Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే!
గర్భిణీలకు ఎనర్జీనిచ్చే 7 హెల్తీ డ్రింక్స్
సహజంగా మహిళలు గర్భం పొందిన తర్వాత మీరు తీసుకొనే ఆహారం చాలా ప్రధాన పాత్రపోషిస్తుంది. ఎందుకంటే ఇది, కడుపులో పెరిగే శిశువుమీద కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి, గర్భధారణ సమయంలో గర్భిణీ తీసుకొనే సమతుల్యమైన హారంలో అవసరం అయ్యే పూర్తి పోషకాలుండాలి. తల్లి తీసుకొనే పౌష్టికాహారంతోనే కడుపులో పెరిగే బిడ్డ యొక్క మెంటల్ మరియు ఫిజికల్ డెవలప్ మెంట్ ఆధారపడుతుంది.
పౌష్టికాహారం మాత్రమే కాదు, బెవరేజస్(ద్రవాలు )కూడా హైల్తీ డైట్ లిస్ట్ లో చేర్చుకోవచ్చు. ప్రెగ్నెన్సీ వల్ల డీహైడ్రేషన్ ముఖ్యంగా మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, గర్భధారణ సమయంలో ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే, హెల్తీ డ్రింక్స్ ను ఎంపిక చేసుకోవడం వల్ల మరింత ఎక్కువ ప్రభావం ఉంటుంది.
కార్బొనేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్, లేదా కమర్షియల్ ఫ్రూట్ జ్యూస్ లను నివారించాలి. ఇలాంటివి కేవలం పొట్టను నింపుతాయి, శరీరానికి ఎటువంటి క్యాలరీలను అందివ్వడు. వీటిలో ప్రత్యేమైన ఎనర్జీ కంటెంట్ లేదా మీ ఆరోగ్యానికి ఉపయోగపడేవేవి కలిగి ఉండవు. అందుకే బెవరేజస్ లో ప్యూర్ వాటర్ ఒక బెస్ట్ అండ్ గుడ్ ఆప్షన్ . అయితే, ప్లేయిన్ వాటర్ త్రాగలేము అనుకునే వారు, హెల్తీ బెవరేజస్ ను ఎంపిక చేసుకోవచ్చు.
ద్రవాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా అది మీ శరీరంను డిటాక్సిఫై చేస్తుంది, మలబద్దకంను నివారిస్తుంది. ఎడిమా తగ్గిస్తుంది మరియు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. ఇన్ని ప్రయోజనాలందించే కొన్ని ప్రత్యేకమైన బెవరేజస్ గర్భిణీ స్త్రీలకు ఎక్కువ ఉపయోగకరమైన బెవరేజస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

గ్రీన్ టీ
గర్భధారణ సమయంలో గ్రీన్ టీ తీసుకోవడం ఒక విధంగా మంచిదే. గర్భిణీలు కూడా గ్రీన్ టీ త్రాగడం ఆరోగ్యానికి మంచిదే. ఇది ఒత్తిడి తగ్గించడానికి సహాయపడుతుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

పాలు
గర్భిణీ స్త్రీలకు పాలు ఒక ఉత్తమ బెవరేజ్. ఎందుకంటే మహిళలకు అవసరం అయ్యే క్యాల్షియం అందివ్వడంలో పాలు గ్రేట్ గా సహాయపడుతాయి. ఇది సెరోటెనిన్ ను అందిస్తుంది, దాంతో మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. కానీ, పాలలో ఏ ఇతర ఆర్టిఫిషయల్ ఫ్లేవర్ పౌడర్స్ ను జోడించకండి. రోజుకు రెండు సార్లు పాలను త్రాగడం వల్ల గర్భిణీలకు చాలా అవసరం.

అవొకాడో స్మూతీస్
అవొకాడో లేదా బటర్ ఫ్రూట్ గర్భిణీలకు ఒక ఉత్తమ ఫ్రూట్. ఇది గర్భిణీలో బ్లడ్ ప్రెజర్ ను క్రమబద్దంగా ఉంచుతుంది మరియు స్ట్రెస్ హార్మోన్లను రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి, పెరుగు, పాలు, తేనెతో అవొకాడో జోడించి తయారుచేసిన జ్యూస్ లేదా స్మూతీస్ ను తీసుకోవడం మంచిది.

ఆరెంజ్ జ్యూస్
ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది గర్భిణీలో పూర్తి వ్యాధినిరోధకతను పెంచడానికి సహాయపడుతుంది . గర్భధారణ సమయంలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఇంకా, శరీరంలో వ్యర్థాలను బయటకు నెట్టుటకు కూడా ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి, గర్భధారణ సమయంలో ఆరెంజ్ జ్యూస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.

చమోమెలి టీ
గర్భిణీ స్త్రీలు తీసుకోగలిగి బెవరేజెస్ లిస్ట్ లో చాలావరకూ హెర్బల్ టీలు ఆరోగ్యం మరియు తల్లి బిడ్డకు సురక్షితం. ఈ హెర్బల్ టీలు రుచికరంగా మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా బోలెడు ప్రయోజనాలను అందిస్తుంది. ప్రెగ్నెన్సీ టిప్స్ ఒక ఉత్తమ చిట్కా గర్భధారణ సమయంలో చమోమెలీ టీని తీసుకోవాలి.

చెర్రీ జ్యూస్
ప్రెగ్నెంట్ ఉమెన్స్ కు చెర్రీ జ్యూస్ ఒక బెస్ట్ బెవరేజ్. గర్భిణీ స్త్రీలు నిద్రలేమితో బాధపడుతున్నట్లైతే చెర్రీ జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది. చెర్రీ జ్యూస్ త్రాగడం వల్ల ఒత్తిడి తగ్గిస్తుంది మరియు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. దాంతో మంచి నిద్ర వస్తుంది.

జింజర్ టీ
మీ రెగ్యులర్ డ్రింక్స్ లో జింజర్ టీ జోడించడం ఒక ఎఫెక్టివ్ ప్రెగ్నెన్సీ టిప్. చాలా వరకూ ఎక్కువగా గర్భిణీ స్త్రీలకు జింజర్ టీ త్రాగమని సలహాలిస్తుంటారు ఇది మార్నింగ్ సిక్ నెస్ ను నివారిస్తుంది మరియు దీన్ని ఒక ట్రెడిషినల్ మెడిసిన్ గా ఉపయోగిస్తుంటారు. ఇది మంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.



Click it and Unblock the Notifications