Latest Updates
-
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే! -
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి -
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా..
అబార్షన్ జరగడానికి కారణాలు..తీసుకోవల్సిన జాగ్రత్తలు..
సాధారణంగా పండంటి బిడ్డ పుట్టాలన్నది గర్భం ధరించిన ప్రతి మహిళ కల కంటుంది. కానీ అది ఒక్కోసారి కల్ల అవుతుంది. గర్భస్రావం రూపంలో కల నెరవేరకపోవడం దురదృష్టం. చాలా సందర్భాల్లో నెలతప్పిన పది రోజులకే... అది గర్భం అని తెలిసేలోపే రుతుస్రావంలో రక్తస్రావం ఎక్కువగా జరగడం ద్వారా (బ్లీడింగ్ రూపంలో) గర్భస్రావం అయిపోతుంటుంది. ఇలాంటి అవాంఛిత పరిస్థికి కారణాలు, తీసుకోవాల్సిన చికిత్సలు, గర్భస్రావం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
సాధారణంగా నెలతప్పిన తర్వాత తొమ్మిది నెలలు నిండాక ప్రసం జరగాలి. ఏ కారణం చేతైనా ఏడో నెల కంటే ముందుగానే గర్భం నుంచి పిండం బయటపడితే గర్భస్రావం (అబార్షన్) అంటారు. ఇలాంటి సందర్భాల్లో శిశువు సాధారణంగా మృతిచెంది బయటపడటమో లేదా బయటపడి మృతిచెందడమో జరుగుతుంటుంది. (ఒకవేళ ఏడో నెలలో పిండం బయటపడ్డా శిశువు బతికే ఉంటే దాన్ని గర్భస్రావంగా పేర్కొనరు. అప్పుడు దాన్ని ప్రీ-మెచ్యూర్ డెలివరీ అంటారు).
కారణాలు: గర్భస్రావం కావడానికి అనేక కారణాలుంటాయి. అవేంటో ఒక సారి చూద్దాం...
1. జన్యుపరమైన లోపాలు: చాలా సందర్భాల్లో జన్యుపరమైన కారణాలే గర్భస్రావానికి దోహదపడతాయి. పిండం సరిగా ఏర్పడకపోవడం, ఒకవేళ ఏర్పడినా అది సరిగా ఎదగలేక చనిపోవడం సాధారణం. అండం లేదా వీర్యకణం లేదా పిండంలోని జన్యువు (క్రోమోజోము)ల్లో లోపాల కారణంగా ఇలా జరుగుతుంది. ఇది తొలిచూలు గర్భంలోనే కావచ్చు లేదా వరసగా ఇలాగే జరుగుతుండవచ్చు. తల్లి వయసు 35 ఏళ్లు దాటేకొద్దీ జన్యుపరమైన కారణాల వల్ల అబార్షన్లు ఎక్కువవుతాయి. సరిగా ఎదగలేని, లోపాలు ఉన్న పిండాన్ని ప్రకృతి సహజంగానే మొదట్లోనే బయటకు నెట్టేస్తుంది. తత్ఫలితంగా గర్భస్రావం జరుగుతుంది. జన్యుపరమైన కారణాల వల్ల అయ్యే గర్భస్రావాలకు ఏ చికిత్సా పనిచేయదు.

2. తల్లికి ఉండే వ్యాధులు: కాబోయే తల్లికి అదుపులో లేని మధుమేహవ్యాధి, మూత్రపిండాల వ్యాధి, రక్తహీనత వంటివి కూడా అబార్షన్ కు దారితీస్తాయి.
3. హార్మోన్ల సమస్య: ముఖ్యంగా హార్మోనుల అసమతుల్యత. అదుపులో లేని థైరాయిడ్ సమస్య, ప్రొజెస్టెరాన్ హార్మోన్ లోపం, పాలీసిస్టిక్ అండాశయాల వల్ల, హార్మోన్ సమస్యలతో అబార్షన్ అయ్యే అవకాశం ఉంది.
4. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు: హెర్పిస్, రుబెల్లా, వైరస్, టాక్సోప్లాస్మా, సిఫిలిస్ వంటి ఇన్ఫెక్షన్లతో తీవ్రమైన జ్వరం తీవ్రమైన మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ పోషకాహార లోపాలు కొన్నిరకాల మందుల వాడకం వల్ల కూడా గర్భస్రావాలు జరుగుతాయి.
5. గర్భాశయంలో లోపాలు: తరచుగా కనపడే లోపం గర్భాశయ కంఠం (సర్విక్స్) వదులుగా అవ్వడం లేదా సర్విక్స్ పొడవు తక్కువగా ఉండటం. దీనివల్ల పెరిగే శిశువు తాలూకు బరువును మోయలేక, 4-7 నెలల మధ్య సర్విక్స్ తెరచుకుని పెద్దగా నొప్పి లేకుండానే శిశువు బయటకు జారిపోతుంది.
6. కొంతమందిలో పుట్టుకతోనే గర్భాశయంలో లోపాలు అంటే గర్భాశయం మధ్యలో చీలడం లేదా ఆకృతిలో తేడాల వల్ల గర్భాశయం లోపలి పొరల్లో కణుతులు (ఫైబ్రాయిడ్స్, పాలిప్స్) గర్భధారణ తర్వాత కవలలు ఏర్పడటం వల్ల (కొంతమందిలో మాత్రమే) గర్భధారణ తర్వాత తల్లి శరీరం శిశువును తిరస్కరించకుండా ఉంటేనే అది గర్భాశయంలో పెరుగుతుంది. దాంతో గర్భస్రావం అవుతుంది.
చికిత్స: కారణాలను బట్టి చికిత్సను నిర్ణయించాల్సి ఉంటుంది జన్యుపరమైన కారణాలతో అయ్యే అబార్షన్లకు ఎలాంటి చికిత్స చేసినా ఫలితం ఉండదు పౌష్టికాహారం, ఫోలిక్ యాసిడ్ వాడటం హార్మోన్ల అస మతౌల్యత ఉంటే... వైద్యుల సలహా మేరకు ట్రీట్మెంట్ తీసుకోవాలి. థైరాయిడ్ సమస్య ఉంటే దాన్ని నియంత్రణలో ఉంచుకోడానికి అవసరమైన మందులు తప్పనిసరిగా వాడాలి.
మాతృత్వం అనే వరానికి అడ్డుపడే అబార్షన్లను నిలువరించడానికి, నివారించడానికి... డాక్టర్ సూచనలు, సలహాలు పాటించడం, వారు రాసిన మందులను క్రమం తప్పకుండా వాడటం, వారు చెప్పిన జాగ్రత్తలను అనుసరిస్తూ ఉండటం ముఖ్యమని గుర్తుంచుకోవాలి.
సూచనలు:
1. గర్భవతిని మానసికంగా ప్రశాంతంగా ఉంచడం.
2. గర్భధారణ తర్వాత మొదటి మూడునెలలూ దాంపత్య జీవితానికి దూరంగా ఉండటం వీలైనంతవరకు దూరపు ప్రయాణాలు చేయకపోవడం.
3. అబార్షన్ అయిన కారణాన్ని బట్టి విశ్రాంతి తీసుకోవడం.
4. వీలైనంతవరకు బరువైన పనులు చేయకపోవడం
5. కారణం తెలియకుండా అబార్షన్లు అవుతుంటే అలాంటి మహిళలకు అన్నిసార్లూ అబార్షన్లు అవ్వదంటూ భరోసా ఇచ్చి, వారికి ధైర్యం చెప్పడం... వంటి సూచనలు పాటించాలి.



Click it and Unblock the Notifications