Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
త్వరగా గర్భం దాల్చటానికి సంతానోత్పత్తి వంటకాలు
గర్భవతి పొందడం అనేది ప్రతి ఒక్కరికీ సులభంగా సంభవించదు. మీకు ప్రధాన ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ గర్భం కొరకు ప్రయత్నిస్తున్నప్పుడు ఒక మంచి వార్త వినటానికి ఒక సంవత్సరం పట్టవచ్చు. మీకు త్వరగా గర్భం రావటం కొరకు కొన్ని సంతానోత్పత్తి వంటకాల అవసరం ఉన్నది. పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ సంతానోత్పత్తి ఆహారాలు గర్భధారణ అవకాశాలను పెంచడానికి ఉత్తమ సహజ మార్గంగా ఉన్నది.
సంతానోత్పత్తి వంటకాల్లో పోషకాలు సమృద్ధిగా ఉన్న పదార్దములను వినియోగిస్తారు. వారు కూడా గర్భం ప్రయత్నిస్తున్న ఉంటే అనుసరించడానికి సరైన వంట పద్ధతిని తెలియజేయండి. గర్భం కొరకు ఈ సంతానోత్పత్తి వంటకాల ప్రయోగాలు సరదాగా మరియు ఖచ్చితంగా గర్భవతి పొందే అవకాశాలకు సహాయం చేస్తుంది.
వివిధ సంతానోత్పత్తి ఆహారాల వంటలలో సముద్రపు ఆహారం, కాలే,బాదం,పుట్టగొడుగులు మొదలైన వాటిని ఉపయోగిస్తారు. ఈ సంతానోత్పత్తి ఆహారాలలో విటమిన్ D,E,A వంటి మొదలైన ముఖ్యమైన పోషక సమూహాలు ఉంటాయి. అంతేకాక మహిళల సంతానోత్పత్తి పెంచడానికి సహాయపడే ఆరోగ్యకరమైన ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. ప్రదానంగా గుడ్లు మరియు పుట్టగొడుగులలో ఉండే జింక్ వీర్యకణాల సంఖ్య పెంచడానికి సహాయపడుతుంది.
ఇక్కడ Boldsky ద్వారా త్వరగా గర్భం దాల్చటానికి ఉత్తమ సంతానోత్పత్తి వంటకాలు కొన్నింటిని చూద్దాము.

పుట్టగొడుగు హెర్బ్ ఆమ్లెట్
ఈ డిష్ పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ గొప్ప సంతానోత్పత్తి వంటకంగా ఉంది. గుడ్లు మరియు పుట్టగొడుగులలో ఉండే విటమిన్ D మరియు జింక్ పురుషుడు జననేంద్రియ వ్యవస్థలో వీర్యకణాల సంఖ్య పెరుగుదలకు సహాయపడతాయి. ఆమ్లెట్ పైన అలంకరించడానికి పార్స్లీ మరియు వాము పువ్వు వంటి మూలికలను జోడించండి.

బాదం గోధుమ పాన్ కేక్
బాదంలో సంతానోత్పత్తి కోసం అవసరమైన విటమిన్ E ఉంటుంది. గోధుమ పిండికి తురిమిన బాదం మరియు కొంచెం చక్కర వేసి కలపాలి. ఫలితంగా పాన్ కేక్ లు గర్భం ప్రయత్నిస్తున్న జంటలకు ఒక గొప్ప అల్పాహారంగా ఉంటుంది.

దానిమ్మ స్మూతీ
దానిమ్మ పురుషుల సంతానోత్పత్తి కొరకు ఉత్తమ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉన్నది. మీరు స్వయంగా ఆరోగ్యకరమైన స్మూతీ చేయడానికి తక్కువ కొవ్వు పాలు మరియు దానిమ్మపండ్లను ఉపయోగించండి.

