Latest Updates
-
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.!
గర్భవతి మహిళకు ఆఫీస్ దుస్తులు ఎలా వుండాలి?

ప్రెగ్నెన్సీ ప్రారంభ దశలో ఎపుడూ వేసే సాధారణ దుస్తులు ఆఫీస్ కు సరిపోతాయి. సుమారు 8 వారాల గర్భం వరకు మహిళలు సాధారణ దుస్తులతో సౌకర్యంగానే భావిస్తారు. పేంటు ధరించేవారు టక్ చేయవద్దు. పేంట్ బటన్ తీసివేసి బెల్టు వంటివి బిగువు కొరకు ధరించండి. మీ స్తనాలు సైజులో పెరుగుతూంటే, ఒక జాకెట్ వంటిది వేసి కవర్ చేయండి. లేదా గతంలో లూజుగా వున్న దుస్తులు ధరించండి. ఎదిగే ఛాతీ భాగం పెద్దగా కనపడకుండా వుంటుంది.
సాంప్రదాయ దుస్తులైన పంజాబి డ్రస్ లేదా కుర్తి వంటివి సౌకర్యంగానే వుంటాయి. దుస్తుల రంగు డార్క్ గా వుండేలా చూసుకోండి. మీరు సన్నగా కనపడి పెరిగిన బరువు అనిపించదు. బేబీ బంప్ కనపడకుండా - ఈ దశలోనే మీరు జాగ్రత్త పడాలి. మీ దుస్తుల శైలి మారాలి. ఎలాస్టిక్ బేండ్ వున్న కొన్ని పాంట్లు, స్కర్టులు కొనండి. అవి మీ వాస్తవ సైజుకంటే పెద్దవిగా వుండాలి. వదులుగావుండే షర్టులు, జాకెట్లు, పేంట్లు, లేదా కుర్తాలు ఈ సమయంలో బాగుంటాయి. పొట్టకు సరైన రీతిలో గుడ్డ బెల్టు వంటివి ధరించండి.
ఇక మీరు గర్భవతి అని అందరికి తెలిసిన తర్వాత - వదులుగా వుండే దుస్తులు ధరించండి. లైట్ రంగుల దుస్తులు మీకు హాయినిస్తాయి. స్కర్టులు, డ్రస్ లు సౌకర్యంగా వుంటాయి. పేంట్లు ధరించవద్దు.
మీరు వేసుకున్న దుస్తులకు మ్యాచ్ అయ్యేలా మెడచుట్టూ మఫ్లర్ లేదా షాల్ వంటివి పైన కప్పుకోండి.
అందమైన లైట్ రంగు కాటన్ చీరలు ఈ సమయంలో ఎంతో సౌకర్యంగా వుండి హాయినిస్తాయి.



Click it and Unblock the Notifications
