Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భవతులకు గుండెలో మంటగా ఉంటే?

అదనపు గ్రంధి - గర్భవతికి అదనంగా ఎండోక్రైన్ గ్రంధి ఒకటి పని చేస్తుంది. పిండానని పట్టుకునే ప్లాసెంటా కూడా కొన్ని హార్మోన్లు ఉత్పత్తి చేస్తుంది. ప్రొజెస్టిరోన్ అధికంగా ఉత్పత్తి అయి దాని ప్రభావం ఇతర గ్రంధులపై పడుతుంది. ఆమ్ల ఆహారం కడుపులో మధించబడి ఆహార గొట్టానికి వెనక్కు పంపిస్తుంది. ఈ చర్య కడుపులో అక్కడనుండి గుండె ప్రాంతంలోకి మంట కలిగిస్తుంది. జీర్ణక్రియ మందగిస్తుంది. దానికి తగ్గట్టు పెరుగుతున్న పిండం కారణంగా కడుపులో ఖాళీ ప్రదేశం తగ్గిపోతుంది.
జీర్ణక్రియ - ఈ సమస్య నివారణకు తేలికగా జీర్ణం అయే ఆహారం తీసుకోవాలి. కొద్దిమొత్తంలో ఎక్కువసార్లు తినాలి. దీనితో ఆహారం వెనక్కు వచ్చే సమస్య వుండదు. తీసుకున్న ఆహారాన్ని బాగా నమలండి. భోజనం తర్వాత లవంగం, వంటి మౌత్ ఫ్రెషనర్స్ కూడా జీర్ణక్రియకు తోడ్పడతాయి. పడకకు వెళ్ళే సమయంలో తినకండి. తిన్న రెండు గంటల తర్వాత పడకకు చేరండి. మసాలాలు, పులుపు పదార్ధాలు తినకండి. మీకు సరిపడే ఆహారం తీసుకోండి. పండ్లు గర్భవతి స్త్రీలు అధికంగా తీసుకోవాలి. ప్రతిరోజూ ఒక గ్లాసెడు పండ్ల రసం ఆమె జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
దుస్తులు - గర్భవతి మహిళ తాను గర్భవతి అయనప్పటినుండి తన దుస్తుల పట్ల శ్రధ్ధ వహించాలి. ఆమె వేసే దుస్తులు, ఆమెకు హాయిగొల్పాలి. మంచి గాలి ఆమె శరీరానికి తగిలి చెమట పట్టనివై వుండాలి. సాధారణంగే నేటి రోజులలో మహిళలు, నైటీల వంటివి వేసి సౌకర్యంగా వుండటానికి ప్రయత్నిస్తూనే వున్నారు. దుస్తులు లేత రంగులలో గాలి చొరబడుతూ వదులుగా వుండాలి. బిగువు దుస్తులు ధరించకండి. ప్రత్యేకించి నడుము భాగంలో టైట్ లేకుండా చూడండి. హాయిని గొల్పుతూ ఆమె ధరించే దుస్తులు వదులుగా వుండాలి. దుస్తులు సాధ్యమైనంతవరకు కాటన్ దుస్తులై వుండాలి. కొంతమంది మహిళలు గర్భవతులైన కొత్తలలో తమ పొట్ట కనపడకూడదనే నెపంతో బిగువైన దుస్తులు ధరిస్తారు. బిగువు దుస్తులు శరీరంలోని భాగాలలో రక్తప్రసరణ అడ్డగిస్తాయి. బిగువు దుస్తులు ఆమెకే కాదు, ఆమె గర్భంలో వున్న బిడ్డకు సైతం అసౌకర్యం కలిగించేవిగా వుంటాయి. ఈ మె ధరించే దుస్తులు పేంట్లు షర్టుల వంటివి వేయకుండా వీలైనంతవరకు తేలికగా తీసివేసే దుస్తులై వుండాలి.
అవసరమనుకుంటే, గుండె వచ్చినపుడు తగిన వైద్యం కొరకు సంప్రదించాలి. వైద్యుల సలహాపై పరిస్ధితి చక్కబడేంతవరకు వారు సూచించిన మందులు నియమం తప్పక వాడాలి. ఈ చర్యలు చేపట్టి గర్భవతి మహిళకు గుండె మంట రాకుండా జాగ్రత్తలు పడండి.



Click it and Unblock the Notifications