Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
గర్భిణీ స్త్రీలు ఒత్తిడిని తగ్గించుకొనే 10 ఉపాయాలు!
గర్భిణీ స్త్రీలు ఎన్నో ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు. వాటిలో ముఖ్యంగా ఆలోచించేది ఆహారపు నియమాలు,అధిక బరువు మరియు బిడ్డ పుట్టుక గురించి. మెటర్నిటీ లీవ్ తీసుకోవడానికి ముందే పని మొత్తం పూర్తి చెయ్యాలని కూడా భావిస్తారు. బిడ్డతో పెంచుకోవాలని, పాలు పట్టాలని, ఆ బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలని ముచ్చట పడతారు. ఇలాంటి ఆలోచనలు గర్భిణీ స్త్రీలకు సహజమే. ఒత్తిడి కూడా ఏర్పడుతుంది. పుట్టబోయే బిడ్డకి సంబంధించిన ప్రతి చిన్న విషయం జాగ్రత్తగా ఆలోచిస్తారు. తద్వారా ఒత్తిడికి గురి అవుతారు.
ఈ ఒత్తిడి బిడ్డకి మంచా, చెడా?
ఒత్తిడికి గురి అయిన తరువాత స్త్రీలు ఈ ఒత్తిడి వల్ల బిడ్డ కి ఇబ్బంది ఏర్పడుతుందేమో అని కూడా ఆలోచిస్తారు. ఆలోచించవలసిన విషయాలలో ఇది కూడా చేరుతుంది. దురదృష్టవశాత్తు, నిపుణులు అంటున్నారు ఇటువంటి ఒత్తిడి బిడ్డకి మంచిది కాదని. తక్కువ బరువు, నెలలు నిండకుండానే పురుడు రావటం వంటివి ఒత్తిడికి సంబంధం ఉన్నవి. కొన్ని రకాల ఒత్తిడులు మనం నిర్మూలించలేనప్పటికీ ఒత్తిడి శాతం తగ్గించడానికి కొన్ని ప్రయత్నాలు చెయ్యవచ్చు. ఒత్తిడి స్థాయిలని తగ్గించేందుకు ఈ పది సూచనలను పాటించండి.

అయిదు నిముషాలు ప్రశాంతత పొందండి - ప్రతీది సరిగ్గా అమరేలా చేసుకోవడం వల్ల మీకు మీరే సమయం కేటాయించుకోలేనంత బిజీ గా మారతారు. కొత్త జీవితాన్ని ఆస్వాదించడం కోసం అలసట చెందుతారు. అందువల్ల కొంత సమయాన్ని తీసుకొని విశ్రాంతి పొందండి. హాయిగా స్నానం చేస్తే మీ శరీరం తో పాటు మీ మనస్సు ఉత్తేజపడుతుంది. మీకున్న బాధలు మరియు నొప్పులకు ఇది ఉపశమనం గా ఉపయోగపడుతుంది. మీ స్నానపు నీళ్ళలో కొన్ని సుగంధ తైలాలను అలాగే లావెండర్ వంటివి చేర్చడం వలన ప్రశాంతత పొందుతారు.

మస్సాజ్ చేసుకోండి - ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించే శక్తి మస్సాజ్ కి ఉంది. మస్సాజ్ తరువాత శరీరం మరియు మనస్సు తేలికపడుతుంది.

తేలికపాటి వ్యాయామాన్ని చెయ్యండి - తేలికపాటి వ్యాయామం చెయ్యడం ఎంతో మేలు. చిన్న నడక, ఈత లేదా యోగా క్లాస్ వంటివి మనల్ని తిరిగి ఉత్తేజితుల్ని చెయ్యడం లో ప్రజన పాత్ర పోషిస్తాయి. యోగా క్లాసులలో సాధన చేసే ప్రాణాయామ పద్దతుల వల్ల ఒత్తిడి నుండి కాపాడుకునే అవకాశం ఉంటుంది.

