Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
గర్భిణీ స్త్రీలకు బలవర్థక ఆహారాన్ని ఇవ్వకుండా ఆంక్షలా...?
గర్భిణీ స్త్రీలకు బలవర్థక ఆహారాన్ని ఇవ్వకుండా ఆంక్షలా...?

అయితే గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహార ప్రమాణాలు అప్పుడే పుట్టిన శిశువుల ఆరోగ్యంపై పూర్తిగా ప్రభావం వేస్తున్నాయని తాజా అధ్యయనం బట్టి తెలుస్తోంది. స్త్రీ పురుష సంపర్కం తర్వాత ఫలదీకరణ ప్రక్రియ జరగక ముందునుంచే మహిళలు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు అనే అంశం పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం వేయనున్నదని డాక్టర్ ఆడమ్ వాట్కిన్స్ తెలిపారు.
మహిళ గర్భంలోని అండం అండాశయంలో పరిపక్వత చెందడం ప్రారంభించినప్పటినుంచీ గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారం భావితరం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం వేస్తుందని ఈ పరిశోధన తెలిపింది. ఫలదీకరణ, అండం రూపొందుకునే దశల్లో స్త్రీ పోషకాహారం తీసుకోలేదంటే అది పిల్లల తర్వాతి జీవితంపై వ్యతిరేక ప్రభావం కల్గిస్తోందని ఇటీవలి అధ్యయనాలు తెలిపాయి.
ఈ విషయాన్ని నిర్ధారించటానికి చేసిన ప్రయోగంలో ఆడ ఎలుకకు తక్కువ పోషకాహార విలువలు కలిగిన ఆహారాన్ని ఇచ్చి తర్వాత దాన్ని మగ ఎలుకతో సంపర్కం చేయించారు. దీని తర్వాత ఫలితాలను పరిశీలిస్తే ఆ ఆడ ఎలుక సంతానం పలు సమస్యలకు గురవుతున్నట్లు గమనించారు.
కాబట్టి సంప్రదాయాల పేరుతూ గర్భిణీ స్త్రీలకు బలవర్థక ఆహారాన్ని ఇవ్వకుండా ఆంక్షలు విధిస్తున్న కుటుంబాలు, సమాజం కాబోయే తల్లుల ఆహారం గురించి ఇకనైనా జాగ్రత్త తీసుకోవలసిన అవసరం ఉంది. భవిష్యత్తరాల బాగుకు ఇది చాలా అవసరం.



Click it and Unblock the Notifications