Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ప్లమ్ జ్యూస్: గర్భిణీలకు 9గొప్ప ప్రయోజనాలు
గంగరేగు పండుకన్నా కాస్త పెద్దగా.. యాపిల్‌లా ఎర్రగా నిగనిగలాడుతుండే ఆల్‌బుకారా పండ్లను చూడగానే నోరూరుతుంది. వీటినే ఇంగ్లీషులో ప్లమ్ ఫ్రూట్స్ అంటారు. ఇవి చూడటాని చిన్నగా జ్యూసిగా సింగిల్ సీడ్ తో నోరూరిస్తుంటాయి.ప్లమ్ ఫ్రూట్ లో విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ పండ్లు గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగపడుతాయి. ఇందులో అత్యధికంగా డైటరీ ఫైబర్ మరియు ఇతర న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉండి కడుపులో పిండ ఎదుగుదలకు గ్రేట్ గా సహాయపడుతాయి . అందుకే గర్భణీ స్త్రీల యొక్క డైట్ లో ఇవి తప్పనిసరిగా చేర్చడం జరిగింది.
అయితే, ఈ పండ్లతో తయారుచేసే జ్యూస్సుల త్రాగే ముందు గర్భిణీ స్త్రీలు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో ప్లమ్ ఫ్రూట్స్ వివిధ రకాలుగా లభ్యం అవుతున్నాయి. కొన్ని రకాల పండ్లలో అధిక షుగర్ కంటెంట్ ఉంటుంది. అటువంటి గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యకరమైనవి కావు. కాబట్టి, గర్భణీ స్త్రీల్ ఫ్లమ్ ఫ్రూట్ తినాలనుకొన్నప్పుడు, ఒక సారి డాక్టర్ ను సంప్రదించి ఎటువంటి బ్రాండ్ ఫ్రూట్స్ ను ఎంపిక చేసుకోవాలో అడిగి తెలుసుకోవడం అవసరం. ఇక ఈ ఫ్లమ్ ఫ్రూట్ వల్ల గర్భిణీలకు ఏవిధంగా ప్రయోజనాలు, లాభాలను అంధిస్తాయో చూద్దాం...

ప్రెగ్నెన్సీకి అవసరం ఫ్లూయిడ్స
గర్భిణీ స్త్రీలు రెగ్యులర్ గా ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం చాలా అవసరం. గర్భధారణ సమయంలో శరీరంను డీహైడ్రేట్ చేసుకోవడం చాలా సులభం మరియు ప్లమ్ జ్యూస్ లోని ద్రవాలు గర్భిణీ మహిళల శరీరం చాలా బాగా ఉపయోగపడుతాయి.

ఆరోగ్యకరంగా జీర్ణం అవుతుంది
ప్లమ్ ఫ్రూట్స్ లో డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి గొప్పగా సహాయపడుతుంది . చాలా వరకూ చాలా మంది గర్భిణీ స్త్రీలు ఎక్కువగా జీర్ణ సమస్యలను ఎదుర్కొంటుంటారు. అటువంటివారి రియల్ లైఫ్ లో ప్లమ్ జ్యూస్ చేర్చుకుంటే గొప్ప ప్రయోజనాలను తక్షణం పొందవచ్చు.

ప్లమ్ ఫ్రూట్స్ లో విటమిన్స్
ప్లమ్ జ్యూస్ ప్రయోజనాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే ఇందులో అనేక విటమిన్స్ ఉన్నాయి. విటమిన్ ఎ, సి మరియు కె. విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి మరియు కణవిభజనకు చాలా అవసరం అవుతాయి. విటమిన్ సి వ్యాధి నిరోధకను పెంచుతుంది మరియు విటమిన్ కె రక్తం గడ్డకట్టడాన్ని అరికడుతుంది.

రోగనిధకతను మెరుగుపరుస్తుంది
ప్లమ్ జ్యూస్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇటు తల్లి మరియు అటు బిడ్డలో రోగనిధోకత శక్తి మెరుగుపడుతుంది . ప్లమ్ జ్యూస్ లో విటమిన్ సి మరియు ఐరన్ ఈ రెండు కూడా శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది
చాలా మంది గర్భిణీ మహిళలు ఎదుర్కొనే మలబద్దక సమస్యను నివారించడానికి ప్లమ్ జ్యూస్ త్రాగమని సలహా ఇస్తుండి . ఈ సమస్యను చాలా వరకూ ఎక్కువ మంది మహిళలు ఈ అనుభవానికి గురై ఉంటారు.

హెల్తీ బోన్స్
ప్లమ్ జ్యూస్ లో అధిక క్యాల్షియం ఉండటం వల్ల ఇది కడుపులో పెరిగే శిశువు యొక్క ఎముకలను స్ట్రాంగ్ గా ఉంచడానికి సహాయపడుతాయి. అలాగే గర్భదారణ సమయంలో తల్లి అధికంగా క్యాల్షియంను కోల్పోతుంది. కాబట్టి తల్లికూడా ఎక్కువ క్యాల్షియం అవసరం అవుతుంది.

ఫోలిక్ యాసిడ్
గర్భిణీ స్త్రీలకు ఫోలిక్ యాసిడ్ అత్యంత అవసరం అయినటువంటి పోషకాంశం. ఫోలిక్ యాసిడ్ బ్రెయిన్, స్పైనల్ కార్డ్ మరియు నెర్వస్ సిస్టమ్ ను అభివ్రుద్దికి సహాయపడుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు ప్లమ్ జ్యూస్ త్రాగాలని సలహాలిస్తుంటారు.

డిటాక్సిఫికేషన్
ప్లమ్ జ్యూస్ గర్భిణీ మహిళలు శరీరంను డిటాక్సిఫై చేయడానికి గొప్పగా సహాయపడుతుంది. శరీరంలో మలినాలను బయటకు నెట్టివేయడానికి ఈ ప్లమ్ జ్యూగ్ సహాయపడుతుంది. దాంతో గర్భిణీలు ఆరోగ్యంగా ఉంటారు.

అధికంగా తీసుకోకూడదు
ప్లమ్ జ్యూస్ గర్భిణీలకు చాలా ప్రయోజనం. మరి అదే సమయంలో అధికంగా తీసుకోవడం వల్ల ప్రమాధంలో పడాల్సి వస్తుంది ప్లమ్ జూస్ లో విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల చాలా ఎక్కువగా తీసుకుంటే టాక్సిక్ లక్షణాలను చూపిస్తూ పుట్టుకలో లోపాలకు కారణం అవుతుంది.



Click it and Unblock the Notifications
