Latest Updates
-
ఉగాది స్పెషల్..ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ క్రంచీ బేబీ కార్న్ 65..వాహ్ అనిపించే బెస్ట్ స్టార్టర్! -
గుంటూరు కారం పొడి, చిట్టి ఇడ్లీ..ఇలా చేస్తే ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే! -
నో గ్యాస్, నో స్టవ్.. నిమిషాల్లో తయారయ్యే కమ్మని పల్లెటూరి రోటి పెరుగు పచ్చడి..ప్లేట్ అన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
రోజూ తినే పప్పు బోర్ కొట్టిందా? అయితే ఈ ధాబా స్టైల్ దాల్ తడ్కా ట్రై చేయండి..గిన్నెలు గిన్నెలు లేపేస్తారు! -
తెలుగువారి తొలి పండుగ: ఉగాది 2026 తేదీ, పేరు, ఆచారాలు, సంప్రదాయాలు -
కేవలం 10 నిమిషాల్లో దూదిలాంటి టమాటో సెట్ దోశ.. పప్పు నానబెట్టే పనే లేదు..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్! -
భాగస్వామి సంతృప్తిలో అట్టడుగు స్థానంలో భారత్..మూసిన తలుపుల వెనుక అసలు కథ! -
ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు.. ఇలా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తాయి..నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతూ అమృతమే! -
పండిన అరటిపండ్లతో సింపుల్ అండ్ సూపర్ స్వీట్..హెల్తీ బనానా బర్ఫీ ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి రుచిగా, ఒంటికి చల్లగా..అన్నం, ఇడ్లీ, దోశ దేనిలోకైనా అదిరిపోయే కీర దోసకాయ పచ్చడి..ఎలా చేసుకోవాలంటే..
ప్రెగ్నెన్సీ గురించి విలువైన మరియు ఉపయోగకరమైన సమాచారం...!
ఒక స్త్రీ లోపల పెరుగుతున్న శిశువుతో ఉండడం, ప్రసవించడం అనేవి గర్భధారణ స్థితులు. ఇది శిశువు పెరుగుదలకు పట్టే తొమ్మిది నెలల సమయం.
తల్లి గర్భం దాల్చిన మొదటి మూడు మాసాలలో ప్రత్యెక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గర్భవతి అయిన స్త్రీ మొదటి మూడు నెలలలో ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలని సూచన. గర్భవతి అయిన స్త్రీకి అత్యంత క్లిష్టమైన మాసాలలో శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి.
గర్భధారణ గురించి ఉపయోగపడే సమాచారం:

ఆహార అలవాట్లు : ఒక తల్లి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అభివృద్ది చేసుకోవడ౦ చాలా ముఖ్యం. ఆమె సరైన పోషకాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఆమె తీసుకుంటున్న ఆహరం చివరగా శిశువుకు అందుతుంది.

వ్యాయామం : ఆలోచించే తల్లి రోజువారీ వ్యాయామాన్ని ముందుగా ప్రారంభించాలి. వ్యాయామం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మొదటగా, గర్భందాల్చిన మొదటి మూడునెలలలో గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, రోజువారీ వ్యాయామం వల్ల దీనిని తగ్గించుకునే అవకాసం ఉంది. రెండవది, ఒక స్త్రీ గర్భధారణ సమయంలో చాలా బరువు పెరుగుతుంది. ఆలోచించే తల్లి ప్రతిరోజూ వ్యాయామం చేసి బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

పొగత్రాగరాదు లేదా ఆల్కహాల్ సేవించరాదు : గర్భవతి అయిన స్త్రీ పొగత్రాగడం లేదా ఆల్కహాల్ వినియోగాన్ని మానుకోవాలి. ఇవి రెండూ శిశువుకి చాలా ప్రమాదకరమైనవి. తల్లి నుండి ఆల్కహాల్ బిడ్డకు చేరుతుంది. దానివల్ల శిశువు దెబ్బతింటుంది. ఆల్కహాల్ శిశువులో పుట్టుక లోపాలను కలగచేయవచ్చు. ఒక తల్లి ఆమె ఏమి తీసుకుంటుంది, దానివల్ల బిడ్డకు ఎటువంటి ప్రభావం కలుగుతుంది అనేది బాగా తెలుసుకోవాలి.

తల్లిపాత్ర గురించి ఇతరులతో మాట్లాడాలి : మీతోటి స్నేహితులలో గాని, చుట్టాల్లో గానీ తల్లితండ్రులు ఉంటే, తల్లిపాత్ర గురించి వారిని అడిగి తెలుసుకోండి. వారి అనుభవాలను అడిగి, జ్ఞానాన్ని పెంచుకోండి. అప్పటికే తల్లితండ్రులైన వారితో మీరు ఒకసారి మాట్లాడడం ఉత్తమ౦గా భావించి, ఎక్కువ విషయాలను తెలుసుకోండి. మీకు ఎప్పుడూ తెలియని విషయాలు మీకు తెలుస్తాయి.

