
మానసికంగా మీరిలా భావించవచ్చు:

"బేబీ బ్లూస్": కొత్తగా తల్లులైనవారు చాలామంది చిరాకు, బాధ, ఏడవడం, ఆందోళన లాంటివి ప్రసవం అయిన కొద్దిరోజులు లేదా వారం దాకా అనుభవిస్తారు. ఈ బేబీ బ్లూస్ సర్వసాధారణం, పైగా శారీరక మార్పులకు సంబంధించింది (హర్మోన్లలో మార్పులు, నిస్త్రణ, అనుకోని ప్రసవ అనుభవాలు), తన సంతానానికి సంబంధించి, కొత్తగా మారుతున్న పాత్రలు లాంటి వాటికీ మానసికంగా సన్నద్ధం కావడానికి పట్టే సమయం సాధారణంగా ఓ వారంరోజులు ఉంటుంది.

పోస్ట్ పార్ట౦ డిప్రెషన్ (పిపిడి): బేబీ బ్లూస్ కన్నా ఎక్కువసేపు ఉండే ఈ పరిస్థితి 10%-20% కొత్త తల్లుల్లో కనపడుతుంది, దీనివల్ల మనశిక పరిస్థితుల్లో మార్పులు, ఆందోళన, అపరాధ భావన, నిర్వేదం లాంటివి వస్తాయి. పిపిడి పిల్లవాడు పుట్టిన సంవత్సరం దాకా నిర్ధారించవచ్చు, ఇప్పటికే వత్తిడి, వత్తిడి కారకాలు, ఒత్తిడి లక్షణాలు ఉన్న కుటుంబ చరిత్ర లాంటి వాటివల్ల ఇది స్త్రీలలో సాధారణంగా కనపడుతుంది.

పైగా, లైంగిక సంబంధాల విషయంలో: మీరు మీ భాగస్వామి వేరువేరు స్థాయిలలో ఉండొచ్చు. మీ భాగస్వామి సంతానం కలగక ముందు ఒదిలేసిన చోటనుండి మిమ్మల్ని అందుకోవాలని అనుకోవచ్చు, మీరేమో శారీరకంగా గానీ, మానసికంగా కానీ అందుకు సంసిద్ధులు కాకపోవచ్చు, హాయిగా నిద్రపోవడం కన్నా రాత్రిపూట ఏమీ కోరుకోక పోవచ్చు. గాయం మానడం కోసం, డాక్టర్లు కూడా లైంగిక సంబంధాలు కలిగి ఉండడానికి కొద్ది వారాలపాటు ఆగమని చెప్తారు.

మానే క్రమం : సర్జరీ తరువాత మొదటి కొద్దిరోజులు నెప్పి తీవ్రంగా ఉండి, క్రమంగా తగ్గిపోతుంది. సర్జరీ తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీ వైద్యుడు చెప్తాడు, అలాగే స్నానం చేయడం, తొందరగా కోలుకోవడానికి చేయాల్సిన వ్యాయామాలు, మలబద్ధకం నివారించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చెప్తాడు.

సంతానం కలగడానికి మీ శరీరం తొమ్మిది నెలలపాటు సిద్ధమైంది. మరి కోలుకోవడానికి కూడా సమయం పడుతుంది కదా! మీకు సిజేరియన్ (సి- సెక్షన్) జరిగినట్లయితే, గాయం మాని మీరు కోలుకోవడానికి మరింత సమయం పడుతుంది. అది ఊహించ కుండా జరిగితే కొన్ని మానసిక సమస్యలు కూడా వస్తాయి.

మీ శరీరం కోలుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. ఇన్ఫెక్షన్ తగ్గడానికి, రక్తస్రావం తగ్గడానికి లేదా గాయపడ్డ భాగం తిరిగి నయంకావడం కోసం శృంగారానికి 4-6 వారాలపాటు ఆగమని డాక్టర్లు సలహా ఇస్తారు.

ముందుగా, చుంబన, కౌగిలి లాంటి పనులతో మొదలు పెట్టండి. దానివల్ల వేజైనల్ లూబ్రికేషన్ మొదలౌతుంది (ఇది హార్మోన్ల వల్ల జరుగుతుంది దాదాపు తాత్కాలికమే), కాబట్టి వాటర్-బేస్డ్ లుబ్రికేంట్ వాడడం మంచిది. గాయం ఉన్న ప్రదేశాల మీద ఎక్కువ వత్తిడి కలిగించని, మీకు సౌకర్యంగా ఉండే భంగిమలు ఎంచుకోండి. మీకు గాయం వల్ల గానీ, నొప్పి వల్ల గానీ భయం వేస్తే మీ భాగస్వామికి చెప్పి ఇద్దరూ మాట్లాడుకుని సౌకర్యంగా ఉండే భంగిమలు ఎంచుకోండి.



Click it and Unblock the Notifications
