Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయా? పీరియడ్స్ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మే 2026 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రిసెప్షన్: తారల సందడితో హోరెత్తుతున్న వేదిక.. ఫోటోలు వైరల్! -
వైశాఖ పౌర్ణమి వేళ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
కరకరలాడే క్యాబేజీ టిక్కీలు..క్యాబేజీ వద్దు అన్నవాళ్లే ప్లేట్లు ఖాళీ చేస్తారు -
ఇంట్లో బ్రెడ్ మిగిలిపోయిందా? అయితే పడేయకుండా ఇలా రుచికరమైన బ్రెడ్ ఉప్మా చేసేయండి! -
ఎండల దెబ్బకు మారుతున్న పెళ్లిళ్ల ముహూర్తాలు.. అసలు ఏం జరుగుతోంది? -
చంద్రుని రాశి మార్పు: వృశ్చికంలోకి చంద్రుడు.. ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం! -
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలంటే ఇవి తప్పనిసరి! -
వృషభం, తుల, కుంభ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. భారీ లాభాలు! - శుక్రవారం, 01 మే 2026
తల్లీ బిడ్డలకు ప్రశస్తం...యోగాబ్యాసనం...!

సాధారణంగా మనలో చాలా మందికి ఉండే అభిప్రాయమేమంటే, గర్భం దాల్చిన తర్వాత ఏ పని చేయకూడదు. విశ్రాంతిగా ఉండాలి అని. ఈ విధమైన అపోహతో సరైన వ్యాయామం చేయకపోవటం ద్వారా చాలావరకు సహజ ప్రసవాలు తగ్గిపోయాయి. కారణం, శరీరాన్ని కొన్ని భంగిమలలో మాత్రమే ఉంచటం ద్వారా కండరాల పటుత్వం పెరగకపోవడం, బిడ్డ ఎదుగుదలకు అనువుగా మార్పులు చెందకపోవడం వల్ల అనేకమైన సమస్యలు ఏర్పడి ప్రస వం సమయంలో ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడు తుంది. గర్భిణీలు ప్రత్యే కమైనటువంటి వ్యాయామాలు, యోగ సాధనలు చేసినట్లయితే, సీజెరియన్ బాధ లేకుండా సహజ ప్రసవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకమైన వ్యాయామాలు, ప్రాణాయామాలు, వజ్రాసనం ఇలా కొన్ని సులభమైన ఆసనాలు వేయాడం ద్వారా అంతే కాదు తల్లి గర్భంలో ఉన్న బిడ్డకు అన్ని అవయవాలు సక్రమంగా పెరుగుతాయి, బిడ్డ చాలా యాక్టీవ్‌గా ఉంటాడు. ''విజనరీ ప్రెగ్నెంట్'' ద్వారా ఆరోగ్యకరమైన, అందమైన, చురుకైన బిడ్డను తల్లిదండ్రులు పొందవచ్చు.
గర్భిణీ స్త్రీలు చేయవలసిన వ్యాయామాలు
1. గర్భిణి శరీరంలో అనేక విధాల హార్మోనల్ మార్పులు జరుగుతుంటాయి. హార్మోన్స్ మధ్య అసమతుల్యత ఏర్పడుతూ ఉంటుంది. ఇటువంటి సమయంలో శారీరక వ్యాయామాలు గర్భిణీకు చాలా ఉపయోగపడుతాయి.
2. గర్భిణీలు డెలివరీ సమయంలో ప్రసవ వేదనను భరించలేక సిజేరియన్ వైపు మొగ్గు చూపిస్తారు. కాని సహజ ప్రసవానికి అనుకూలంగా అవసరమైన కండరాలను బలపరచడంలో గర్భిణీ స్త్రీలకు వ్యాయామం సహకరిస్తుంది.
3. వ్యాయామాలు మరియు ప్రాణాయామాలు పురిటి నొప్పులు, మలబద్ధకం మరియు తల తిప్పడం లాంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తాయి.
4. డెలివరీ తర్వాత శిశువుని ఎత్తుకోవడం, ఎక్కువ సేపు చేతుల్లో పట్టుకోవడంతో చేతి నొప్పులు, భుజాల నొప్పులు వస్తాయి. వీటి నుంచి ఉపశమనం పొందేలా చేతి కండరాలు, భుజాల కండరాలు ధృడంగా చేయడానికి వ్యాయామం సహకరిస్తుంది. అయితే గర్భిణీలు ఏ వ్యాయామం, యోగాసనాలు వైద్యుల సలహా మేరకు ఆచరించాలి.
5. ఉపయోగం: గర్భిణీలు వజ్రాసనం వేయడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఎక్కువ సార్లు ఊపిరి తీసుకోవడం వల్ల శ్వాసక్రియ వేగంగా జరుగుతుంది. ఏకాగ్రత లభిస్తోంది. కండరాల పటుత్వం పెరిగి సహజ ప్రసవానికి సహకరిస్తుంది.
6. జాగ్రత్తలు: ఏ సమయంలో నైనా ఈ ఆసనం వేయవచ్చు. ప్రారంభంలో మడమలు నొప్పిగా అగుపిస్తాయి. అప్పుడు మడమల కింద మెత్తని కుషన్ లేదా స్పాంజీ దిండు ఉంచుకోవాలి.



Click it and Unblock the Notifications