Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భవతుల చక్కెర వ్యాధి వస్తే?

డయాబెటీస్ - సరిగ్గా ఈ సమయంలోనే ఆమెకు గర్భవతుల డయాబెటీస్ వచ్చే అవకాశం వుంది కనుక, పరీక్షలు చేయించి సరైన మందులు తీసుకోవాలి. 32 వారాల గర్భవతి కనుక షుగర్ కలిపిన కార్బోనేటెడ్ కూల్ డ్రింకులు తాగరాదు. ఇవి శరీరంలోని గ్లూకోజ్ లో అసమతుల్యత కలిగిస్తాయి.
మూడవ త్రైమాసికంలో గర్భంలో సంకోచ, వ్యాకోచాలు అధికమవుతాయి. వీటి తీవ్రత ఎప్పుడూ ఒకేలా వుండదు. వైద్యుల సలహాలు సంప్రదింపులు తరచుగా వుండాలి.
శ్వాస - ఈ సమయంలో గర్భాశయం పెద్దదవటంతో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. పెరిగిన గర్భాశయం ఊపిరితిత్తులకు ఒత్తిడినిస్తుంది. కనుక శ్వాస గాఢంగా తీసే ప్రాణాయామాలవంటి వ్యాయామాలు ప్రయోజనంగా వుంటాయి.
వెన్ను నొప్పి - మూ డవ త్రైమాసికంలో పొట్టపై అధికబరువు పడటంతో వెన్ను నొప్పి వస్తుంది. దీనికిగాను వీపుకు మర్దన, తలగడలు వీపు వెనుక పెట్టుకోవడం మొదలైన చర్యలు ఊరట కలిగిస్తాయి.
గుండె మంట- పెరిగిన గర్భం పొట్టపై ఒత్తిడి తెచ్చి గుండెకు, అన్నవాహికకు కొంత మంట కలిగిస్తుంది. దీనికిగాను వైద్యుని సలహాతో సరైన మందులు పొందటం మంచిది.
మొలలు - ఎదుగుతున్న బిడ్డ గుద ప్రాంతంలోని రక్తనాళాలపై అధిక బరువు కలిగించి మొలలను కలిగించవచ్చు. కనుక మలబద్ధకం లేకుండా ఎప్పటికపుడు చూసుకుంటే, వాపు, మంట మొదలైనవి రాకుండా వుంటాయి.



Click it and Unblock the Notifications