Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మొదటిసారి తండ్రవుతున్నారా?

వాస్తవానికి గర్భంతో తండ్రి శారీరకంగా వేరు చేయబడే వుంటాడు. బేబీ శారీరకంగా కలుపబడి వుండదు. తల్లివలే బిడ్డ శ్వాసను ఆనందించలేడు. బేబీ అవసరాలను గమనించలేడు. ఇది ఒక విచారకర విషయమే. కనుక తండ్రులకు గర్భ ధారణ అంటే అంతా బయట చూస్తూ సహకరించే వ్యవహారమే. కనుక వారికి కూడా కొన్ని మార్గదర్శకతలు కావలసిందే. బిడ్డల పట్ల తండ్రులకు కూడా పూర్తి భాధ్యత వుంది. బేబీ తండ్రి పొట్టలో లేదు కాని అంతమాత్రం చేతే అతని భాధ్యత ఏ మాత్రం తగ్గదు. పైగా మరింత పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలి. వాస్తవాలు, వివరాలు, ఆరోగ్య జాగ్రత్తలు అన్ని కావాలి. మీరు అధిక సమాచారం తెలుసుకొని వుంటే బేబీ జన్మించటంలో ఎటువంటి సమస్యలు లేకుండా వుంటుంది. ఒకవేళ ఏవైనా సమస్యలు వచ్చినప్పటికి వాటిని మీరు చక్కగా అధిగమించగలరు.
వాస్తవానికి తల్లులు ఆసమయంలో ఎంతో కలవరంతో వుంటారు. మానసికంగా, శారీరకంగా వారు కష్టదశలో వుంటారు. ఆమెకు కలిగే భావాలు ఎంతో విభిన్నంగా వుంటాయి. హార్మోన్లు అధికమవడంతో మానసిక అసమతుల్యత కలుగుతుంది. ఆమెలో కలిగే, శారీరక, మానసిక వైపరీత్యాలను ఒక తండ్రిగా మీరు పరిష్కరించాల్సివస్తుంది. మీకు గనుక గర్భధారణ, బిడ్డ పుటుక మొదలగు విషయాలపై పూర్తి అవగాహన వుంటే విషయం ఎంతో తేలికవుతుంది. డాక్టర్ వద్దకు సమయానికి తీసుకు వెళ్ళడం, అవసరమైన వైద్య పద్ధతులను ఆచరింప చేయడం ,అవసరమైన విటమిన్లు, మందుల వాడకం వంటివి పర్యవేక్షిస్తూ ఆమెలో తగిన విశ్వాసాన్ని నింపాలి. మానసికంగా ఆమెకు మద్దతునివ్వాలి. మీ సమక్షంలో ఆమె తాను బిడ్డకు తేలికగా జన్మనివ్వగలన్న విశ్వాసాన్ని కలిగించాలి. తొమ్మిది నెలల పాటు మీరు ఆమె వలే బిడ్డను మోయకపోయినా మీరు ఆమెతో పాటు అక్కడ వున్నట్లే.
తండ్రులకు ప్రెగ్నన్సీ అంటే ఎంతో ఆనందం. బిడ్డ తల్లి గర్భంలో వున్నప్పటికి ఆ ఆనందాన్ని మీరు అనుభవించగలరు. కాని పుట్టించిన ఘనత మాత్రం ఆమెదే అవుతుంది. ఉద్యోగస్తులైతే, తండ్రుల మెటర్నీటీ సెలవుకు ముందస్తుగా దరఖాస్తు చేసుకోండి. బిడ్డ పుట్టే ముందు పుట్టిన తర్వాత కూడా మీకు చాలా పని వుంటుంది. డెలివరీ గడువు తేదీకి మూడు లేదా నాలుగు రోజులు ముందు నుండే ఇంట్లో వుంటే, ఆ సమయానికి అన్ని సానుకూల పడతాయి.
ఈ చిన్న చిన్న సూచనలు పాటిస్తే, ఒక తండ్రిగా మీరు ప్రెగ్నెన్సీదశని ఎంతో ఆనందించవచ్చు.



Click it and Unblock the Notifications