Latest Updates
-
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.!
గర్భధారణలో తెలుసుకోవల్సిన ముఖ్యమైన విషయాలు
గర్భధారణ సమయంలో మీకు కొత్త అనుభూతి మరియు మీ కుటుంబంలో కొత్త సభ్యుని ఆహ్వానించడం మీద మీ దృష్టి అంతా ఉంటుంది. మీ గర్భం గురించి తెలుసుకోవటానికి అనేక విషయాలు ఉన్నాయి. అయితే మీ రెండవ త్రైమాసికం ముగింపు చాలా ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన విషయం. ఆరు నెలల గర్భంలో శిశువు మరియు మీ శరీరంలో అనేక మార్పులు జరిగే సమయం అని చెప్పవచ్చు. శరీరంలో మార్పులు జరిగే కొద్ది, గర్భిణీలు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ శరీరానికి, మనస్సుకు సౌకర్యవంతంగా మార్చుకోవాలి. అటువంటి విషయాల్లో కొన్ని ముఖ్యమైన విషయాలు మీకోసం...
బ్లౌజ్ లూజ్ గా వుంటేనే మంచిది. టైట్ గా ఉండే వస్త్రాలు రక్తప్రవాహానికి ఇబ్బంది కలిగిస్తుంది. బ్రా అంత టైట్ గానూ వద్దు, అంత లూజ్ గానూ వద్దు. గర్భావస్థలో స్థనాలు పెరుగుతాయి అందువలన అవి జారిపోకుండా ఉండేందుకు తగినట్లుగా జాకెట్ ఉండాలి.

హై హీల్స్ శాండిల్ వేసుకోకూడదు. ప్లాట్ శాండిల్స్ చెప్పులు మంచిది. సింథెటిక్, పాలియస్టర్, నైలాన్ వస్త్రాలకు దూరంగా వుండాలి. ఇవి చర్మానికి మంచిదికాదు. ఈ వస్త్రాలు దురదలకు కారణం కావచ్చు.
వంటింట్లో పనిచేసేటపుడు సాదా రబ్బరు చెప్పులు కాటన్ వస్త్రాలు వాడాలి. ఈ స్థితిలో ఎప్పుడూ స్టూల్, టేబుల్ పై ఎక్కి పనిచేయ్యద్దు. మెట్లు ఎక్కిదిగేటపుడు జాగ్రత్తగా వుండాలి. మెల్లగా ఎక్కిదిగాలి. తొందరపాటు పనికిరాదు.
గర్భిణి స్త్రీలు తమ బరువు పెరుగుతున్నారా? లేదా? గమనించుకోవాలి. తొమ్మిది నెలలో గర్భిణి-ఎనిమిది లేక తొమ్మిది కిలోల బరువు పెరగాలి. పెరగనిచో ఏదో సమస్య ఉన్నట్లే. కనుక డాక్టర్ను సంప్రదించాలి. చివరి నెలలో అకస్మాత్తుగా బరువు పెరగడం మంచిది కాదు.

తల్లికాబోయే ఆమెకు మంచి పోషకాహారం ముఖ్యం. పచ్చటి ఆకుకూరలు, గుడ్లు, పండ్లు, మాంసము మొదలగు ఆహరం తీసుకోవాలి.
గర్భిణులు మూడోనెల నుంచి ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. ఎక్కువసేపు వెల్లకిలా పడుకోకుండా చూసుకోవాలి.
పగలు సాధ్యమైనంత ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి. అయితే రాత్రిపూట వాటిని పరిమితం చేయాలి-లేకపోతే ఎక్కువసార్లు మూత్రవిసర్జన నిద్రలేమికి దారితీయును.
కారం తక్కువగా ఉండే పదార్థాలు తినాలి. ఛాతీలో మంట పుట్టించే మసాలా ఆహారాన్ని మానెయ్యటమే మంచిది--చాతిలోమంట నిద్రరానివ్వదు .
పడుకునేటప్పుడు గర్భిణుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన దిండ్లు వాడుకోవాలి. అవి అందుబాటులో లేకపోతే మరో దిండును మోకాళ్ల మధ్య పెట్టుకొని పడుకోవచ్చు. పగటిపూట వీలు చేసుకొని కాసేపు కునుకు తీయాలి. నిద్ర బాగా పట్టేందుకు మనసును ప్రశాంతంగా ఉంచే పద్ధతులు పాటించాలి.



Click it and Unblock the Notifications