ఆక్యుపంక్చర్ - ఆక్యుపంక్చర్ అనే చికిత్స కి ఒత్తిడి ని తగ్గించే శక్తి ఉంది. విశ్రాంతి కలిగించే ఎండార్ఫిన్స్ ని విడుదల చేయడం ద్వారా శరీరానికి ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. తద్వారా, రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. ఆక్యుపంక్చరిస్ట్ ని కలవండి.

శ్వాస పీల్చండి - ఒత్తిడినుండి ఉపశమనం పొందడానికి కొందరు స్త్రీలు ధ్యానాన్ని ఎంచుకుంటారు. మనస్సుని నిర్మలంగా చేసుకుని, 15 నిమిషాల పాటు ధ్యానం చేస్తే శారీరక శ్రమ నుండి ఉపశమనం కలుగుతుంది.

మాట్లాడండి - మీ గర్భం గురించి ప్రకటించగానే, మీ గురించి తెలుసుకునేందుకు ఈ ప్రపంచం మొత్తం ఆసక్తి కనబరుస్తుంది. ఈ తొమ్మిది నెలల కాలం లో మీ కుటుంబం అలాగే స్నేహితులు మీ క్షేమ సమాచారం గురించి వినడానికి ఇష్టపడతారు. ఒత్తిడి కి గురి అవుతున్నట్టయితే వెంటనే మీకు దగ్గరివారితో మాటలు కలపండి. మీ దిగులుని పంచుకోండి. వారు ఇచ్చే ధైర్యంతో ఒత్తిడి నుండి కొంత మేరకు ఉపశమనం పొందుతారు.

పంచుకోవడం అంటే పట్టించుకోవటమే - మీరు చెయ్యవలసిన పనుల జాబితా అలా పెరుగుతూ పోతూ ఉంటే అవి ఎలా పూర్తి చెయ్యాలో అని ఒత్తిడి పెరగడం సహజం. అయితే, వాటి గురించి బాధ పడకుండా వాటిని మీ శ్రేయాభిలాషులకి అలాగే మీ స్నేహితులకి కొంత పంచడం వలన మీరు సంతోషంగా ఉంటారు.

కునుకు తియ్యండి - ఈ సమయం లో తగినంత నిద్ర అవసరం. మీకు నిద్ర కి కేటాయించడానికి తగినంత సమయం లేకపోయినా పుట్టబోయే బిడ్డని దృష్టిలో పెట్టుకుని తగినంత విశ్రాంతి తీసుకునే ఏర్పాటు చేసుకోండి. ఉదయం పూట అప్పుడప్పుడు కునుకు తియ్యడం తప్పు కాదు.

వద్దని చెప్పడానికి ఆలోచించకండి - మీ మెటర్నిటీ లీవ్ సమయం దగ్గర పడుతోంది, ఈ లోపు మీ బాస్ ఒక 40 పేజీల రిపోర్ట్ తయారు చెయ్యమని చెప్పాడనుకోండి అలాంటప్పుడు మీరు "నో" చెప్పడానికి ఆలోచించవద్దు. మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తిస్తే అంతా మంచే జరుగుతుంది.

ఎంతో దూరం లేదు - మీరు మీ బిడ్డని మొదటి సారి చూడబోయే సమయం దగ్గర పడుతోంది. మీరు గర్భవతిగా ఉన్న సమయం లో పడిన దిగులు మీకు అస్సలు గుర్తుండదు. మీ మనస్సును ఆహ్లాదంగా ఉంచుకోండి. మీ బిడ్డని తనివి తీరా చూసుకోవడానికి సిద్దం కండి. ఒకవేళ భరించలేని ఒత్తిడితో బాధ పడుతూ ఉంటే, అధిక బరువు, నిద్ర లేమి వంటివి కూడా సమస్యలు అయితే వెంటనే వైద్యున్ని సంప్రదించండి.



Click it and Unblock the Notifications
