Latest Updates
-
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.!
తేలికైన మసాజ్ ఎంతో రిలీఫ్!

ఫలితంగా సైక్రోఐలియాక్ జాయింట్స్‌పై భారంపడుతుంది. ఒక్కొమారు ఇవి బిగుసుకుపోతాయి. ఫలితంగా నొప్పి వస్తుంది. ఈ నొప్పి సాధారణంగా 4 నుంచి 8 నెలల వరకూ ఉంటుంది. దీనివలన ఒకపక్కకు ఒరిగి పడుకుని మరోవైపుకు తిరగాలంటే కష్టమైపోతుంది. ఇండియన్ టాయిలెట్స్‌పై కూర్చోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. కూర్చుని లేచే పనులు చాలా కష్టమవుతాయి. నడక, మెట్లు ఎక్కడం, ఎక్కువ సేపు నిలబడడం సాధ్యంకాదు.
గర్భిణీలో వెన్ను నొప్పికి నివారణ ఏమిటి...?ఒకవైపు ఒరిగి పడుకున్నపుడు కాళ్ళ మధ్య తలగడ పెట్టుకుని పడుకోవాలి. దాంతో పైనఉండే కాలు మరింత దగ్గరకు వచ్చి నొప్పి పెట్టకుండా ఉంటుంది. కింద కూర్చోవడం, ఇండియన్ టాయిలెట్లు వినియోగించకపోవడం మంచిది. పూర్తిగా వీలు కాకపోతే తగ్గించడం మంచిది.
వ్యాయామాలు ఎలా చేయాలి? గర్భిణీగా ఉన్నపుడు ఎంత హుషారుగా ఉంటే అంత మంచిది. క్రమం తప్పకుండా నడిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మొదట నిటారుగా పడుకోవాలి. తరువాత రెండుకాళ్ళు ముడుచుకోవాలి. నడుం కింద ఓ చెయ్యి పెట్టుకుని ఒత్తిడి పడేలా నొక్కాలి. అలా ఐదు లెక్కపెట్టి వదలివేయాలి. తరువాత రెండుకాళ్ళు ఒకమారు కుడివైపుకు, మరోమారు ఎడమవైపుకు వంచాలి. దీనివలన కాస్త ఉపశమనం లభిస్తుంది.
నొప్పినుండి రిలీఫ్ పొందాలంటే తేలికైన మసాజ్ మంచిది. అయితే హాట్ బ్యాగ్ వంటివి చేస్తే సత్ఫలితాలనివ్వదు. మందపాటి టవల్ వేణ్ణీళ్ళలో పిండి కాపడం పెట్టాలి. చిన్నపిల్లలకు సేవలు చేసేటప్పుడు కిందకు వంగడం సాధారణం. అందుకు బదులుగా వారినే మంచం, కుర్చీ లేదా ఎత్తయిన ప్రదేశాలలో కూర్చోబెట్టి వంగకుండా ఉంటే బాగుంటుంది.



Click it and Unblock the Notifications
