Latest Updates
-
తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో పోటీ.. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న వైరల్ వీడియో -
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.! -
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా..
ఉద్యోగం చేసే గర్భిణీ మహిళలకు విలువైన సలహాలు...!
ప్రస్తుత కాలంలో జీవన ప్రమాణాలు పెరగడతం సిటీల్లో బ్రతకడం కష్టమైపోతోంది. ఇద్దరున్న ఇంట్లో భార్య, భర్త ఇద్దరూ కలిసి సంపాదన చేస్తే తప్ప జీవితంలో సుఖంగా గడపలేకపోతున్నారు. అటు వంటి సమయంలో స్త్రీ తప్పని సరి పరిస్థితులల్లో ఉద్యోగాలకు వెళ్ళాల్సి వస్తోంది. ఉద్యోగం చేస్తున్న స్త్రీలు, గర్భం ధరించడం అంటే ఆ క్షణాలు వారికి అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. ఆమె గర్భవతి అయినప్పుడు ఆమె జీవితంలో అనేక మార్పులు సంతరించుకుంటాయి. ఈ రోజుల్లో గర్భం అనే తేలికగాతీసుకొంటున్నారు. ఎందుకంటే గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలనే వారు క్రితంలో. అయితే ఇప్పుడు అవేం పట్టించుకోకుండా ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయిన రోజు నుండినే వారి వారి పనులకు హాజరవుతుంటారు. కొంతమంది ప్రసవం అయ్యేంత వరకూ కూడా ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే అటువంటి సమయంలో చాలా జాగ్రత్త ఉండాలి. అందుకు తగినటువంటి కొన్ని సూచనలు తప్పకుండా గుర్తుంచుకోవాలి.

మెట్లు ఎక్కకూడదు: సాధారణ సమయంలో మెట్లను ఎక్కినా పర్వాలేదు, బరువు తగ్గడానికి బాగా సహరిస్తుంది. అయితే గర్భందాల్చిన సమయంలో మెట్లను ఎక్కకుండా లిప్ట్ వాడకోవడం ఉత్తమమైన పని. మెట్లు ఎక్కడం వల్ల అలసిపోవడమో లేదా మరేదైనా ప్రమాదం జరగవచ్చు. కాబట్టి మెట్ల ఎక్కకుండా అవాయిడ్ చేయండి. డాక్టర్ సలహా ప్రకారం తప్పనిసరిగా మెట్లను ఎక్కకపోవడమే మంచిది. ఒక వేళ తప్పనిసరి పరిస్థితుల్లో మెట్లను ఎక్కాల్సి వస్తే చేతులలో మరే ఇతర బరువులు లేకుండా జాగ్రత్తపడాలి. మెట్ల ఎక్కేటప్పుడు సపోర్ట్ గా హ్యాండీల్స్ పట్టుకొని నెమ్మదిగా ఎక్కాలి. గర్భిణీ స్త్రీలు ఫ్లాట్ గా ఉన్న స్లిప్పర్స్ ను ధరించడం వల్ల స్లిప్ అవ్వకుండా, సౌరకర్యంగాను ఉంటాయి.
హెల్తీ స్నాక్స్: గర్భిణీ స్త్రీలలో ఎక్కువగా ఆకలిగా ఉండటం అనేది సాధారణ విషయం. ఇద్దరి తిండి తినాలి. నీ కోసమే కాదు, నీ బిడ్డ కొరకు కూడాను....అనేది పాతకాలం నాటి మాట. ప్రెగ్నెన్సీలో పుట్టే బిడ్డ కొరకు మహిళ శరీరంలో వచ్చే మార్పులకు అధిక పోషకాల అవసరం వుంటుంది. అందుకుగాను ఆమె పోషకాలు, విటమిన్లు, మినరల్స్ అన్ని వున్న ఆహారాలు తినాలి. కాబట్టి పనిచేసే గర్భిణీ స్త్రీలు తమ వెంట ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకుపోవడం అవసరం. వీటిని చాలా తక్కువ మోతాదులో తినాల్సి ఉంటుంది. ఆహారం కంటే ఎక్కువగా వీటిని తినకూడదు.
కాఫీ మరియు సిగరెట్: కాఫీ లోని కెఫిన్ మరియు కెఫినేటెడ్ డ్రింక్స్ మొదటి మూడు మాసాలలో ఎక్కువగా తీసుకోకూడదు . రోజుకి 200 మి.గ్రా. కంటే ఎక్కువ తీసుకుంటే గర్భస్రావము జరిగే ప్రమాధము ఉంది . కెఫిన్ డైయూరిటిక్ గా పనిచేయును . వంటిలోని నీరును బయటికి పంపివేయడం వలన డీహైడ్రేషన్ వచ్చే అవకాశము వలన గర్భస్రావము జరిగే చాన్స్ ఎక్కువ.
పొగతాగడం చేయరాదు. సిగరెట్ లో వుండే నికోటిన్ బేబీకి చేరి కేన్సర్ కలిగించే ప్రమాదం వుంది. అంతేకాక గర్భ విచ్ఛిన్నం లేదా కడుపులోని బిడ్డ చనిపోవటం వంటివి కూడా జరుగవచ్చు. హానికర పదార్ధాలకు, రసాయనాలకు సాధారణంగా ఇంటిలో వాడే క్లీనర్లలోని సీసం, మెర్కురీ వంటివాటికి పురుగుమందులు, పెయింట్ వంటివాటికి దూరంగా వుండాలి.
సిట్టింగ్: మీరు కూర్చొనే ప్రదేశం. మీరు కూర్చునే విధానం కరెక్ట్ గా ఉండాలి. కూర్చిలో కూర్చొన్నప్పుడు పొజీషన్ నేరుగా కూర్చోవడానికి ప్రయత్నం చేయాలి. గర్భిణీగా ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్ సహజం. అయితే ఆ పెయిన్ రాకుండా కుషన్ ను సపోర్ట్ గా పెట్టుకోవచ్చు. మీరు మీరు కూర్చున్న ప్రదేశంలో కష్టంగా ఉన్న, వికారంగా భావించినా పూర్తిగా శ్వాస తీసుకొని తర్వాత ఏదైనా తింటే మంచిది.
విరామం: ఒక్కే ప్రదేశంలో ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల శరీరానికి రక్త ప్రసరణ సరిగా అందకపోవచ్చు. కాబట్టి మధ్యమధ్యలో అప్పుడప్పుడూ లేచి తిరగడం మంచిది. అలాగే ఎక్కువ నీటిని తీసుకోవాలి. ఇలాంటి మద్య మద్యలో విరామం తీసుకోవడం వల్ల అనారోగ్యం సమపస్యలుండవు, నీరసం అనిపించదు. కాబట్టి ఇలాంటి నియమాలను పాటించడం గర్భిణీ స్త్రీకి ఎంతైనా అవసరం.



Click it and Unblock the Notifications