Latest Updates
-
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
గర్భధారణ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత చిట్కాలు
గర్భధారణ సమయంలో, ప్రతి క్షణం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వ్యక్తిగత పరిశుభ్రత కలిగి ఉండాలి. లేదంటా చాలా చిన్న తప్పులే ప్రమాధకరమైన ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. కాబట్టి గర్భాధారణ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యంగా భావించాలి.
సాధారణంగా గర్భణీస్త్రీలు అనేక ఇన్ఫెక్షన్లకు గురి అవుతుంటారు, వాటిలో ఉదాహరణకు: యూరినరీ ఇన్ఫెక్షన్, స్టొమక్ ఇన్ఫెక్షన్, స్కిన్ ఇన్ఫెక్షన్ ..ఇలాంటివి మరికొన్ని . అందువల్లే గర్భిణీ స్త్రీలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలు వ్యక్తిగత శుభ్రత కోసం పాటించవల్సిన కొన్నిచిట్కాలు ఉన్నాయి. వాటిని పరిశీలించి గర్భాధారణ సమయంలో మంచి ఆరోగ్యాన్ని పొందండి...

1. దుస్తులు: ప్రతి రోజూ ఉతికిన బట్టలను ధరించడం సాధారణ వ్యక్తుల కంటే గర్భిణీ స్త్రీలకు చాలా ముఖ్యం. ముఖ్యంగా గర్భణీ స్త్రీలకు కాటన్ దుస్తులు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. గర్భం ధరించిన మూడవ నెలలో గర్భిణీ స్త్రీలలో శారీరకంగా అనేక మార్పులు చోటు చేసుకుంటా..ముఖ్యంగా మూడవ నెలలో శరీరం నుండి కొన్ని శ్రావాలు వెలువడుతాయి. ఉదా: క్షీరం, వైజినల్ డిశ్చార్జ్ వంటివి. ఈ శ్రావాలను కాటన్ వస్త్రాలు సులభంగా పీల్చుకొని త్వరగా తడిఆరిపోయేలా చేస్తాయి కాబట్టి గర్భిణీ స్త్రీ కాటన్ దుస్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అంతే కాదు ఇవి సౌకర్యవంతంగా ఉంచడంతో పాటు ఎటువంటి స్కిన్ ఇరిటేషన్స్ మరియు ఇన్ఫెక్షన్స్ కలగకుండా రక్షణ కల్పించబడుతాయి.
2. చేతులను శుభ్రపరుచుకోవాలి: ప్రతి భోజనానికి లేదా వేరే ఏ ఇతర పదార్థాలు తినాలన్నా ముందుగా సానిటైజర్(హ్యాండ్ వాష్ లిక్విడ్) తో చేతులను శుభ్రం చేసుకోవాలి. దానివల్ల గర్భిణీ స్త్రీలకు ఎటువంటి స్టొమక్ ఇన్ఫెక్షన్ కు గురికాకుండా రక్షించబడుతారు. అలాగే గర్బిణీ స్త్రీలు తీసుకొనే కూరగాయలు, పండ్లు కూడా తాజాగా ఉన్నవి, శుభ్రంగా కడిగి, తుడిచి తర్వాత తినాల్సి ఉంటుంది. మీరు ఉపయోగించే వస్తువులు కూడా చాలా శుభ్రంగా ఉంచాలి. మరియు ప్రతి ఆహారం మీద పూతలు తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
3. దంత సంరక్షణ: గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలు దంతాల కొరకు స్పెషల్ కేర్ తీసుకోవాలి. గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలో ఈస్ట్రోజన్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల అనేక దంత సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు ప్రతి రోజూ రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి. వ్యక్తిగతంగా దంత పరిశుభ్రతను పాటించాలి.
4. జననేంద్రియాల పరిశుభ్రత: గర్భిణీ స్త్రీలు జననేంద్రియాల ఇన్ఫెక్షన్ నిరోధించడానికి, మీరు జననేంద్రియాల ప్రాంతంను శుభ్రంగా మరియు హెయిర్ ఫ్రీగా జాగ్రత్త తీసుకోవాలి. పిహె లెవల్స్ ను నిర్వాహణకు, జెనిటిల్ వాష్ కు ప్రాధాన్యతనించి వాటిని మాత్రమే ఎంపిక చేసుకోవాలి . ప్రతి రోజూ స్నానం చేయడానికి ముందు వాష్ టబ్ మరియు బకెట్స్ ప్రతి రోజూ శుభ్రం చేసుకోవడం వల్ల వైజినల్ ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవచ్చు.
5. లోదుస్తులు కాటన్ దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి: గర్భాధారణ సమయంలో కాటన్ లోదుస్తులను ధరించి వ్యక్తిగత పరిశుభ్రతను నిర్వహించాలి. ఇవి సౌకర్యవంతంగా మరియు లైట్ ఫ్యాబ్రిక్ కలిగి తర్వగా తడిని పీల్చుకొనే విధంగా ఉంటాయి.
6. బ్రెస్ట్ కేర్: గర్భాధారణ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడానికి ఇది చాలా ముఖ్యమైన చిట్కా. స్తనాలను శుభ్రంగా ఉంచుకోవడం. చనుమొనల చుట్టూ దురద లేదా చికాకు నిరోధించడానికి శుభ్రంగా ఉంచుకోవాలి. గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగి స్తనాలను క్లీన్ గా ఉంచుకోవాలి.



Click it and Unblock the Notifications