మందులు వాడకండి : మీరు వికారం, వాంతులు, అలసట మొదలైనవి ఉంటే మందులు తీసుకోకండి. గర్భధారణ సమయంలో సాధ్యమైన౦త వరకు సహజమైన వనరులతో వాటిని నివారించండి.

ఎక్కువ నీరు త్రాగండి : ఎంత అవకాశం ఉంటే అన్ని నీరు త్రాగాలని గుర్తుంచుకోండి. ప్రతిరోజూ కనీసం ఆరు నుండి ఎనిమిది గ్లాసుల నీరు తీసుకోవాలి. తగినంత నీరు తీసుకోవడం చాలా ముఖ్యం.

స్విమ్మింగ్ కి వెళ్ళండి : గర్భధారణ ఆలస్యంగా వచ్చినపుడు స్విమ్మింగ్ మంచిది. ఆలస్యంగా గర్భం దాల్చినపుడు చాలా నొప్పులు, బాధలు ఉంటాయి. అటువంటి సమయంలో స్విమ్మింగ్ మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది, కొంచెం ఉపశమనంగా ఉంటుంది. మీకు తక్కువబరువు ఉన్న అనుభూతి కలుగుతుంది.

ఘాటైన, వేపుడు ఆహారపదార్ధాలను మానుకోండి : మీకు గర్భధారణ సమయంలో గుండెల్లో మంట లేదా ఇటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే, మీరు మొదటగా వేపుడు, ఘాటైన పదార్ధాలను తినడం తప్పక మానేయాలి.

ఎత్తైన దిండుపై నిద్రించండి : గర్భవతి అయిన స్త్రీ కొంచెం ఎత్తైన దిండుపై నిద్రించాలి. ఒక తల్లి గర్భిణీ స్త్రీకోసం ప్రత్యేకమైన పరుపుని అందుబాటులో ఉంచితే మంచిదే, కానీ వాటిని కొనడానికి ఇష్టపడకపోతే ఆమె కొంచెం ఎత్తైన దిండ్లను వాడాలి. ఇవి ఆమెకు చాలా సౌకర్యాన్ని కలిగిస్తాయి.

ఫోటోలు తీయడం : ఫోటోలలో మన జ్ఞాపకాల సరైన రూపాలను దాచుకోవచ్చు. గర్భధారణ సమయంలో మీరు వీలైనన్ని ఫోటోలను తీయించుకోండి. తరువాత, మీరు సేకరించిన ఫొటోలతో ఒక చిత్తుపుస్తకం లేదా దృశ్య రూపకల్పనను చేయండి. ఒక వ్యక్తి దాచుకోగలిగిన ఫోటోలు జ్ఞాపకాలకు సరైన రూపాలు. అందుకని మీరు మీ గర్భధారణ సమయంలో ఫోటోలు తీసుకోవడం మరువకండి ఇవి మీ జీవితంలో చాలా ప్రత్యేకమైన, ప్రధానమైన అంశాలు.

మంచి పుస్తకాలు చదవండి : గర్భవతి అయిన స్త్రీ మంచివి, సానుకూలమైన పుస్తకాలూ చదవాలి. మీరు ఎక్కువ పుస్తకాలు చదివితే, గర్భధారణ సమయంలో విచారకరమైన, ఒత్తిడికి గురిచేసే పుస్తకాలూ చదవకండి. పిల్లల పుట్టుక, పిల్లల పుస్తకాలు చదవండి: గర్భధారణకు సంబంధించిన వివిధ పుస్తకాలను చదవండి. దీనివల్ల మీకు జ్ఞానం పెంపొంది, తెలియని విషయాలను తెలుసుకోవచ్చు.
మీ తల్లితండ్రులతో మాట్లాడండి

మీరు మీ అనుభవాలను మీ తల్లితండ్రులతో పంచుకోండి: దీనివల్ల మీరు ఎప్పటికీ తెలియని, తెలుసుకోలేని విషయాలు తెలుసుకుంటారు. వారు మీ గురించి వారి గురించి అనేక విషయాలు చెప్తారు. మీరు పిల్లలుగా ఉన్నపుడు ఎలా ఉన్నారో చెప్తారు. మీకు పిల్లలు పుట్టిన తరువాత మీ తల్లితండ్రులు చెప్పిన విధంగా మీ పిల్లలు మిమ్మల్ని పోలి ఉన్నట్లు మీరు గమనిస్తారు. వారినుండి విషయాలను తెలుసుకోండి.
గర్భధారణ సమయంలో స్త్రీలకు అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వాళ్ళు చాలా బలహీనమైపోతారు. మీ పరిసర ప్రాంతాలు చక్కగా, శుభ్రంగా ఉండేవిధంగా చూసుకోండి. మీ చుట్టుపక్కల ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేటట్లు చూసుకోండి. గర్భాధారణని ఆనందించండి. మీకుమీరు శ్రద్ధ తీసుకోవాలని గుర్తుంచుకోండి.



Click it and Unblock the Notifications











