Latest Updates
-
ఇన్‌స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.!
గర్భధారణ సమయంలో తిమ్మిరులను నివారించడం ఎలా..?
గర్భధారణ, ఒక స్త్రీ జీవితంలో అపరిమిత ఆనందాన్ని ఇచ్చే దశ మరియు తరువాతి 9 నెలల్లో ఒక కొత్త జీవితానికి జన్మని ఇవ్వటం ఆనందాన్ని ఇస్తుంది.
ముఖ్యంగా, ఇది మీ మొదటి గర్భధారణ అయితే మీరు తెలుసుకోవలసిన మరియు నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ సమయంలో మీ శరీరంలో చాలా మార్పులు వొస్తాయి. ఈ మార్పులతోపాటు, మీరు, మీ శరీరం చూపించే కొన్ని సూచనలు మరియు లక్షణాలను గమనించవొచ్చు.
ఇందులో కొన్ని 9 నెలలపాటు ఉండవొచ్చు లేదా ఒక వారం, నెల లేదా ఒక త్రైమాసికం ఉండవొచ్చు. ఒకవేళ, మీరు శిశువుకు హానికరమైన మందులు ఏమి వాడకుండా ఈ లక్షణాలను భరించగలిగే స్థాయికి తీసురావాలని భావించవొచ్చు. గర్భవతిగా ఉండే సాధారణమైన లక్షణాలలో ఒకటైన కడుపులో సన్నని నొప్పులు మరియు పొత్తికడుపు ప్రాంతంలో అలాగే కాళ్లలో కూడా. ఇవి అంత నొప్పిని కలిగించకపోయిన, చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
వీటిని కొన్ని మార్గాల ద్వారా అధిగమించవొచ్చు లేదా కొంత సమయం వరకైనా కాపాడుకోవొచ్చు.

వేడినీటి స్నానం చేయండి : మీరు గర్భం ధరించినప్పుడు వొచ్చే నొప్పులనుండి తక్షణ ఉపశమనాన్ని పొందే చికిత్సల్లో 'వేడినీటి స్నానం' అనేది ఉత్తమ చికిత్స. మీరు ఈ చికిత్స ద్వారా చాలా లాభదాయకమైన ఫలితాలని సులభంగా పొందగలుగుతారు మరియు నొప్పినుండి మరియు అసౌకర్యంనుండి ఉపశమనం పొందుతారు. ఈ చికిత్స వలన గట్టిగా అయిన కండరాలు మరియు గర్భాశయం యొక్క లిగ్మెంట్స్ వొదులుగా అయి సున్నితమైన కదలికలకు సహాయకారిగా పని చేస్తుంది; దీనివలన ఈ నొప్పులనుండి ఉపశమనం లభిస్తుంది.
ఏదేమైనా, ఒక గర్భవతి మహిళ కోసం, నీరు గోరు వెచ్చగా ఉండాలి. గర్భవతులు స్నానానికి ఎక్కువ సమయం తీసుకోకూడదు మరియు స్నానం 10-15 నిముషాలలో ముగించాలి. ఇది గర్భవతి మీద ఏ హాని, దుష్ప్రభావాలు లేకుండా ఉండేందుకు చాలా సురక్షితమైన మార్గం.

హీటింగ్ ప్యాడ్స్/హాట్ బ్యాగ్స్: హీటింగ్ ప్యాడ్స్ మరియు హాట్ బ్యాగ్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిని నొప్పి ఉన్న ప్రాంతంలో ఉంచి, కొంత సమయం వరకు సంపీడనం చేయటం వలన ఉపశమనం లభిస్తుంది. మీ దగ్గర హీటింగ్ ప్యాడ్ అందుబాటులో లేకపోతే ఒక శుభ్రమైన టవల్ ను తీసుకుని, వేడినీటిలో ముంచి, నీటిని పిండి, అప్పుడు నొప్పి ఉన్న ప్రాంతంలో ఆ టవల్ ను ఉంచండి.
ఈ తక్షణ చికిత్స తాత్కాలికంగా మాత్రమే పని చేస్తుంది. నీరు ఎక్కువ వేడిగా లేకుండా చూసుకోండి. ఈ నొప్పులు భరించలేనంతగా ఉంటే, ఏ సమయంలోనైన ఈ రకమైన చికిత్సను చేయవొచ్చు. ఇది ముఖ్యంగా దిగువ వెనుకభాగం వంటి ప్రాంతాల కొరకు సిఫార్సు చేయబడింది.

విశ్రాంతి/సేద తీరండి : మీరు ఒత్తిడికి గురి అయ్యే పరిస్థితులనుండి దూరంగా ఉండండి. శరీరంలో క్రామ్ప్స్ రావటానికి మీ మానసిక ఒత్తిడి ఒక ముఖ్యమైన కారణం. మీరు చేసే పనులు మీ మెదడుపై ఒత్తిడి పడకుండా చూసుకోండి, సంగీతం వినండి. మీరు పని ఒత్తిడులకు దూరంగా ఉండండి.

నిద్ర: ఈ సమయంలో విశ్రాంతి మరియు నిద్ర రెండూ ముఖ్యమైనవే. నిద్రలేమి కూడా సమస్యలకు దారితీస్తుంది, కావున కాబోయే తల్లులకు కనీసం 8-10 గంటల నిద్ర అవసరం.

భోజన మార్పు: పొటాషియం మరియు కాల్షియం రెండు ఖనిజాలు ఈ క్రామ్ప్స్ నయం చేయటానికి కావలసిన ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. మీరు తీసుకునే ఆహారంలో ఈ ఖనిజాలు ఉండేట్లుగా చూసుకోండి. అరటి పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. చేప, సాల్మన్ చేప మరియు ఆకు కూరలు, బాదం, పాల ఉత్పత్తులు మరియు సార్డిన్లు.వంటి వాటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.

విటమిన్ 'సి' సమృద్ధిగా సిట్రస్ పండ్లు, ఆకు కూరలు, టమోటాలు, బంగాళదుంపలు మరియు అనేక ఇతర ఉత్పత్తులలో ఉన్నది. ఏదైనా ప్రాసెస్ చేయబడిన లేదా జంక్ ఆహారాన్ని, అలాగే కార్బోనేటేడ్ పానీయాలను నివారించండి; ఇవి ప్రతికూల పద్ధతిలో క్రామ్ప్స్ ను ప్రభావితం చేయవొచ్చు మరియు మరింత పరిస్థితి క్లిష్టంగా తయారవవొచ్చు.

మసాజ్ యొక్క ప్రయోజనం: ఒక మంచి మసాజ్, నిపుణుల చేత చేయించుకున్నందు వలన కండరాలు మరియు గర్భాశయ లిగమెంట్స్ సడలించబడతాయి, అలానే క్రామ్ప్స్ తో బాధపడుతున్న మీ కాళ్ళ పిక్కలు మరియు కాళ్లు కుడా. ఇలా రోజులో ఒకసారి చేయించుకుంటే నొప్పి మరియు అసౌకర్యం నుండి తక్షణ ఉపశమనం దొరుకుతుంది. మంచి అరోమా ఆయిల్ ను వాడితే, అది అరోమాతెరపిలాగా పని చేస్తుంది మరియు మీ మెదడు కూడా సేద తీరుతుంది. రెండు రకాలుగా లాభం చేకూరుతుంది. మసాజ్ పాదాలకు కూడా చేయించుకోవటం మరిచిపోవొద్దు.



Click it and Unblock the Notifications
