Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
గర్భస్రావంలో అత్యవసర చికిత్సలు ఎలా?

ఒకసారి గర్భస్రావానికి లక్షణాలు కనపడ్డాయంటే, ఇక అది జరిగినట్లే. దానిని నిలుపు చేయటం, అనారోగ్యం, ప్రమాదకరం కూడాను. డాక్టర్లు ఈ సమయంలో చేసే చర్యలు మీకు నొప్పినుండి ఇతర సమస్యలనుండి ఉపశమనం కలిగించటానికే. గర్భస్రావానికి చికిత్స వ్యక్తికి వ్యక్తికి మారుతుంది. ప్రతి వ్యక్తికి అది ప్రత్యేకమే కనుక ఎవరికి తగినట్లు వారికి చికిత్స చేయాలి. అయితే, గర్భస్రావాలకు సంబంధించిన కొన్ని సాధారణ అంశాలు ఎలా? అనేది పరిశీలించండి.
గర్భస్రావానికి చికిత్స
1. సాధారణంగా గర్భ స్రావానికి చికిత్స చేయాల్సిన అవసరం లేదు. విచ్ఛిన్నమైన పిండం శరీరంనుండి రక్తంలా బయటకు వచ్చేందుకు మీరు వేచి ఉండాలి. వినటానికి బాధ అయినప్పటికి చేయగలిగింది అంతేనని భావించండి. రక్తస్రావం తీవ్రంగా లేకుంటే, మీరు హాస్పిటల్ కి వెళ్ళడం లేదా ఏదేని మందు వేసుకోవడం చేయాలి.
2. గర్భవతి దశలో రక్తస్రావం కనపడినంత మాత్రాన అది గర్భ విచ్ఛిన్నంగా కూడా భావించరాదు. మీరు వెంటనే డాక్టర్ ను సంప్రదించి దానిని నిశ్చయ పరచుకోండి.
3. కొన్ని సార్లు, రోజుల తరబడి రక్తస్రావం అయినా, అది అసంపూర్ణ గర్భ విచ్ఛిన్నంగా ఉంటుంది. పిండం, పూర్తిగా రక్తం అయిపోదు. గర్భాశయంలో పిండం ముక్కలు ఉండి వ్యాధులు కలిగిస్తాయి. అటువంటపుడు వాటిని కత్తిరించి తీసివేయటం లేదా అది రక్తం రూపంలో బయటకు రావటానికి మందులు వేయటం చేయాలి.
4. మీ గర్భస్రావం బాగా నొప్పి అనిపిస్తే, దానికి నొప్పి తగ్గే మాత్రలు వేయండి. అవసరం అనుకుంటే హాస్పిటల్ లో చేరాలి. అధిక రక్తస్రావం అయినా సరే ఈ పని చేయాలి. మీరు రక్తహీనత వ్యాధికి పరీక్షించబడతారు. రక్తస్రావం ఆగకుండా జరిగితే, మరోమారు మీకు రక్తం కూడా ఎక్కిస్తారు.
5. డాక్టర్లు ఈ పరిస్ధితికి కనీసం ఒక వారం రోజులు బెడ్ రెస్ట్ అంటే విశ్రాంతి సూచిస్తారు. గర్భవతి దశలో ముందుగానే గర్భ స్రావం అయిపోతే, మీకు ప్రమాదం తక్కువగా ఉంటుంది.
6. ఈ గర్భస్రావ దశలో మీ పార్టనర్ తో శారీరక సంబంధం ఉండరాదని మీకు చెపుతారు. అంటే మీ గర్భానికి పూర్తిగా కొద్ది వారాలపాటు పూర్తి విశ్రాంతి కావాలి. లోపలి గాయాలు నివారణ కావాలి.
7. అదేరకంగా మీరు కొన్ని మందులకు అంటే రక్తం పలుచన చేసే మందులైన యాస్పిరిన్, ఇబుప్రోఫెన్, మొదలైనవాటికి దూరంగా ఉండాలి.
గర్భ విచ్ఛిన్నంలో శారీరక చికిత్స అంటే చాలా తేలిక. అయితే, ఆమె మానసికంగా కోలుకోవటానికి చాలా సమయం పడుతుంది.



Click it and Unblock the Notifications