కాల్చిన సాల్మన్ ఫిల్లెట్
సాల్మన్ సంతానోత్పత్తికి టాప్ సూపర్ ఫుడ్ గా ఉంది. తాజా సాల్మొన్ లో తురిమిన అల్లం, వెనిగర్ మరియు మిరియాలు కలిపి 20 నిమిషాలు తప్పనిసరిగా నానబెట్టాలి. ఆ తర్వాత ఒవెన్ లో గ్రిల్ లో పెట్టి 80 శాతం పవర్ వద్ద 15 నిమిషాలు ఉంచాలి. కాల్చిన సాల్మన్ ఫిల్లెట్ గర్భం కొరకు ఆదర్శవంతమైన సంతానోత్పత్తి వంటకం అని చెప్పవచ్చు.

కాలే సీజర్ సలాడ్
కాలే గర్భం పొందడానికి సహాయం చేస్తుంది. దీనిలో కొవ్వులో కరిగే విటమిన్ K ఉంటుంది. ఒక రుచికరమైన సీజర్ సలాడ్ సిద్ధం చేయడానికి పచ్చి కాలే,సిట్రస్ పండ్లు (పైనాపిల్ తప్పించి )మరియు బాగా చిలికిన తక్కువ కొవ్వు పెరుగు ఉపయోగించండి.

చీజ్ తో నిండిన ఓపెన్ శాండ్విచ్
చీజ్ మహిళలు సంతానోత్పత్తి కొరకు అవసరమవుతుంది. ఇది అధిక మోతాదులో కాల్షియంను కలిగి ఉంది. శాండ్విచ్ తయారు చేయటానికి టమోటాలు,ఉల్లిపాయలు,క్యారట్లు ఉపయోగించండి. అప్పుడు ఒవెన్ లో గ్రిల్ లో పెట్టి 60 శాతం పవర్ 2 నిమిషాలు ఉంచాలి.

కాల్చిన వెల్లుల్లి ఆయిస్టర్లు
ఆయిస్టర్లలో జింక్ ఉండుట వలన పురుషులకు ఆదర్శవంతమైన సంతానోత్పత్తి ఆహారంగా ఉన్నది. ఆయిస్టర్లకు ఆలివ్ నూనె మరియు ముక్కలు చేసిన వెల్లుల్లి ని కలిపి కొంత సేపు అలా ఉంచాలి. ఇంకా ఈ వంటకంలో కొంత చిల్లీ పెప్పర్ ను జోడించవచ్చు. ఒవెన్ లో గ్రిల్ లో పెట్టి 80 శాతం పవర్ 10 నిమిషాలు ఉంచాలి.

.గ్రీన్ హెర్బ్ జ్యూస్
మీరు గర్భం దాల్చాటానికి ప్రయత్నిస్తూ ఉంటే కెఫిన్ కి బదులుగా ఒక సాయంత్రం బచ్చలికూర,పార్స్లీ మరియు దోసకాయతో తయారు చేసిన ఒక ఆరోగ్యకరమైన రసాన్ని సేవించాలి.

ఆకుకూరలతో చికెన్ సలాడ్
ఉడికించిన చికెన్ ప్రోటీన్లు మరియు చాలా తక్కువ కొవ్వు కలిగి ఉంటుంది. కాలే,బచ్చలికూర మరియు పాలకూర వంటి ఆకుకూరలను జోడించండి. మహిళలకు అవసరమైన విటమిన్ K మరియు ఇనుము ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మీరు కొంత అదనంగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల కొరకు రుచికలిగిన ఆలివ్ నూనెను సలాడ్ లో కలపవచ్చు.

లెమన్ రొయ్యల ఇగురు
రొయ్యలు తాజా సీ మినరల్స్ కలిగి ఉంటాయి. అంతేకాక దీనిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల మరియు జింక్ సమృద్ధిగా ఉంటాయి. రొయ్యలను నిమ్మరసం,వెల్లుల్లి మరియు రోజ్మేరీ నూనెతో కలిపి కొంతసేపు అలా ఉంచాలి. తర్వాత రొయ్యలను తక్కువ మంటలో 4-5 నిమిషాలు ఉంచాలి. ఈ సంతానోత్పత్తి వంటకం గర్భం దాల్చాటానికి మరియు కామోద్దీపన కొరకు కూడా అని చెప్పవచ్చు.



Click it and Unblock the Notifications
