Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
ప్రెగ్నెన్సీ లో ఈ 6 లక్షాణాలు కనిపిస్తే ఖచ్చితంగా డాక్టర్ ని కలవాలి
ఒక వేళ మీరు గర్భవతులయితే కనుక ప్రతీ చిన్న విషయానికీ కంగారనిపించవచ్చు.కానీ మీ ఫ్రెండ్స్,బంధువులు లేదా కుటుంబ సభ్యుల ద్వారా ప్రెగ్నెన్సీ లో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మామూలే అని తెలుసుకుని ఉపశమనం వస్తుంది.కానీ ప్రెగ్నెన్సీ లో కొన్ని సూచనలని విస్మరించకూడదు.
ఆ లక్షణాలు సాధారణమనిపించొచ్చు కానీ కాదు.ఈ లక్షణాలు వార్నింగ్ బెల్ లాంటివి. ఆ లక్షణాలు కనిపించగానే డాక్టర్ దగ్గరకి వెల్టే తల్లీ బిడ్డని కాపాడవచ్చు.
READ MORE: గర్భాదరణలో ప్రతి నెలా..9 నెలల పాటు పొట్టలో జరిగే మార్పులు
అయితే డాక్టర్ ని ఎప్పుడు పిలవాలి అని మీకు సందేహం కదూ??ఒక వేళ మీకు ఇంతకు ముందు గర్భస్రావం అయినట్లయితే ప్రతె చిన్న దానికీ డాక్టర్ ని పిలవాలనిపిస్తుంటుంది.చాలా మంది గర్భవతులు డాక్టర్ ని పిలవడానికి కూడా సంకోచిస్తారు.తరచుగా డాక్టర్ ని పిలవడం వెర్రి లా అనిపిస్తుందనో, డాక్టర్ ని ఇబ్బంది పెడుతున్నామనో అనుకుంటుంటారు.
READ MORE:గర్భం ధరించిన మొదటి 3నెలలు ఈ ఆహారం చాలా అవసరం...!
కానీ అలా అనుకోక్కరలేదు.ప్రెగ్ నెన్సీ లో వచ్చే అసాధారణ లక్షణాలని సకాలం లో గుర్తించకపోతే మీ ప్రాణాన్ని మరియు మీ బిడ్డ ప్రాణాన్ని పణం గా పెట్టవలసి రావచ్చు. ఒక వేళ మీకు ఏమైనా అసాధారణం అనిపిస్తే వెంటనే డాక్టర్ ని పిలవండి.
కింద వివరించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ని పిలవండి

మీ బిడ్డ కదలిక ఆగిపోయినప్పుడు
మీ ప్రెగ్నెన్సీ వయసు కనుక 28 వారాల కంటే తక్కువ అయితే మీ బిడ్డ కదలికలు మీరు స్థిరం గా కూర్చున్నప్పుడే తెలుస్తుంటాయి. 28 వారాలు దాటితే లోపల పిండం చాలా యాక్టివ్ గా ఉండి తరచుగా తిరుగుతూ ఉంటుంది.ఒక వేళ కదలిక తక్కువనిపిస్తే వెంటనే డాక్టర్ ని కలవాలి

తరచుగా మీకు కాంట్రాక్షన్స్ అనిపిస్తే
ప్రెగ్నెన్సీ టైం లో కాంట్రాక్షన్స్(సంకోచాలు) సహజం.ముఖ్యం గా మీరు మీ డ్యూ డేట్ ని సమీపించేకొద్దీ ఇవెక్కువవుతాయి. ఈ కాంట్రాక్షన్స్ కాస్త నెప్పి కలిగించినా తరచుగా ఉండదు. ఒక వేళ కాంట్రాక్షన్స్ గంట కి ఆరు సార్లు కంటే ఎక్కువ అనిపిస్తే వార్నింగ్ బెల్ మోగిందన్నమాటే. ఇవి ముందస్తు ప్రసూతి నెప్పులకి సూచిక. మీ డాక్టర్ కి ఫోను చేస్తే మీరు అప్పుడు ఇంట్లో ఏమి చెయ్యాలో హాస్పిటల్లో ఎప్పుడు చేరాలో చెప్తారు

అధిక రక్స్తస్రావం:
ఒక శానిటరీ ప్యాడ్ నిండేంత రక్తస్రావం ప్రమాదకరం కాదు. ఒక వేళ మీ బహిష్టు సమయం లో అయినట్లుగా అధికం గా అవుతోంటే మాత్రం ఆందోళన చెందాల్సిన విషయం.మీకు అధిక రక్త స్రావమవుతున్నా లేదా ప్లాసెంటా(మాయ) గర్భాశయాన్ని బ్లాక్ చేస్తున్నా(ప్లాసెంటా ప్రీవియా అంటారు దీనిని)మీ డాక్టర్ ని పిలవాలి.లేదంటే తల్లీ, బిడ్డా ఇద్దరికీ ప్రమాదకరం

అధిక లేద అత్యల్ప గ్లూకోజు శాతం
ప్రెగ్ నెన్సీలో వచ్చే డయాబేటిస్ ని”జెస్టేషనల్ డయాబేటిస్”అంటారు.ఒక వేళ మీకు ఇది ఉంటే తరచుగా మీ రక్తం లోని చక్కెర శాతాన్ని చూసుకుంటూ ఉండాలి.ఒకోసారి ప్రెగ్నెన్సీ లో వచ్చే డయాబేటిస్ చాలా ప్రమాదకరం.చక్కెర శాతం పెరిగినా లేదా బాగా తగ్గిన అత్యవసరం గా డాక్టర్ ని సంప్రదించాలి

ఉదరభాగం లో భరించలేని నెప్పి:
ఉదరభాగం లో అప్పుడప్పుడూ నెప్పి కలగడం సహజం ప్రెగ్నెన్సీ లో. మలబద్ధకం, చిన్న చిన్న కాన్ ట్రాక్షన్స్ లేదా రవుండ్ లిగమెంట్ పెయిన్ అనబడే నాభి ప్రాంతం లో వచ్చే నెప్పి లాంటివి సాధారణ కారణాలు.కానీ ఈ నెప్పి భరించలేనంతగా వస్తోంటే అశ్రద్ధ చేయకూడదు. ఒకోసారి ఈ నెప్పి గర్భాశయ చీలికకి సంకేతం.ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ.సరైన సమయం లో తెలుసుకోలేకపోతే తల్లీ బిడ్డ కి ప్రమాదకారి. మీకు భరించలేని నెప్పి వస్తే మాత్రం వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి

ఉమ్మనీరు లీక్ అవ్వడం:
మీ డ్యూ డేట్ కంటే ముందే ఉమ్మ నీరు లీకవుతోంటే మీ బిడ్డకి ప్రమాదం.ఉమ్మనీరు తగినంత లేకపోవడం వల్ల బిడ్డ ఎదుగుదల సరిగా ఉండదు. ఒకోసారి ఇది బిడ్డ అకాల జననం లేదా మరణానికి దారితీయవచ్చు.తల్లికి తీవ్రమైన ఇన్ ఫెక్షన్ కూడా రావచ్చు.ఒకవేళ మీ యోనీ లో నుండి ఏమైన ద్రవం లాంటి పదార్ధం వస్తోందనిపిస్తే డాక్టర్ ని కలవండి.



Click it and Unblock the Notifications